By: ABP Desam | Updated at : 29 Nov 2021 06:40 AM (IST)
Edited By: harithac
(Image credit: Pixabay)
విటమిన్ డి... మన శరీరానికి అత్యవసరమైన విటమిన్. ఆహరంలోని పోషకాలను, కాల్షియాన్ని శరీరం శోషించుకోవాలంటే ఇది చాలా అవసరం. విటమిన్ డి లోపం వల్ల నరాల సమస్యలు, ప్రొస్టేట్ క్యాన్సర్, కొలొన్ క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశం పెరుగుతుంది. విటమిన్ డి పుష్కలంగా లభించాలంటే సూర్య రశ్మి శరీరానికి తగిలేలా చేసుకోవాలి. వేసవిలో అందరికీ సూర్య రశ్మి బాగానే తగులుతుంది. కానీ శీతాకాలంలో సూర్యుడు ఒకంతట ఉదయించడు. ఉదయించినా కూడా చల్లగాలికి భయపడి ఎవరూ బయటికి రారు. దీని వల్ల విటమిన్ డి లోపం తలెత్తుతుంది. అందుకే రోజులో కాసేపు కచ్చితంగా ఎండ తగిలేటట్టు చూసుకోవాలి. ఆయుర్వేద వైద్యులు చలికాలంలో ఏ సమయంలో, ఎంతసేపు సూర్య రశ్మి శరీరానికి తగిలితే మంచిదో సూచిస్తున్నారు.
ఈ సమయం మంచిది
విటమిన్ డి పుష్కలంగా శరీరానికి అందాలంటే ఏ సమయంలో ఎండలో కూర్చోవాలో చెబుతున్నారు ఆయుర్వేద వైద్యులు. సాయంత్రం సూర్యుడు అస్తమించడానికి ముందు పసుపు వర్ణంలో ఎండ కాస్తుంది. ఆ ఎండలో రోజుకు 25 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు కూర్చుంటే శరీరానికి అవసరమయ్యే విటమిన్ అందుతుంది.
ఎంతో అవసరం
శీతాకాలంలో చాలా మంది త్వరగా రోగాల బారిన పడుతుంటారు. జలుబు, దగ్గు, జ్వరం... ఇలా. ఆ కాలంలో మన రోగనిరోధక శక్తి మందగిస్తుంది. అందుకే త్వరగా వ్యాధులు దాడి చేస్తాయి. విటమిన్ డి పుష్కలంగా అందితే రోగనిరోధక వ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది. అంతేకాదు సూర్యకాంతిలో ఉండే UVA (అల్ట్రావైలెట్ ఏ) రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది.
మానసిక ఆరోగ్యం కోసం...
సూర్యకాంతిలో ఉండే సెరోటోనిన్, మెలటోనిన్, డోపమైన్ మీ మానసిక ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఆందోళన, డిప్రెషన్ వంటి వాటి బారిన పడకుండా కాపాడతాయి. అంతేకాదు సూర్యకాంతి మీకు చక్కటి నిద్రను ప్రసాదిస్తుంది. స్లీపింగ్ హార్మోనును పెంచుతుంది.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Read Also: నిద్రలోనే ప్రాణాలు తీసే మహమ్మారి ఇది... లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయద్దు
Read Also: ఇంట్లో ఇవి ఉంటే నెగిటివ్ ఎనర్జీ... డబ్బును రాకుండా అడ్డుకుంటాయి
Read Also: మన దేశీ పనీర్ అమెరికన్లకు తెగ నచ్చేసింది... ఇప్పుడదే అక్కడ పాపులర్ వంటకం, చెబుతున్న డేటా
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
World Heart Day 2023: ఈ ఐదు విషయాలు బాగున్నాయంటే మీ గుండె పదిలంగా ఉన్నట్టే లెక్క!
Salt: మూడు రకాల ఉప్పుల్లో ఏది ఆరోగ్యానికి ఉత్తమమైందో తెలుసా?
Dengue: డెంగ్యూ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హాస్పిటల్లో ఎప్పుడు చేరాలి?
Hyperacidity: హైపర్ అసిడిటీని తగ్గించే ఆయుర్వేద ఆహార పదార్థాలు ఇవే
Weight Loss: జిమ్‌కు వెళ్ళకుండా బరువులు ఎత్తకుండానే మీ బరువు ఇలా తగ్గించేసుకోండి
అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!
Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి
IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
/body>