Paneer in America: మన దేశీ పనీర్ అమెరికన్లకు తెగ నచ్చేసింది... ఇప్పుడదే అక్కడ పాపులర్ వంటకం, చెబుతున్న డేటా
పనీర్‌కు మనమే కాదు అమెరికన్లు కూడా ఫిదా అయిపోయారు. ప్రోటీన్ కోసం పనీర్‌ను అధికంగా వాడుతున్నారు.
మనవి కాని బర్గర్, పిజ్జాలకు మనదేశంలో అభిమానులు పెరిగినట్టే, అమెరికన్లకు కూడా మన ఇంటి వంటకం పనీర్ తెగనచ్చేసింది. దాని రుచికి ఫిదా అయిపోయి తమ మెనూలో కలిపేసుకుంటున్నారు. అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్లు ఎకనామిక్ రీసెర్చ్ సర్వేను నిర్వహించారు. ఆ డేటాను పరిశీలిస్తే గత కొంతకాలంగా పనీర్ వినియోగం అమాంతం పెరిగినట్టు గుర్తించారు. అలాగే గత ఏడాది అమెరికాలోని గూగుల్ సెర్చ్‌లో ‘ఇండియన్ రెస్టారెంట్స్ నియర్ మి’ అనే వెతుకులాట 350 శాతం పెరిగింది. పనీర్ వినియోగం 140 శాతం పెరిగింది. 15వ శతాబ్ధం నుంచి పనీర్ ఉనికిలో ఉన్నప్పటికీ, అది ఇప్పుడిప్పుడు అమెరికన్ల మెనూను ఆక్రమిస్తోంది. పనీర్ పూర్తి శాకాహార వంటకం కావడంతో అమెరికాలోని శాకాహారులంతా దీన్ని తినేందుకు ఇష్టపడుతున్నారు.
ఎందుకు నచ్చింది?
పనీర్ లో ప్రోటీన్, కొవ్వు అధికంగా ఉంటాయి. అమెరికాలో అత్యధికులు కీటో డైట్‌ను పాటిస్తారు. ఆ డైట్‌లో ప్రోటీన్ ఫుడ్‌కే ప్రాధాన్యత. అందుకే ఆ డైట్‌ను పాటించేవారంతా పనీర్‌ను తినడం మొదలుపెట్టారు. అది కాకుండా పాలతో తయారయ్యే పదార్థం కాబట్టి విలువ ఎక్కువ. ‘భారతీయ వంటకాలకు మా దేశంలో ప్రజాదరణ పెరిగింది. ముఖ్యంగా పనీర్ విక్రయాలు పెరిగాయి. పనీర్ వంటకాలను నేర్చుకుని ఇంట్లోనే చేసుకునేందుకు ఎంతో మంది అమెరికన్లు ఇష్టపడుతున్నారు’ అని వివరించారు ఫుడ్ మార్కెట్లో కొనసాగుతున్న జోయి వెల్స్ అనే ఉద్యోగి. అంతేకాదు పనీర్ ను తయారుచేయడం నేర్చుకుని జీవనోపాధిగా మార్చుకోవడం కూడా మొదలైందని చెబుతున్నారాయన.
యూఎస్ రెస్టారెంట్లలోని చెఫ్ లు కూడా పనీర్ వంటకాలు వండడం నేర్చుకుంటున్నారు. ఇప్పుడు అమెరికాలో చాలా రెస్టారెంట్లలో పనీర్ వంటకాలు అందుబాటులో ఉన్నాయి. పనీర్ కు పెరుగుతున్న క్రేజ్‌ను ప్రవాస భారతీయులు క్యాష్ చేసుకుంటున్నారు. భారత్ కు చెందిన జస్లీన్, తరుష్ అగర్వాల్ జంట తమ సాఫ్ట్ వేర్ ఉద్యోగాలను వదిలేసి మరీ పనీర్ తయారీని మొదలుపెట్టారు. ఆర్గానిక్ గడ్డి తినిపించిన ఆవుల పాలను మాత్రమే తమ పనీర్ తయారీకి ఉపయోగిస్తున్నారు చెబుతున్నారు. వీరే కాదు చాలా మంది పనీర్ తో చేసిన వంటకాలు అమ్ముతున్నారు. వాటిలో ముఖ్యమైనది పనీర్ టిక్కా రోల్. దీనికి అమెరికాలో మహా క్రేజ్ ఉంది.
Read Also: ఈ ఆరు వ్యాధులు సైలెంట్‌గా ప్రాణాలు తీసేస్తాయ్... జాగ్రత్త
Read Also: ఇంట్లో ఇవి ఉంటే నెగిటివ్ ఎనర్జీ... డబ్బును రాకుండా అడ్డుకుంటాయి
Read Also: టమోటా లేని లోటును ఇవి తీర్చేస్తాయ్... వండి చూడండి
Read Also: విమాన ప్రయాణంలో వీటిని తింటే సమస్యలు తప్పవు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి