(Source: ECI/ABP News/ABP Majha)
Weight loss: ఈ కూరల్లో కొలెస్ట్రాల్ తక్కువ, బరువు తగ్గాలనుకునే వాళ్లకి ప్రత్యేకం
బరువు తగ్గాలని ప్రయత్నించే వాళ్లే ఏం తిన్నాలన్నా భయపడతారు, ఎక్కడ బరువు పెరుగుతామేమోనని.
బరువుపై ధ్యాసతో ఆరోగ్యకరమైన ఆహారానికి దూరం కావద్దు. తక్కువ ఫ్యాట్ ఉండి, శక్తిని అందించే ఆహారాన్ని ఎంపిక చేసుకుని తింటే చాలా మంచిది. ఇక్కడ చెప్పిన కూరల్లో ఫ్యాట్ తక్కువ ఉంటుంది, కానీ శక్తి మాత్రం అందుతుంది. కాబట్టా ఊబకాయం ఉన్న వారు, డైటింగ్ లో ఉన్నవారు వీటిని తినొచ్చు.
1. పుట్టగొడుగులు - గ్రీన్ పీస్ కర్రీ
పుట్టగొడుగులు ఆరోగ్యకరమైనవి. ఇందులో కేలరీలు తక్కువ. అయితే ఇది వండేటప్పుడు బటర్, పనీర్ వంటివి వేయకుండా వండుకోండి. అవి వేస్తే కేలరీలు అధికంగా అందుతాయి. పుట్టగొడగుల్లో గుప్పెడు ఆకుపచ్చ బఠానీలు వేసుకుని వండుకునే చాలా మంచిది. ఈ కూరలో రుచిలో కూడా అద్భుతంగా ఉంటుంది.
2. కాలీఫ్లవర్ కూర
బరువు తగ్గాలనుకునే వారు ఆకుకూరలు, కూరలు అధికంగా తిని అన్నం, బిర్యానిల్లాంటివి తగ్గిస్తే చాలా మంచిది. కాలీఫ్లవర్ కూడా మీకు ఉత్తమైన ఎంపిక అని చెప్పవచ్చు. ఇందులో కేలరీలు తక్కువగా ఉండి, ఐరన్, కాల్షియం, మెగ్నిషియం, విటమిన్ డి, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. కాబట్టి కాలీఫ్లవర్ కూరని తరచూ మీ ఆహారంలో భాగం చేసుకోండి. బరువు పెరుగుతామనే భయాన్ని పక్కన పెట్టండి.
3. కొమ్ము శెనగల కూర
కొమ్ముల శెనగలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో మాంగనీస్, ఫొలేట్, కాపర్, ఐరన్, జింక్, ఫాస్పరస్, సెలీనియం, పొటాషియం, విటమిన్లు ఉంటాయి. వీటిని తినడం వల్ల బరువు పెరగరు, జీర్ణక్రియ కూడా మెరుగు పడుతుంది, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సాయపడుతుంది. ఇందులో ప్రొటీన్ లభిస్తుంది.
4. పప్పులు
వివిధ రకాల పప్పుల్లో ప్రోటీన్లు, విటమిన్లు ఉంటాయి. వండేటప్పుడు వీటికి బచ్చలి కూరను జోడించి వండితే మరిన్ని లాభాలు పొందచ్చు. పప్పును తగిన మోతాదులో తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరగదు. కాబట్టి తింటే ఏం ప్రమాదం లేదు. పప్పులు మధుమేహాన్ని నిరోధించేందుకు సహకరిస్తాయి, అలాగే పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని అడ్డుకుంటాయి.
5. కిడ్నీ బీన్స్ కూర
కిడ్నీ బీన్స్ ఒక రకమైన పప్పు ధాన్యాలు. బరువు తగ్గించడానికి సాయపడుతుంది. ఈ రెడ్ బీన్స్ లో ఐరన్, ప్రోటీన్, ఫైబర్, కాపర్, విటమిన్ కె, వంటి పోషకాలు ఉంటాయి. కిడ్నీ బీన్స్ కూరను చపాతీతో లేదా కప్పు అన్నంతో కలిపి తినడం వల్ల అధిక నాణ్యమైన పోషకాలు లభిస్తాయి. అయితే కిడ్నీ బీన్స్ ముందే బాగా ఉడికించాలి. లేకుంటే అరగక పొట్ట ఉబ్బరానికి దారితీస్తుంది.
Read Also: నల్లకోడి చికెన్, గుడ్లు తింటే ఇన్ని లాభాలా? అందుకేనా దానికంత రేటు...
Read Also: అబద్ధాలకోరును ఇలా గుర్తించండి... మోసపోకుండా జాగ్రత్త పడండి
Read Also: వాషింగ్ మెషీన్లతో పిరమిడ్... ఎన్ని వాషింగ్ మెషీన్లు వాడారో తెలుసా?
Read Also: గుడ్డుతో పాటూ వీటిని తినకూడదు, తింటే ఈ సమస్యలు తప్పవు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి