Tata Sierra డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి.. మీ EMI ఎంత కట్టాలి ? ధర, మైలేజీ వివరాలు
Tata Sierra EMI: భారత మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందిన టాటా సియెర్రాను 2 లక్షల డౌన్ పేమెంట్‌తో కొనుగోలు చేయవచ్చు. తరువాత ప్రతినెలా EMI ఎంత ఉంటుందో పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Tata Sierra Down Payment | కస్టమర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా సియెర్రాను టాటా మోటార్స్ ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. మీరు ఈ SUVని కొనుగోలు చేయాలనుకుంటే, చౌకైన వేరియంట్‌కు మీరు ఎంత డౌన్ పేమెంట్ చేయాలో తెలుసుకోవాలి. దాంతో పాటు భారత మార్కెట్లో టాటా సియెర్రాకు పోటీగా ఉన్న కార్ల వివరాలు కూడా మనం తెలుసుకుందాం.
టాటా సియెర్రా బేస్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర ₹11.49 లక్షల నుండి ప్రారంభమై, టాప్ మోడల్‌కు ₹18.49 లక్షల వరకు ఉంది. మీరు ఢిల్లీలో టాటా సియెర్రా స్మార్ట్ ప్లస్ 1.5 పెట్రోల్ బేస్ మోడల్‌ను కొనుగోలు చేస్తే, దాని ఆన్-రోడ్ ధర సుమారు ₹13.44 లక్షలుగా ఉంది. ఈ ధరలో RTO, ఇన్సూరెన్స్, ఇతర ఛార్జీలు ఉంటాయి. ఆయా రాష్ట్రాలు, నగరాల్లో ఈ ధరలో మార్పులు ఉంటాయి.
ఈ కనీస డౌన్ పేమెంట్‌తో టాటా సియెర్రా కొనవచ్చు
మీరు టాటా సియెర్రా బేస్ మోడల్‌కు ఫైనాన్స్ ద్వారా తీసుకోవాలి అనుకుంటే, మీరు కనీసం ₹2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించాలి. డౌన్ పేమెంట్ చెల్లించిన తర్వాత, మీ లోన్ మొత్తం సుమారు ₹11.44 లక్షలు అవుతుంది. మీరు 9% వడ్డీతో 5 సంవత్సరాలు (60 నెలలు) లోన్ తీసుకుంటే, మీ నెలవారీ EMI సుమారు రూ.23,751 అవుతుంది. ఈ EMI మీ బ్యాంక్, వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఛార్జీలను బట్టి మారవచ్చు.
టాటా సియెర్రా మైలేజీ ఎంత
టాటా సియెర్రా 2025 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. టాటా సియెర్రా ఇంజిన్ 105 bhp, 145 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మార్కెట్లోకి వచ్చింది. ఈ ఇంజిన్ సిటీలో డ్రైవింగ్‌కు బావుటుందని కంపెనీ పేర్కొంది. అదే విధంగా హైవేపై డ్రైవింగ్‌లోనూ సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని పొందవచ్చు. టాటా సియెర్రాలో జర్నీ నిజమైన SUV అనుభూతిని ఇస్తుంది.
టాటా సియెర్రా మైలేజ్ 18.2 kmpl వరకు ఉంటుంది. ఇది ఈ విభాగంలో చాలా ఎక్కువ అని చెప్పవచ్చు. ఈ SUV టర్బో-పెట్రోల్, టర్బో- డీజిల్ ఇంజిన్‌ల వేరియంట్లలో కూడా వస్తుంది. టాటా సియెర్రా భారత మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, రెనాల్ట్ డస్టర్‌తో సహా అనేక వాహనాలకు గట్టి పోటీ ఇస్తుందని అంచనా వేస్తున్నారు.






















