World Record: వాషింగ్ మెషీన్లతో పిరమిడ్... ఎన్ని వాషింగ్ మెషీన్లు వాడారో తెలుసా?
వరల్డ్ రికార్డులంటే చాలా మందికి ఆసక్తి. అలాంటి ఆసక్తి ఉన్న వారే రికార్డులను నెలకొల్పుతారు.
వరల్డ్ రికార్డులు కేవలం ఆనందం కోసమే కాదు, చైతన్యవంతులను చేయడానికి కూడా నెలకొల్పుతుంటారు. అలా బ్రిటన్ లో ఎలక్ట్రానిక వేస్టేజ్ పై అవగాహన కల్పించేందుకు ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో వాషింగ్ మెషీన్లతో పెద్ద పిరమిడ్ ను నిర్మించారు. 44.7 అడుగుల ఎత్తున్న ఆ పిరమిడ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కింది. ఇందులో దాదాపు 1496 వాహింగ్ మెషీన్లను వినియోగించారు. ఇంతవరకు ఇలా వాషింట్ మెషీన్లతో ఇంత ఎత్తున పిరమిడ్ ఆకారాన్ని నిర్మించలేదు. దీంతో ఈ ఫీట్ వరల్డ్ రికార్డుగా మారింది.
ఓ సర్వే ప్రకారం 68శాతం బ్రిటిష్ ప్రజలు తమ ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఎలా పారవేయాలో తెలియక అయోమయంలో ఉన్నారు. అందుకే ఓ ఎలక్ట్రానిక్ కంపెనీ ప్రజల్లో చైతన్యం నింపేందుకు ఇలా చేశారు. సెప్టెంబర్ 2021లో ‘నేషనల్ రీసైక్లింగ్ వీక్’ జరిగింది. ఆ సందర్భంగా అతి పెద్ద వాషింగ్ మెషీన్ పిరమిడ్ ను ప్లాన్ చేసింది సంస్థ. పిరమిడ్ ను నిర్మించేందుకు ఎలాంటి ఆధారాన్ని, పడిపోకుండా ఉండేందుకు తాళ్లు కట్టడం వంటివి ఉపయోగించలేదు. కేవలవ వాహింగ్ మెషీన్లను ఒకదానిపై ఒకటి నిలబెట్టారు. పై వరకు అలానే నిలెబెట్టారు. అయితే అంత ఎత్తుకు మెషీన్లను ఎత్తుకుని తీసుకెళ్లలేరు కాబట్టి, క్రేన్ సాయాన్ని తీసుకున్నారు. ఈ పిరమిడ్ నిర్మాణంలో వాడిన మెషీన్లన్నీ రైసైక్లింగ్ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నవే.
ఈ కార్యక్రమంలో భాగంగా వారికి పాడైన పాత ఎలక్ట్రానిక్ వస్తువలను ఏం చేయాలో, రీసైక్లింగ్ కు పంపించేందుకు ఎవరికి ఫోన్ చేయాలో వంటి వివరాలు చెప్పారు.
Read Also: గుడ్డుతో పాటూ వీటిని తినకూడదు, తింటే ఈ సమస్యలు తప్పవు
Read Also: ఇలాంటి పేపర్ ప్లేట్లలో రోజూ భోజనాలు లాగిస్తున్నారా? అయితే ఈ రోగాలు రాక తప్పవు
Read Also: ఈ మూడు వంటలు ప్రెషర్ కుక్కర్లో వండకూడదు... అయినా వండేస్తున్నాం
Read Also: ల్యాప్‌టాప్‌ను డిటెర్జెంట్‌తో ఉతికేసిన భార్య, ఆమె అతి శుభ్రత జబ్బుతో వేగలేనంటున్న భర్త, వీరి కథలో ఎన్ని ట్విస్టులో...
Read Also: నేడే సంపూర్ణ సూర్య గ్రహణం... మనకి కనిపించదు, అయినా సరే గ్రహణ సమయంలో ఈ పనులు చేయకూడదంటారు
Read Also: శీతాకాలంలో కరోనాను తట్టుకునే శక్తి కావాలంటే... ఇవన్నీ తినాల్సిందే
Read Also: ఈ ఆరు లక్షణాలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోకండి... జీవితం నరకమైపోతుంది
Read Also: ఛీ.. దరిద్రుడు, కారు నడుపుతూ డ్రైవర్ పాడుపని.. మహిళకు ఊహించని చేదు అనుభవం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి