ప్రభాస్ కల్కి to అల్లు అర్జున్... 'గద్దర్ అవార్డ్స్' విన్నర్స్, స్పెషల్ జ్యూరీ సెలబ్రిటీస్ లిస్ట్

ఉత్తమ సినిమాగా ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ'ని ఎంపిక చేసింది తెలంగాణ ప్రభుత్వం.   

రెండో ఉత్తమ సినిమాగా 'పొట్టేల్', మూడో ఉత్తమ సినిమాగా 'లక్కీ భాస్కర్' అవార్డులు అందుకున్నాయి.

'పుష్ప 2' సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడిగా గద్దర్ పురస్కారం అల్లు అర్జున్‌ను వరించింది.

'35 - చిన్న కథ కాదు'లో నటనకు నివేదా థామస్ ఉత్తమ నటిగా నిలిచారు. ఆ సినిమా ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైంది.

'కల్కి 2898 ఏడీ' తీసిన నాగ్ అశ్విన్‌కు ఉత్తమ దర్శకుడి పురస్కారం ఇస్తున్నారు.

'లక్కీ భాస్కర్'కు గాను హీరో దుల్కర్ సల్మాన్, 'పొట్టేల్'కు అనన్యా నాగళ్ళకు స్పెషల్ జ్యూరీ అవార్డు ఇచ్చారు.

బెస్ట్ డెబ్యూ డైరెక్టర్‌గా యదు వంశీ, ఆయన తీసిన 'కమిటీ కుర్రోళ్లు' నేషనల్ ఇంటిగ్రేషన్ బెస్ట్ ఫీచర్ ఫిలింగా నిలిచింది. 

ఉత్తమ సహాయ నటుడిగా 'సరిపోదా శనివారం'కు ఎస్.జె. సూర్య, సహాయ నటిగా 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్'కు శరణ్య ప్రదీప్ ఎంపిక అయ్యారు.

చరిత్ర మీద తీసిన ఉత్తమ ఫీచర్ ఫిలింగా 'రజాకార్'ను గద్దర్ అవార్డుకు ఎంపిక చేశారు.

ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమాగా 'ఆయ్'కు అవార్డు వచ్చింది. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ నటించిన చిత్రమిది.

'మత్తు వదలరా 2'కు గాను ఉత్తమ హాస్య నటులుగా 'వెన్నెల' కిశోర్, సత్యను అవార్డు వరించింది.

'మత్తు వదలరా 2'లో ర్యాప్ సాంగ్ రాసి పాడిన హీరోయిన్ ఫరియా అబ్దుల్లాను ప్రత్యేక పురస్కారం వరించింది.

'క' దర్శకులు సందీప్ - సుజీత్, 'రాజు యాదవ్' నిర్మాతలు ప్రశాంతి రెడ్డి, రాజేష్ కళ్లేపల్లికి స్పెషల్ జ్యూరీ అవార్డులు వచ్చాయి.