అన్వేషించండి

Citroen Basalt లేదా Kia Sonet ఫీచర్ల పరంగా ఏ SUV బెస్ట్.. మీకు ఏది మంచిది

Citroen Basalt, Kia Sonet లు మార్కెట్లో విక్రయాలు జరుపుకుంటున్న రెండు పవర్‌ఫుల్ SUVలు. కాగా, మీకు కావాల్సిన ఫీచర్లు, ఇంజిన్, ధర వివరాలు తెలుసుకున్నాకే కొనడం మంచిది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • Citroen Basalt కూపే-శైలి SUV, సౌకర్యం, టెక్నాలజీతో వస్తుంది.
  • Kia Sonet ప్రీమియం అనుభవం, వెంటిలేటెడ్ సీట్లు, సన్‌రూఫ్‌తో వస్తుంది.
  • Basalt స్మూత్ డ్రైవింగ్, మంచి మైలేజ్ ఇస్తుంది, Sonet ఇంజిన్ ఎంపికలు ఎక్కువ.
  • Sonet ADAS, 360-డిగ్రీ కెమెరా వంటి అధునాతన భద్రతా ఫీచర్లను కలిగి ఉంది.

భారతదేశంలో రోజురోజుకూ లగ్జరీ కార్ల వినియోగం పెరుగుతోంది. ముఖ్యంగా కరోనా తరువాత కార్ల కొనుగోలుపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. భారత్ మార్కెట్లో నేడు కాంపాక్ట్ SUV విభాగం వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ విభాగంలో Citroen Basalt , Kia Sonet ఒకదానికొకటి పరస్పరం పోటీ పడుతున్నాయి. Citroen Basalt కారు కూపే-శైలి SUV. ఇది దాని ప్రత్యేకమైన డిజైన్, సౌకర్యవంతమైన డ్రైవింగ్ వల్ల ఫేమస్ అవుతోంది. అదే సమయంలో Kia Sonet ఇప్పటికే ఈ విభాగంలో బలమైన, నమ్మదగిన SUVగా భావిస్తారు. 2 కార్లు వేర్వేరు రకాల కస్టమర్‌లను దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు. కాబట్టి ఫీచర్ల పరంగా ఏ SUV మరింత శక్తివంతమైనదో చూద్దాం.

ఫీచర్లలో ఎవరిది పైచేయి?

Citroen Basalt సౌకర్యం, అవసరమైన టెక్నాలజీ కాంబినేషన్ కలిగి ఉంది. ఇది పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, Android Auto తో పాటు Apple CarPlay సపోర్ట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సౌకర్యవంతమైన సీట్లను కలిగి ఉంది. దీని బూట్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇది ఫ్యామిలీ జర్నీలను, లాంగ్ డ్రైవ్‌లను సులభతరం చేస్తుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్, రియర్ AC వెంట్స్ వంటి సౌకర్యాలు దీనిని ఒక నమ్మదగిన SUVగా చేస్తాయి.

మరోవైపు, Kia Sonet ఫీచర్ల పరంగా మరింత ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఇది వెంటిలేటెడ్ సీట్లు, సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, ప్రీమియం సౌండ్ సిస్టమ్, అనేక స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉంది. రోజువారీ ఉపయోగంలో ఈ ఫీచర్లు కియా Sonetను మరింత బెస్ట్ అనిపిస్తాయి.

ఇంజిన్, డ్రైవింగ్ అనుభవం

Citroen Basalt స్మూత్ డ్రైవింగ్, మంచి మైలేజ్ కోసం తెలిసిన పెట్రోల్ ఇంజిన్ ఎంపికలతో మార్కెట్లోకి వచ్చింది. దీని సస్పెన్షన్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇది గతుకుల రోడ్లపై కూడా ప్రయాణాన్ని ఇబ్బంది లేకుండా చేస్తుంది. అదే సమయంలో Kia Sonet ఇంజిన్ ఎంపికలలో ముందుంది. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌లను కలిగి ఉంది. అలాగే మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపిక కూడా ఇచ్చారు. ఎక్కువ ఎనర్జీతో పాటు మంచి పనితీరు కోరుకునే వారికి కియా Sonet మంచిది.

భద్రత కోసం ఏమున్నాయి

Citroen Basalt 6 ఎయిర్‌బ్యాగ్‌లు, అవసరమైన సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది. Kia Sonet భద్రతా పరంగా ఒక అడుగు ముందుంది. ఎందుకంటే ఇది ADAS, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్ వంటి మోడ్రన్ ఫీచర్లను కలిగి ఉంది. రెండింటి ధర దాదాపు సమానంగా ఉంటుంది. కానీ ఫీచర్లు, భద్రత కారణంగా Kia Sonet ఎక్కువ విలువను కలిగి ఉంది. మీరు ప్రత్యేకమైన డిజైన్, సౌకర్యవంతమైన డ్రైవింగ్ కోరుకుంటే, Citroen Basalt ఒక మంచి నిర్ణయం. కానీ ఎక్కువ ఫీచర్లు, ఇంజిన్ వేరియంట్లు, అధిక భద్రత కోసం Kia Sonet మరింత శక్తివంతమైన SUV అని భావిస్తారు. 

Also Read: ఎలక్ట్రిక్ కారు Toyota Urban Cruiser EV లాంచ్ చేసిన జపాన్, 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్.. ఫీచర్లు, ధర వివరాలివే

Frequently Asked Questions

Citroen Basalt మరియు Kia Sonet లలో ఏది మెరుగైన SUV?

Citroen Basalt ప్రత్యేకమైన డిజైన్, సౌకర్యవంతమైన డ్రైవింగ్ అందిస్తుంది. Kia Sonet అధిక ఫీచర్లు, ఇంజిన్ ఎంపికలు, మెరుగైన భద్రతా ఫీచర్లతో వస్తుంది.

Citroen Basalt లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?

Citroen Basalt లో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటో క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Kia Sonet లో ఉన్న ప్రత్యేకమైన ఫీచర్లు ఏమిటి?

Kia Sonet లో వెంటిలేటెడ్ సీట్లు, సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, ప్రీమియం సౌండ్ సిస్టమ్, ADAS, 360 డిగ్రీ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.

Citroen Basalt మరియు Kia Sonet ల ఇంజిన్ ఎంపికలు ఏమిటి?

Citroen Basalt పెట్రోల్ ఇంజిన్ ఎంపికలతో వస్తుంది. Kia Sonet పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఎంపికలతో, మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లతో లభిస్తుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!
LED vs HID Headlights: రాత్రి ప్రయాణాలు సురక్షితంగా ఉండాలంటే.. కారు హెడ్‌లైట్లలో LED, HID మధ్య తేడాలు తెలుసుకోండి!
కారుకు LED హెడ్‌లైట్లు మంచిదా? HID హెడ్‌లైట్లు మంచిదా? వెలుతురు, ధర, క్వాలిటీలో ఏది బెస్ట్?
MG Windsor EVతో 17,500 కి.మీ. ప్రయాణం.. లాంగ్ జర్నీ సమయంలో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర విషయాలు!
MG Windsor EV రివ్యూ.. 17,500 కి.మీ. ప్రయాణించాక ఈ ఎలక్ట్రిక్ కారులో కనిపించిన ప్లస్‌లు, మైనస్‌లు!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
Abhijeet Dipke: జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Embed widget