(Source: ECI/ABP News/ABP Majha)
First Image of Omicron: కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్... మొదటి ఫోటో విడుదల చేసిన పరిశోధకులు
కరోనా సెకండ్ వేవ్ తరువాత పరిస్థితులు సద్దుమణుగుతుండగా... మరో కొత్త వేరియంట్ వచ్చి ప్రపంచాన్ని కలవరపెడుతోంది.
మూడోవేవ్ భయం ఇంకా తగ్గలేదు, రెండో వేవ్ లో జరిగిన అల్లకల్లోలాన్ని ఇంకా మరిచిపోలేదు... ఈలోపే కొత్త వేరియంట్ పుట్టుకొచ్చి కలవరపెడుతోంది. డెల్టా వేరియంట్ భయంతోనే ఓ పక్క నలిగిపోతుంటే, ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ నెత్తిపై పిడుగులా పడింది. 26 నవంబర్ 2021న, ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ వైరస్ ఎవల్యూషన్ సలహా మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) B.1.1.529 వేరియంట్‌ను ఒమిక్రాన్ అనే ఆందోళన కలిగించే కరోనా వేరియంట్ గా గుర్తించింది. అప్పటినుంచి ప్రపంచమంతా మళ్లీ భయం గుప్పిట్లోకి వెళ్లిపోయింది. కాగా ఒమిక్రాన్ వేరియంట్ కు సంబంధించి ఒక్క ఫోటోను కూడా పరిశోధకులు విడుదల చేయలేదు. ఇప్పుడు ఇటలీకి చెందిన బాంబినో గెసు రీసెర్చ్ గ్రూప్, స్టేట్ యూనివర్సిటీ ఆప్ మిలన్ సంస్థలు కలిసి ఈ కొత్త వేరియంట్ కు చెందిన మొట్టమొదటి ఫోటోను విడుదల చేశారు.
మొదటి ఫోటో ఏం చెబుతోంది...
ఈ ఫోటో ఒమిక్రాన్ వేరియంట్ మానవకణాలపై ఎలా పనిచేస్తుందో తెలియజేసేది. దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే ఓమ్రికాన్ వైరస్ వేరియంట్ మానవ కణాలతో సంఘర్షణ చెందే ప్రాంతంలో ఎక్కువ మ్యుటేషన్లు సంభవించినట్టు కనుగొన్నారు. మ్యుటేషన్లు అధికంగా కలుగుతుండడం వల్ల మానవ శరీరం ఎలా స్పందిస్తుందో, వైరస్ స్పైక్స్ ఎలా మానవకణంలోకి ప్రవేశించడానికి ఆస్కారం ఉంటుందో టీకాలు కనిపెట్టిన శాస్త్రవేత్తలే చెప్పాలి. ఈ మొదటి చిత్రంలో డెల్టా వేరియంట్‌తో, ఒమిక్రాన్ వేరియంట్ ను పోల్చారు పరిశోధకులు. ఈ ఫోటో ద్వారా డెల్టా కన్నా ఒమిక్రాన్ వేరియంట్ వల్లే అధికంగా మ్యుటేషన్లు జరుగుతున్నట్టు అర్థం అవుతోంది. అందుకే ప్రపంచఆరోగ్యసంస్థ కూడా ఈ కొత్త వేరియంట్ ను చూసి భయపడుతోంది. ఈ వేరియంట్ వల్ల మూడో వేవ్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అని కలవరపడుతోంది.
తొలిసారి దక్షిణాఫ్రికాలో...
తొలిసారిగా ఈ కొత్త వేరియంట్ దక్షిణాఫ్రికాలో బయటపడింది. అక్కడ ఓ ఆసుపత్రికి డెల్టా వేరియంట్ కన్నా భిన్నమైన లక్షణాలతో ఏడురుగు రోగులు ఆసుపత్రికి వచ్చారు. వీరందరికీ చాలా స్వల్ప లక్షణాలు కనిపించాయి. ఈ ఘటన నవంబర్ 18న జరిగింది. వారం రోజుల తరువాత నవంబర్ 25న దక్షిణాఫ్రికాకు చెందిన ఆరోగ్య సంస్థ ఒమిక్రాన్ గురించి ప్రపంచానికి తెలియజేసింది.
Read Also: రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు చాలా? ఎక్కువ తాగితే ప్రమాదమా?
Read Also: శీతాకాలంలో ఏ సమయంలో తగిలే ఎండ వల్ల విటమిన్ డి లభిస్తుంది? వైద్యులు ఏం చెబుతున్నారు?
Read Also: మీ జీవితభాగస్వామిపై నమ్మకం పోయిందా? అయితే ఇలా చేయండి, బంధాన్ని నిలబెట్టుకోండి...
Read Also: ఇంట్లో ఇవి ఉంటే నెగిటివ్ ఎనర్జీ... డబ్బును రాకుండా అడ్డుకుంటాయి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి