Bumrah ICC Mens Test Cricketer of The Year | బౌలింగ్ తో అదరగొట్టాడు..ఐసీసీ కిరీటాన్ని ఒడిసి పట్టాడు | ABP Desam
టీమిండియా పేస్ పాశుపతాస్త్రం జస్ ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యాడు. నిప్పులు చెరిగే బంతులతో 2024 ను తనదిగా మార్చుకున్న బుమ్రా టెస్టుల్లో టీమిండియా ఆడిన అన్ని దేశాల మీద అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చాడు. 13 టెస్టులు మాత్రమే ఆడినా 71వికెట్లు తీసుకుని 2024లో టాప్ వికెట్ టేకర్ గా టీమిండియాలోనే కాదు వరల్డ్ లోనే నెంబర్ 1 బౌలర్ గా బూమ్ బూమ్ సంచలనాలే రేపాడు. సెకండ్ పొజిషన్ లో ఉన్న ఇంగ్లండ్ బౌలర్ గస్ అట్కిన్ సన్ 52 వికెట్లు మాత్రమే తీసుకున్నాడంటే...ఆ తేడా చెబుతోంది బుమ్రా వరల్డ్ క్రికెట్ లో ఎంత డామినేట్ చేశాడో అని.
రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే, కపిల్ దేవ్ తర్వాత ఓ క్యాలెండర్ ఇయర్ లో 70కి పైగా టెస్టు వికెట్లు తీసిన బౌలర్ నాలుగో బౌలర్ గా నిలిచాడు బుమ్రా. ఓ క్యాలెండర్ ఇయర్ లో 70కి పైగా వికెట్లు తీసిన బౌలర్లు 17మంది ఉంటే వారిలో ఎవరూ కూడా బుమ్రా అంత తక్కువ యావరేజ్ తో బౌలింగ్ వేయలేదు. సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ లో కేప్ టౌన్ టెస్టు లో 8వికెట్లు తీయటం మొదలు..ఇంగ్లండ్ సిరీస్ లో 19వికెట్లు...ఇక ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 5 టెస్టుల్లోనే 32వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. బీజీటీ ని టీమిండియా ఓడిపోయినా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ మాత్రం బుమ్రానే అంటే అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం 31ఏళ్ల వయస్సులో ఉన్నా బుమ్రా పేరు మీద ఓ రికార్డు ఉంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో కనీసం 200వికెట్లు తీసిన ఏ బౌలర్ కూడా 20 కంటే తక్కువ యావరేజ్ తో బౌలింగ్ చేయలేదు.





















