Don't Marry: ఈ ఆరు లక్షణాలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోకండి... జీవితం నరకమైపోతుంది
జీవితంలో ముఖ్యమైన ఘట్టం పెళ్లి. జీవితభాగస్వామిని ఎంచుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
మిస్ పర్‌ఫెక్ట్ లేదా మిస్టర్ పర్‌ఫెక్ట్‌లు చెప్పుకోవడానికే కానీ, అలాంటివాళ్లను కనిపెట్టడం కష్టమే. ఎందుకంటే ప్రతి మనిషిలో ఏదో ఒక చిన్నలోపమైనా ఉంటుంది. మిస్టర్ పర్‌ఫెక్ట్‌లను చేసుకోకపోయినా ఫర్వాలేదు కానీ, ఈ ఆరు లక్షణాలు ఉన్నవారిని మాత్రం జీవిత భాగస్వామిగా చేసుకోవద్దని చెబుతున్నారు మనస్తత్వశాస్త్రవేత్తలు. వీరితో జీవనం కాలం గడిచేకొద్దీ కష్టతరమైపోతుందని అంటున్నారు.
1. ప్రామిస్ బ్రేకర్
ఒకసారి రెండోసార్లో కాదు తరచూ వీళ్లు ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకోరు. ఒకట్రెండు సార్లయితే క్షమించవచ్చు కానీ వీరికి ఇచ్చిన మాట విలువ తెలియదు. ప్రామిస్ బ్రేవర్ల వల్ల రోజూ ఇంట్లో ఏదో ఒక గొడవ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీరు ప్రామిస్ చేయడం అనేది ఒక చిన్నవిషయం.
2. నియంత లక్షణాలు
ఇది తిను, ఈ డ్రెస్ వేసుకో, ఇలాగే నడువు, ఇక్కడ నిల్చో... ప్రతి విషయంలోనూ పక్కవాళ్లను కంట్రోల్ చేసే లక్షణాలున్న వ్యక్తి కూడా మంచి జీవితభాగస్వామి కాలేడు. వీరికి నియంత లక్షణాలు ఎక్కువుంటాయి. భార్యను లేదా భర్తను ప్రేమించడం కన్నా తన అదుపులో ఉంచుకోవడానికే ఎక్కువ ప్రాధానత్యనిస్తారు.
3. ప్రాధాన్యతనివ్వని వ్యక్తి
ఇవ్వడం, తీసుకోవడం, పంచుకోవడం... అన్నీ పెళ్లిచేసుకోవాలనుకుంటున్న ఇద్దరి మనుషుల మధ్య సమానం ఉండాలి. తీసుకోవడమే కానీ ఇవ్వడం అలవాటు లేని వ్యక్తితో కష్టాలు పడాల్సి ఉంటుంది. వారు ఎదుటి వ్యక్తికి తక్కువ ప్రాధాన్యతనిస్తారు.
4. పదే పదే సారీ చెప్పేవాళ్లు
తప్పు చేయడం సారీ చెప్పడం, మళ్లీ అదే తప్పు రిపీట్ చేయడం, సారీ చెప్పి తప్పించుకోవడం... ఈ అలవాటున్న వ్యక్తులు కూడా మంచి లైప్ పార్ట్నర్ కాలేరు. వారికి సారీ విలువ తెలియదు. అదొక ఊతపదం అంతే.
5. అహంకారం
ఎంతోకొంత అహంకారం ప్రతి మనిషిలోనూ ఉంటుంది. కానీ హద్దులు దాటితే మాత్రం బంధం నిలబడదు. నేను, నాది, నేను చెప్పినట్టు వినాలి, నువ్వు నాకు చెప్పేదేంటి... ఇలా అహంకారం చూపించే వ్యక్తికి దూరంగా ఉండడం మంచిది.
6. అబద్ధాల కోరు
అబద్ధాలు చెప్పే వ్యక్తిని ఎప్పుడూ మీ జీవితంలోకి ఆహ్వానించకండి. అది కూడా ఒక మానసికరోగ లక్షణమే. ప్రతి చిన్న విషయంలోనూ అబద్దాలు చెప్పే వ్యక్తి మీతో జీవితాంతం ఎంతవరకు నమ్మకంగా ఉండగలడో ఆలోచించుకోండి.
Read Also: టమోటో సూప్‌ను ఇలా చేసుకుని తాగండి... క్యాన్సర్‌ను కూడా అడ్డుకుంటుంది
Read Also: ఎయిడ్స్ లక్షణాలు ఏంటి? ఆ రోగులు ఏం తినాలి? ఏం తినకూడదు?
Read Also: కొత్త వేరియంట్ కమ్ముకుంటున్న వేళ... ఎవరికి బూస్టర్ డోస్ అవసరం?
Read Also: అన్నం తింటే బరువు పెరుగుతామని భయమా... వండే స్టైల్ మార్చండి, బరువు తగ్గుతారు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి