Corona virus: శీతాకాలంలో కరోనాను తట్టుకునే శక్తి కావాలంటే... ఇవన్నీ తినాల్సిందే
కరోనా వచ్చినప్పట్నించి ఎన్నో వేరియంట్లు దాడి చేశాయి... వాటన్నింటినీ తట్టుకునే శక్తి ఒక్క టీకాలే కాదు, ఆహారం కూడా అందిస్తుంది.
ఆల్ఫా, బీటా, గామా, డెల్టా... ఇప్పుడు ఒమిక్రాన్. భవిష్యత్తులో ఇంకెన్ని వేరియంట్లు వస్తాయో కూడా తెలియదు. టీకాలనే నమ్ముకుంటే కుదరదు. సీజన్ పరంగా రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. కరోనా కొత్త రూపాలను తట్టుకోవాలంటే శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలి. అందుకే పోషకాహారనిపుణులు ప్రత్యేకంగా ఇమ్యూనిటిని పెంచే ఆహారాన్ని తీసుకోమని సిఫారసు చేస్తున్నారు. ముఖ్యంగా చలికాలంలో సాధారణంగానే మన రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందుకే ఈ కాలంలో ప్రత్యేక ఆహారాన్ని తినాల్సిందే. ముఖ్యంగా విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి.
సీజనల్ ఆహారం...
1. ఈ కాలంలో ఉసిరి కాయలు బాగానే దొరుకుతాయి. అందులోనూ వీటిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి రోజూ రెండు మూడు ఉసిరికాయలు తినడం అలవాటు చేసుకోవాలి. అలాగే మార్కెట్లో దొరికే ఉసిరి పొడులను కూడా వాడుకోవచ్చు.
2. చిలగడ దుంపలు దొరికే కాలం కూడా ఇదే. కాబట్టి రోజుకొక దుంప ఉడకబెట్టుకుని తినేయండి. పిల్లల చేత కూడా తినిపించండి. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
3. గుమ్మడికాయల కూర చేసుకోవడానికి ఎవరూ ఇష్టపడరు కానీ, దాని వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. గుమ్మడి కూరను తింటే చాలా మంచిది. అలాగు రోజూ గుప్పెడు గుమ్మడి గింజలను తింటే చాలా మంచిది. వీటి ధరలు కూడా అధికంగా ఉండవు కాబట్టి, అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులో ఉంటాయి.
4. దానిమ్మ,నారింజ పండ్లను కూడా తరచూ తినాలి.
5. బాదం పప్పు, పిస్తాలు, వాల్ నట్స్ కలిపి రోజూ ఒక గుప్పెడు తినాలి.
6. రోజూ గ్లాసు పాలను తాగాలి. అందులో పసుపు వేసుకుని తాగితే మరీ మంచిది. ఆయుర్వేదం ప్రకారం అశ్వగంధపొడిని వేసుకున్నా కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
7. మునగాకులను, మునక్కాడలను ఆహారంలో భాగం చేసుకోవాలి.
8. వంటల్లో పసుపు వాడకాన్ని కూడా పెంచాలి. అలాగని మరీ ఎక్కువ వేసుకుంటే వేడి చేసి పొట్టనొప్పి వచ్చే అవకాశం ఉంది.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Read also: ఇలాంటి పేపర్ ప్లేట్లలో రోజూ భోజనాలు లాగిస్తున్నారా? అయితే ఈ రోగాలు రాక తప్పవు
Read also: ఈ మూడు వంటలు ప్రెషర్ కుక్కర్లో వండకూడదు... అయినా వండేస్తున్నాం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి