అన్వేషించండి

Padma Bhushan Balakrishna: ‘అఖండ 2’ సెట్స్‌లో ‘ఆనంద’ తాండవం.. మ్యాటర్ ఏంటంటే?

NBK: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నటసింహం బాలకృష్ణకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలలో ‘పద్మ భూషణ్’ వరించింది. ఈ సందర్భంగా ‘అఖండ 2: తాండవం’ మూవీ టీమ్ సెట్స్‌లో బాలయ్యని సర్‌ప్రైజ్ చేసింది

Padma Bhushan NBK: ‘అఖండ 2’ సెట్స్‌లో ‘ఆనంద’ తాండవం నెలకొంది. పద్మభూషణ్‌ పురస్కారం పొందిన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నటసింహం బాలయ్యని ఘనంగా సన్మానించింది ‘అఖండ 2: తాండవం’ టీమ్. ‘అఖండ’ సినిమా నుండి వరసగా బ్లాక్ బ్లస్టర్ విజయాలను సొంతం చేసుకుంటూ, సక్సెస్ రేట్‌ను అమాంతం పెంచేసుకుంటున్న ఈ నందమూరి నటసింహానికి, రీసెంట్‌గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలలో ‘పద్మ భూషణ్’ వరించిన విషయం తెలిసిందే. ఆయనకి ‘పద్మ భూషణ్’ పురస్కారం ప్రకటించినప్పటి నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పండగ వాతావరణం కనబడుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బాలయ్యని గ్రాండ్‌గా సన్మానించేందుకు టాలీవుడ్ పరిశ్రమ సిద్ధమవుతున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే ఓ ప్రకటన రానుంది. 

ఈలోపు బాలయ్యపై అభిమానం ఉన్న వారంతా.. ప్రత్యేకంగా కలిసి శాలువాలతో, పుష్ప గుచ్ఛాలతో అభినందిస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య చేస్తున్న ‘అఖండ 2: తాండవం’ సెట్స్‌లో అయితే టీమ్ అంతా ఆనంద తాండవాన్ని జరుపుకున్నారు. ‘పద్మ భూషణ్‌’ పురస్కారం పొందిన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణని ‘అఖండ 2: తాండవం’ మూవీ టీం సెట్‌లో గ్రాండ్‌గా సన్మానించింది. ‘పద్మ భూషణ్‌’ పురస్కారం అనౌన్స్‌మెంట్ తర్వాత సోమవారం బాలయ్య ‘అఖండ 2: తాండవం’ షూటింగ్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ బాలయ్యను ఘనంగా సన్మానించి, సెట్‌లో భారీ కేక్‌ని కట్ చేసి అభినందనలు తెలియజేశారు.

Also Readరామ్ చరణ్ సినిమా నుంచి ఏఆర్ రెహ్మాన్ తప్పుకొన్నాడా... ఇండస్ట్రీ హాట్ న్యూస్, నిజం ఏమిటంటే?

బాలయ్య కూడా టీమ్ ఇచ్చిన సర్‌ప్రైజ్‌కి ఆశ్చర్యపోయారు. బాలయ్య అంటే బోయపాటికి ఎంతో ఇష్టమో, ఎంత గౌరవమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య సినిమా అంటే చాలు రెడ్ బుల్ ఎక్కించినవాడిలా రెచ్చిపోతాడు. ఎలాగైనా కొట్టాలి బాబు? అంటూ బాలయ్యతో ఉత్సాహం నింపుతాడు. ఈ విషయం స్వయంగా బాలయ్యే చెప్పడం విశేషం. అలాంటిది ఆయనతో సినిమా చేస్తున్నప్పుడు బాలయ్యకు ఇలాంటి పురస్కారం వస్తే ఆగుతాడా? అందుకే టీమ్ మొత్తాన్ని అలెర్ట్ చేసి గ్రాండ్‌గా ఆనంద తాండవాన్ని కురిపించాడు. ఈ సర్‌ప్రైజ్‌కి బాలయ్య కూడా సంతోషించారని, టీమ్ అందరికీ ధన్యవాదాలు తెలిపారని సమాచారం.

‘అఖండ 2: తాండవం’ విషయానికి వస్తే.. బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘అఖండ 2: తాండవం’. ఇంతకు వీరి కాంబినేషన్‌లో వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ‘అఖండ’ సినిమాకు ఇది సీక్వెల్. ఆ సినిమాకు మించిన యాక్షన్, ఇంటెన్స్ నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లనుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బాలయ్య బిడ్డ ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. 25 సెప్టెంబర్, 2025న దసరా సందర్భంగా ఈ సినిమాను థియేటర్లలోకి తెచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నారు.

Also Readపాక్ బెదిరింపులు లెక్కలేదు... మహా కుంభమేళాకు బాలీవుడ్ కొరియోగ్రాఫర్, పేరు చూసి క్రిస్టియన్ అనుకోవద్దు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget