X

Trust Your Spouse: మీ జీవితభాగస్వామిపై నమ్మకం పోయిందా? అయితే ఇలా చేయండి, బంధాన్ని నిలబెట్టుకోండి...

వివాహబంధంలో నమ్మకం అన్నింటికంటే చాలా ముఖ్యం. అది లేకపోతే ఏ బంధం నిలబడదు.

FOLLOW US: 

ఏ బంధమైనా నిలబడేది నమ్మకం పైనే. ముఖ్యంగా వివాహ బంధం. నమ్మకం లేకుంటే ఆ బంధం బీటలు వారడం ఖాయం. భార్యాభర్తలు తమ జీవిత భాగస్వామిపై నమ్మకం కోల్పోయినప్పుడు ఆ ఇల్లు నరకంలా మారుతుంది. నిత్యం వాదనలు, అపార్థాలు పెరిగిపోతాయి. వివాహబంధం చాలా సున్నితమైనది. ఒక్క చిన్న అబద్ధం చాలు ఆ బంధాన్ని బీటలు వారేలా చేయడానికి. తన భర్త లేదా భార్య... తనతో అబద్ధమాడారని తెలిస్తే ఏ జీవితభాగస్వామీ తేలికగా తీసుకోలేరు. అప్పట్నించి ప్రతిది అనుమానాలు, సందేహాలే తలెత్తుతాయి. మనుషులు తప్పులు చేయడం సహజం. ప్రపంచంలో తప్పు చేయని మనిషే ఉండడు. కాబట్టి కొన్నిసార్లు ఓపిక, సహనం, క్షమా గుణం వల్ల బంధం నిలబడుతుంది. మీ జీవిత భాగస్వామిపై మీరు నమ్మకం కోల్పోయినప్పుడు బంధం నిలబెట్టుకునేందుకు మీరు చేయాల్సిన ప్రయత్నాలు ఇవే. 

1. నమ్మకాన్ని సంపాదించుకోమనండి
మీ జీవిత భాగస్వామిపై నమ్మకం కోల్పోయినప్పుడు ఆ విషయాన్ని ఆ వ్యక్తితో నేరుగా చెప్పండి. తిరిగి నమ్మకాన్ని సంపాదించుకునే పనులు చేయమని సలహా ఇవ్వండి. అయితే ఆ నమ్మకం మీకు కలగడానికి సమయం చాలా పడుతుంది. మీరు కూడా సహనంగా వేచి ఉండాలి. 

2. ప్రశాంతంగా ఎదిరించండి...
మీ భర్త లేదా భార్య చేసిన తప్పు చేసినప్పుడు వారిని నిలదీయండి. ఆ పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోండి. కానీ అరుపులు, కేకలతో కాదు. మీ భావోద్వేగానలు అదుపులో ఉంచుకుని ప్రశాంత వాతావరణంలోనే వారిని నిలదీయండి. మీరు అరవడం వల్ల మీ ఆరోగ్యం చెడిపోతుంది. అంతేకాదు సమస్య మరింత జఠిలంగా మారుతుంది. 

3. మాట్లాడండి...
చాలా మంది జీవితభాగస్వామిపై నమ్మకం కోల్పోయిన సంఘటన ఎదురైనప్పుడు గట్టిగా గొడవపడి మాట్లాడడం మానేస్తారు. కానీ అది సరైనది కాదు. మాట్లాడండి... మీరు ఏమనుకుంటున్నారో అన్నీ చెప్పండి. మీ భావాలను కమ్యునికేట్ చేయండి. చివరికి వారికే నిర్ణయాన్ని వదిలేయండి. 

4. సాయం తీసుకోండి
మీరు మీ భర్త లేదా భార్యతో కమ్యూనికేట్ చేయలేనప్పుడు ఇద్దరికీ ఆప్తులైన వ్యక్తి సాయం తీసుకోవచ్చు. సమస్యను చెప్పి వారినే సలహా అడగండి. మీ ఇద్దరి గురించి తెలిసిన వ్యక్తి కచ్చితంగా మంచి దిశానిర్దేశం చేయవచ్చు. 

5. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి...
మిమ్మల్ని మోసం చేసిన జీవితభాగస్వామి తప్పు తెలుసుకుని నిజాయితీగా ఉంటానని చెబితే... వారికి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి. అలాగే వారు నిజంగా మారారో లేదో, పాత తప్పులే చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయండి. గుడ్డిగా నమ్మేయద్దు. 

వివాహబంధంలో అనుమానాలు, సందేహాలు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేయండి. చివరకు ఏ మార్గం లేనప్పుడే బంధానికి స్వస్తి పలికే ఆలోచనలకు దారివ్వండి. 

Read Also: ఈ ఆరు వ్యాధులు సైలెంట్‌గా ప్రాణాలు తీసేస్తాయ్... జాగ్రత్త

Read Also: టమోటా లేని లోటును ఇవి తీర్చేస్తాయ్... వండి చూడండి

Read Also: విమాన ప్రయాణంలో వీటిని తింటే సమస్యలు తప్పవు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Wife and Husband Trust on Life partner Faith in Your Spouse భార్యాభర్తలు

సంబంధిత కథనాలు

Snake Vs Hen: గుడ్ల కోసం వచ్చిన పాముతో కోడి ఫైటింగ్.. చివరికి ఏమైందో చూడండి

Snake Vs Hen: గుడ్ల కోసం వచ్చిన పాముతో కోడి ఫైటింగ్.. చివరికి ఏమైందో చూడండి

Sesame Seed Powder: నువ్వుల పొడి ... రోజుకో స్పూను తిన్నా చాలు ఎంతో ఆరోగ్యం, తయారీ ఇలా

Sesame Seed Powder: నువ్వుల పొడి ... రోజుకో  స్పూను తిన్నా చాలు ఎంతో ఆరోగ్యం, తయారీ ఇలా

Groom As Minnal Murali: ‘మిన్నల్ మురళి’ గెటప్‌లో వరుడు.. ఆ పరుగులేంది.. ఆ ఎగురుడేంది?!

Groom As Minnal Murali: ‘మిన్నల్ మురళి’ గెటప్‌లో వరుడు.. ఆ పరుగులేంది.. ఆ ఎగురుడేంది?!

Weird: ఆయన 129 మంది పిల్లలకు తండ్రి... ఉచిత వీర్యదాత, ఫేస్‌బుక్‌లో వినూత్న సేవ

Weird: ఆయన 129 మంది పిల్లలకు తండ్రి... ఉచిత వీర్యదాత, ఫేస్‌బుక్‌లో వినూత్న సేవ

Father Love : నాన్నంటే ధైర్యం.. నాన్నంటే బలం ! బిడ్డ కళ్లలో ధైర్యం కోసం ఆ నాన్న ఏం చేశారంటే..?

Father Love :  నాన్నంటే ధైర్యం.. నాన్నంటే బలం  ! బిడ్డ కళ్లలో ధైర్యం కోసం ఆ నాన్న ఏం చేశారంటే..?

టాప్ స్టోరీస్

Covid Vaccination: కరోనా వ్యాక్సినేషన్‌పై సర్కార్ కీలక ప్రకటన.. ఇక వారు కూడా అర్హులే

Covid Vaccination: కరోనా వ్యాక్సినేషన్‌పై సర్కార్ కీలక ప్రకటన.. ఇక వారు కూడా అర్హులే

Naga Chaitanya in Moscow: మాస్కోలో నాగచైతన్య... ఆయన అక్కడ ఏం చేస్తున్నారంటే?

Naga Chaitanya in Moscow: మాస్కోలో నాగచైతన్య... ఆయన అక్కడ ఏం చేస్తున్నారంటే?

Omicron Sub-Variant BA.2: బీ అలర్ట్.. దేశంలో ఆ వేరియంట్ వ్యాప్తే ఎక్కువగా ఉందట!

Omicron Sub-Variant BA.2: బీ అలర్ట్.. దేశంలో ఆ వేరియంట్ వ్యాప్తే ఎక్కువగా ఉందట!

Tata Taken Air India: ఇక టాటా వారీ 'ఎయిర్‌ ఇండియా'! ప్రభుత్వం నుంచి వాటాలు అధికారికంగా బదిలీ

Tata Taken Air India: ఇక టాటా వారీ 'ఎయిర్‌ ఇండియా'! ప్రభుత్వం నుంచి వాటాలు అధికారికంగా బదిలీ