అన్వేషించండి

Booster Dose: కొత్త వేరియంట్ కమ్ముకుంటున్న వేళ... ఎవరికి బూస్టర్ డోస్ అవసరం?

ఇప్పుడిప్పుడే కోవిడ్‌తో కలిసి జీవించడమే అన్న ఆలోచనకు అలవాటుపడుతున్నాం. ఈలోపే కొత్త వేరియంట్ వచ్చి పడింది.

ఒమిక్రాన్... కరోనా కొత్త వేరియంట్. ఇప్పుడిప్పుడు కోలుకుంటున్న ప్రపంచంపై పిడుగులా పడింది. మొదటిసారి దక్షిణాఫ్రికాలో బయటపడిన ఈ కొత్త వేరియంట్ వ్యాపిస్తుందేమోనని ఇతర దేశాల ప్రజలు, ప్రభుత్వాలు భయపడుతున్నాయి. మనదేశంలో ఇంకా కొత్త వేరియంట్ కు సంబంధించి ఒక్క కేసు నమోదు కాలేదు కానీ భయాందోళనలు మాత్రం పెరుగుతున్నాయి. ఓమిక్రాన్ వేరియంట్ పై మన టీకాలు అంత ప్రభావవంతంగా లేవని వార్తలు రావడంతో సహజంగానే ఆందోళన మొదలవుతుంది. అంతేకాదు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వాళ్లు బూస్టర్ డోస్ అవసరమా అని కూడా ఆలోచిస్తున్నారు. 

ముంబైకి చెందిన ఛాతీ వైద్య నిపుణులు డాక్టర్ ఆగమ్ వోరా మాట్లాడుతూ ‘బూస్టర్ డోస్ వేయించుకోవాలా వద్దా అనే అంశం గురించి చర్చించడం కూడా చాలా అవసరం. ప్రస్తుతం వేసిన టీకాలు తీవ్రమైన ఇన్ఫెక్షన్, మరణాలను అడ్డుకోవడంలో ప్రభావంతంగా పనిచేస్తున్పన్పటికీ, వైరస్ వ్యాప్తిని ఆపడంలో మాత్రం నూటికి నూరు శాతం ప్రభావవంతంగా పనిచేయవు. వ్యక్తి రోగనిరోధక స్థితిని పరీక్షిస్తే... బూస్టర్ డోస్ అవసరమో కాదో తెలుస్తుంది’ అని అన్నారు. 

ఎవరికి అవసరం?
కొంతమందిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వారికి బూస్టర్ డోస్ అవసరం పడుతుంది. అలాగే రేడియోథెరపీ, కీమోథెరపీ, స్టెరాయిడ్లు, ఇతర ఇమ్యునోసప్రెసెంట్స్ తీసుకునే వ్యక్తులు, 65 ఏళ్లు పైబడిన వయసు కలిగిన వ్యక్తులు, మధుమేహ రోగులు, దీర్ఘకాలిక వ్యాధులైన మూత్రపిండ, కాలేయ వ్యాధి రోగులుకు బూస్టర్ డోస్ అవసరం పడొచ్చు. అలాగే రోగుల మధ్య నిత్యం తిరిగే హెల్త్ కేర్ వర్కర్లకు కూడా బూస్టర్ డోస్ వేస్తే మంచిది.  

ఒమ్రికాన్‌ను చూసి భయపడాలా?
ఈ వేరియంట్ గురించి బయటపడి వారమే అయ్యింది. వ్యాప్తి చెందే రేటు కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉన్నట్టు పరిశోధనల్లో తేలింది. అయితే ఇప్పటివరకు ఒమ్రికాన్ వల్ల పెరిగిన మరణాల గురించి మాత్రం స్పష్టమైన నివేదికలు లేవు. ఇది ప్రపంచంపై మళ్లీ విరుచుకుపడే వేరియంటా కాదా అని తేల్చలేకపోతున్నారు వైద్యులు. ఎందుకంటే కొత్త వేరియంట్ వచ్చినప్పుడల్లా దాని క్లినికల్ ప్రొఫైల్, దాని తీవ్రత, వ్యాప్తి అర్థం చేసుకోవడానికి ఒక నెల పడుతుంది. టీకా రోగనిరోధక శక్తితో లేదా మోనోక్లోనల్ రోగనిరోధక శక్తితో ఈ వేరియంట్ ఎలా ప్రవర్తిస్తుందో అర్థం చేసుకోవడానికి మరొక నెల పడుతుంది. కాబట్టి ఒమ్రికాన్ గురించి పూర్తిగా తెలియడానికి మరికొంత సమయం పడుతుంది.  

Also read: నాలుగు రోజులుగా సిరివెన్నెల ప్రాణం నిలిచింది ‘ఎక్మో’పైనే... ఎక్మో అంటే? అదెలా ఆయన ప్రాణాలు నిలిపింది?

Also read: అన్నం తింటే బరువు పెరుగుతామని భయమా... వండే స్టైల్ మార్చండి, బరువు తగ్గుతారు

Read Also: కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్... మొదటి ఫోటో విడుదల చేసిన పరిశోధకులు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Hot Water For Blood Pressure : వేడి నీళ్లతో బీపీ తగ్గుతుందా? తాగితే మంచిదా? స్నానం చేస్తే బెటరా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
వేడి నీళ్లతో బీపీ తగ్గుతుందా? తాగితే మంచిదా? స్నానం చేస్తే బెటరా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Hair Growth Oils for Men : మగవారిలో జుట్టు రాలడం సమస్యను తగ్గించే నూనెలు ఇవే.. ఎలా అప్లై చేస్తే మంచిదంటే
మగవారిలో జుట్టు రాలడం సమస్యను తగ్గించే నూనెలు ఇవే.. ఎలా అప్లై చేస్తే మంచిదంటే
Curry Leaves Rice Recipe : కరివేపాకు రైస్ రెసిపీ.. మిగిలిపోయిన అన్నంతో కూడా ఇలా టేస్టీగా చేసేయండి
కరివేపాకు రైస్ రెసిపీ.. మిగిలిపోయిన అన్నంతో కూడా ఇలా టేస్టీగా చేసేయండి
Exercise Without Rest : రెస్ట్ లేకుండా రోజూ వ్యాయామం చేస్తే వచ్చే సమస్యలు ఇవే.. శరీరం ఇచ్చే హెచ్చరికలు మిస్ కావద్దు
రెస్ట్ లేకుండా రోజూ వ్యాయామం చేస్తే వచ్చే సమస్యలు ఇవే.. శరీరం ఇచ్చే హెచ్చరికలు మిస్ కావద్దు

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amit Shah Telangana BJP Padayatra: తెలంగాణపై అమిత్ షా కన్ను - హైదరాబాద్ పాదయాత్రతో బీజేపీ గేర్ మార్చబోతుందా?
తెలంగాణపై అమిత్ షా కన్ను - హైదరాబాద్ పాదయాత్రతో బీజేపీ గేర్ మార్చబోతుందా?
Raptadu Girl Attack Case: రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
School Holidays: మురసు తుపాను ఎఫెక్ట్.. ఏపీలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
మురసు తుపాను ఎఫెక్ట్.. ఏపీలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
KTR: కరువు పరిస్థితులకు రేవంత్ రెడ్డిదే బాధ్యత.. రైతులకు రూ.60 వేలు చెల్లించాలి: కేటీఆర్
కరువు పరిస్థితులకు రేవంత్ రెడ్డిదే బాధ్యత.. రైతులకు రూ.60 వేలు చెల్లించాలి: కేటీఆర్
Murasu Cyclone: దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
Rohit Will Play Domestic Cricket: వరల్డ్ కప్ వేటలో హిట్ మ్యాన్ సంచలన నిర్ణయం.. డొమెస్టిక్ క్రికెట్ లోకి రీఎంట్రీ..
వరల్డ్ కప్ వేటలో హిట్ మ్యాన్ సంచలన నిర్ణయం.. డొమెస్టిక్ క్రికెట్ లోకి రీఎంట్రీ..
Hot Water For Blood Pressure : వేడి నీళ్లతో బీపీ తగ్గుతుందా? తాగితే మంచిదా? స్నానం చేస్తే బెటరా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
వేడి నీళ్లతో బీపీ తగ్గుతుందా? తాగితే మంచిదా? స్నానం చేస్తే బెటరా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
2027లో ఈ అద్భుతమైన బైక్స్ ఎంట్రీ.. మీరు కొరుకునే లగ్జరీ బైక్స్ ఉన్నాయా చూడండి
2027లో ఈ అద్భుతమైన బైక్స్ ఎంట్రీ.. మీరు కొరుకునే లగ్జరీ బైక్స్ ఉన్నాయా చూడండి
Embed widget