Rajinikanth - Salman Khan: సల్మాన్, రజనీతో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న 'జవాన్' డైరెక్టర్?
Atlee : అట్లీ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా ఓ భారీ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోందన్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో మరో హీరోగా రజనీకాంత్ ను మేకర్స్ సంప్రదిస్తున్నట్టు టాక్ నడుస్తోంది.
పాన్ ఇండియా ట్రెండ్ వచ్చాక సినిమా ఇండస్ట్రీలో సౌత్, నార్త్ అనే సరిహద్దులు చెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇటు సౌత్, అటు నార్త్ నుంచి పలువురు దిగ్గజ నటీనటులు కలిసి సినిమాలు చేస్తే చూడాలని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అలాంటి వాళ్ల కోసమే అన్నట్టుగా తాజాగా అట్లీ సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ కన్నడ వీరుడు సల్మాన్ ఖాన్ ఒకే ఫ్రేమ్ లో, ఒకే స్క్రీన్ పై చూపించబోతున్నట్టు ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఇండస్ట్రీలో హంగామా చేస్తుంది.
రజనీకాంత్, సల్మాన్ ఖాన్ మల్టీస్టారర్
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ గురించి సౌత్ నుంచి నార్త్ దాకా అందరికీ తెలుసు. 'జవాన్' సినిమాతో ఈ దర్శకుడు కొట్టిన హిట్ అలా సౌండ్ చేసింది మరి. ఈ నేపథ్యంలోనే అట్లీ నెక్స్ట్ మూవీ గురించి చాలా కాలంగా ఆయన అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే డైరెక్టర్ అట్లీతో సల్మాన్ ఖాన్ సినిమా చేయబోతున్నాడు అంటూ ప్రచారం నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ మల్టీస్టారర్ అని అంటున్నారు. అందులో ఓ హీరోగా సల్మాన్ ఖాన్ ఫిక్స్ కాగా, మరో హీరోగా సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth)ను సంప్రదించగా... ఆయన ఓకే అన్నట్టు కోలీవుడ్ టాక్. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాని సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించనుందని తెలుస్తోంది. ఇక మరోవైపు అట్లీ సల్మాన్ ఖాన్ గత రెండేళ్లుగా అట్లీతో టచ్ లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే రజనీకాంత్ - సల్మాన్ ఖాన్ ఇద్దరినీ అట్లీ సింగిల్ స్క్రీన్ పై చూపించే అవకాశం ఉందని అంటున్నారు.
మూవీ సెట్స్ పైకి వెళ్ళేది ఎప్పుడు ?
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ 'సికందర్' మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీకి మరో తమిళ డైరెక్టర్ మురగదాస్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. చివరిసారిగా సల్మాన్ 'టైగర్ 3' సినిమాలో కనిపించగా, ఆయన కొత్త మూవీ 'సికందర్' ఈ ఏడాది ఈద్ కానుకగా రిలీజ్ కాబోతోంది. మరోవైపు రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన చివరగా 'లాల్ సలామ్' సినిమాలో అతిథి పాత్రలో నటించారు. ప్రస్తుతం రజనీకాంత్ 'కూలీ'తో పాటు 'జైలర్ 2' మూవీని కూడా చేయబోతున్నారు. ఇటు రజనీకాంత్, అటు సల్మాన్ ఖాన్ కమిట్మెంట్లన్నీ పూర్తయ్యాక అట్లీ మూవీని మొదలు పెట్టబోతున్నారని అంటున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ భారీ మల్టీస్టారర్ ను సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.
బన్నీ రిజెక్ట్ చేసిన స్టోరీనేనా?
'జవాన్' మూవీతో అట్లీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత ఆయన నెక్స్ట్ మూవీని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేయబోతున్నారని ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత మల్టీస్టారర్ అనే కారణంతో అల్లు అర్జున్ ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టాడని, దీంతో అట్లీ అదే స్టోరీ పట్టుకుని సల్మాన్ దగ్గరకు వెళ్లారని టాక్ నడిచింది. ఆ టాక్ నిజమే అన్నట్టుగా ఇప్పుడు అట్లీ మల్టీస్టారర్ ను ప్లాన్ చేస్తుండడం గమనార్హం.
Read Also : Padma Bhushan Balakrishna: ‘అఖండ 2’ సెట్స్‌లో ‘ఆనంద’ తాండవం.. మ్యాటర్ ఏంటంటే?