Allu Arjun : అట్లీ మూవీతో పాన్ వరల్డ్ రేంజ్ - అల్లు అర్జున్ ప్లానింగ్ మామూలుగా లేదు... రాజమౌళితో కూడా!
Allu Arjun Movies: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ తర్వాత వరుస మూవీస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియాలో టాప్ డైరెక్టర్లతో వర్క్ చేయనుండగా... ఆ లిస్ట్ ఓసారి చూస్తే...

Allu Arjun Lininig Up Movies : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' ఫ్రాంచైజీ తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారారు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ అట్లీతో పాన్ వరల్డ్ హాలీవుడ్ రేంజ్ సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ మూవీ తర్వాత బన్నీ చేయబోయే ప్రాజెక్టులపై హైప్ నెలకొంది. భారతీయ సినిమాలో బిగ్గెస్ట్ డైరెక్టర్స్‌తో ఆయన మూవీస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటిల్లో కొన్ని చర్చల దశలో ఉన్నాయి.
సంజయ్ భన్సాలీతో...
రాబోయే రోజుల్లో బన్నీ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతో ఓ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి 'పుష్ప: ది రూల్' విడుదలకు ముందే ఓ ఏడాదిగా ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ గురించి చర్చలు జరుగుతున్నాయట. త్వరలోనే స్క్రిప్ట్ వర్క్‌పై క్లారిటీ వచ్చి మూవీ ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, మూవీ ట్రాక్ ఎక్కేందుకు మాత్రం చాలా టైం పట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ప్రశాంత్ నీల్‌తో...
స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తోనూ అల్లు అర్జున్ ఓ మూవీ చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. రీసెంట్‌గానే ఫేమస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు... బన్నీ, ప్రశాంత్ నీల్‌కు ఓ మీటింగ్ ఏర్పాటు చేయగా... ఇద్దరూ అఫీషియల్‌గా స్క్రిప్ట్ గురించి చర్చించినట్లు తెలుస్తోంది. అయితే, అది ఫైనల్ అయినట్లు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత KGF 3, సలార్ 2 ప్రాజెక్టులు లైనప్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో ఈ మూవీకి కూడా చాలా టైం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read : మగాళ్లకు కూడా పీరియడ్స్ వస్తే... - నేషనల్ క్రష్ రష్మిక రియాక్షన్
'సరైనోడు 2'
అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన 'సరైనోడు' మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 'సరైనోడు 2' సైతం తెరకెక్కించేందుకు ప్లానింగ్ జరుగుతోందట. సరైనోడు 2 తీస్తే తన బ్యానర్‌లోనే తీస్తానంటూ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ రీసెంట్‌గా కామెంట్ చేశారు. ప్రస్తుతం బోయపాటి బాలయ్యతో 'అఖండ 2' పనుల్లో బిజీగా ఉన్నారు. డిసెంబర్ 5న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత 'సరైనోడు 2' స్క్రిప్ట్‌పై ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది. బన్నీ, అల్లు అరవింద్ అనుమతిస్తే త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ట్రాక్ ఎక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
దర్శక ధీరుడు రాజమౌళితో...
దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'SSMB29'లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ప్రీ లుక్ భారీ హైప్ క్రియేట్ చేయగా ఈ నెల 15న ఫస్ట్ లుక్ కోసం యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 2027లో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అల్లు అర్జున్, రాజమౌళి కూడా ఓ ప్రాజెక్ట్ కోసం పని చేయడంపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే బన్నీ కెరీర్‌లోనే ఇది ఓ బిగ్గెస్ క్రేజీ ప్రాజెక్ట్.
కొరటాల శివతో...
అల్లు అర్జున్, కొరటాల శివ సినిమా ఇదివరకే ప్రకటించినా కొన్ని కారణాలతో అది వాయిదా పడింది. 'పుష్ప 2' రిలీజ్ అయిన వెంటనే ఈ మూవీ స్క్రిప్ట్ బన్నీకి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపై వర్క్స్ జరుగుతుండగా రాబోయే రోజుల్లో మరిన్ని చర్చలు జరగనున్నాయి. అట్లీ, బన్నీ ప్రాజెక్టు తర్వాత ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్లతో బన్నీ మూవీస్ ప్లాన్ చేస్తున్నారు.





















