White Rice: అన్నం తింటే బరువు పెరుగుతామని భయమా... వండే స్టైల్ మార్చండి, బరువు తగ్గుతారు

బరువు తగ్గాలని భావించేవారు మొదట చేసే పని అన్నం తినడం మానేయడం. కానీ అది మంచి పరిష్కారమేనా?

FOLLOW US: 

భారతదేశంలో సంపూర్ణ ఆహారం అంటే... అందులో అన్నం కూడా భాగమే. కానీ బరువు పెరుగుతామన్న భయంతో చాలా మంది అన్నాన్ని పక్కన పెట్టేసి, చపాతీలు తినడం మొదలుపెట్టారు. శరీరానికి చపాతీ కన్నా బలన్నిచ్చేది అన్నమే. వైట్ రైస్ ను ఒకపూట పూర్తిగా మానేయడం కన్నా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవడం మంచిది. వైట్ రైస్  వండే విధానంలో కొన్ని మార్పులు చేసుకుంటే హ్యాపీగా అన్నాన్ని తినొచ్చని చెబుతున్నారు న్యూట్రిషనిస్టులు.  

అన్నం ఎందుకు తినాలి?
వైట్ రైస్ తినడం మానేస్తే నష్టమా? ఆరోగ్యపరంగా నష్టమనే చెప్పాలి. అందులోనూ మనశరీరానికి కొన్నేళ్లుగా అలవాటైన ఆహారాన్ని తినడం మానేస్తే తెలియకుండానే ఆ ప్రభావం పడుతుంది. అంతేకాదు అన్నంలో మెగ్నీషియం, బి విటమిన్లు, ఐరన్, అదనపు పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ముఖ్యంగా గ్లూటెన్ ఉండదు. చపాతీలతో పోలిస్తే అన్నం తేలికగా జీర్ణమవుతుంది. కాబట్టి పెద్దవాళ్లకి, పిల్లలకి అన్నం పెట్టడమే మంచిది. 

అన్నం వండే పద్ధతులు
బరువు పెరుగుతామని అన్నాన్ని తినడం మానేసే వాళ్లు, బరువు పెరిగే అవకాశం లేకుండా ఇలా వండుకుని తింటే మంచిది. 
1. అన్నం ఒక్కటే వండకుండా అందులో కొన్ని కూరగాయలను కలిపి వండుకోవాలి. దీని వల్ల అన్ని రకాల పోషకాలు ఆ మిశ్రమ ఆహారంలో లభిస్తాయి. అంతేకాదు కూరగాయలు కలవడం వల్ల అన్నం తినే శాతం కూడా తగ్గుతుంది. అలాగే ఇందులో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది.
2. అలాగే బియ్యం, పెసలు కలిపి అప్పుడప్పుడు వండుకుని తినండి. దీని వల్ల  కూడా  శక్తి వనరులు శరీరంలో చేరుతాయి. కూరగాయలు కూడా వేసుకుని కిచిడీలా చేసుకుంటే మరీ మంచిది. ఇది కొంచెం తింటే చాలు పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఎక్కువగా తినరు కూడా.
3. బరువు తగ్గాలనుకునే వారు అన్నంలో ఒక స్పూను కొబ్బరి నూనె వేసుకుని తింటే మంచిది. బరువు తగ్గే అవకాశం ఉంటుంది. 
4. డయాబెటిస్ ఉన్న వారు కూడా అన్నంలో కాస్త నెయ్యి లేదా కొబ్బరి నూనె వేసుకుని తింటే మంచిది. ఎన్నో పోషకాలు కూడా శరీరానికి అందుతాయి. 

Read Also: కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్... మొదటి ఫోటో విడుదల చేసిన పరిశోధకులు

Read Also: శీతాకాలంలో ఏ సమయంలో తగిలే ఎండ వల్ల విటమిన్ డి లభిస్తుంది? వైద్యులు ఏం చెబుతున్నారు?

Read Also: మీ జీవితభాగస్వామిపై నమ్మకం పోయిందా? అయితే ఇలా చేయండి, బంధాన్ని నిలబెట్టుకోండి...

Read Also: ఇంట్లో ఇవి ఉంటే నెగిటివ్ ఎనర్జీ... డబ్బును రాకుండా అడ్డుకుంటాయి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 30 Nov 2021 11:49 AM (IST) Tags: weight gain White Rice Lose weight అన్నం Eating rice Rice cooking

సంబంధిత కథనాలు

‘ది కంజూరింగ్’ హౌస్, ఆ దెయ్యాల కొంపను రూ.11 కోట్లకు అమ్మేశారు, చరిత్ర తెలిస్తే షాకవుతారు!

‘ది కంజూరింగ్’ హౌస్, ఆ దెయ్యాల కొంపను రూ.11 కోట్లకు అమ్మేశారు, చరిత్ర తెలిస్తే షాకవుతారు!

Crocodile vs Lions: వీడియో - ఒక మొసలి, మూడు సింహాలు - వామ్మో, ఫైట్ మామూలుగా లేదు!

Crocodile vs Lions: వీడియో - ఒక మొసలి, మూడు సింహాలు - వామ్మో, ఫైట్ మామూలుగా లేదు!

బెట్, ఈ రాష్ట్ర ప్రజల్లా మనం ఉండగలమా? ఇలా మారాలంటే ఈ జీవితం సరిపోదేమో!

బెట్, ఈ రాష్ట్ర ప్రజల్లా మనం ఉండగలమా? ఇలా మారాలంటే ఈ జీవితం సరిపోదేమో!

Chilli Eating Record: ఓ మై గాడ్, ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయను చాక్లెట్‌లా తినేశాడు

Chilli Eating Record: ఓ మై గాడ్, ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయను చాక్లెట్‌లా తినేశాడు

Bermuda Triangle Tour: డెడ్లీ ఆఫర్, నౌకలో బెర్ముడా ట్రయాంగిల్‌కు టూర్, తిరిగి రాకపోతే ఫుల్ రిఫండ్!

Bermuda Triangle Tour: డెడ్లీ ఆఫర్, నౌకలో బెర్ముడా ట్రయాంగిల్‌కు టూర్, తిరిగి రాకపోతే ఫుల్ రిఫండ్!

టాప్ స్టోరీస్

F3 Movie OTT Release: 'ఎఫ్3' ఓటీటీ రిలీజ్ అప్డేట్ - స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?

F3 Movie OTT Release: 'ఎఫ్3' ఓటీటీ రిలీజ్ అప్డేట్ - స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?

IPL Final, RR vs GT Fantasy 11: ఐపీఎల్‌ ఫైనల్‌ ఫాంటసీ XIలో బెస్ట్‌ టీమ్‌ ఇదే!

IPL Final, RR vs GT Fantasy 11: ఐపీఎల్‌ ఫైనల్‌ ఫాంటసీ XIలో బెస్ట్‌ టీమ్‌ ఇదే!

Drone Shot Down: అమర్‌నాథ్ యాత్రపై ఉగ్ర కుట్ర, బాంబులతో వచ్చిన డ్రోన్‌ను కూల్చేసిన సైన్యం

Drone Shot Down: అమర్‌నాథ్ యాత్రపై ఉగ్ర కుట్ర, బాంబులతో వచ్చిన డ్రోన్‌ను కూల్చేసిన సైన్యం

Nepal Plane Missing: నేపాల్‌లో విమానం మిస్సింగ్, ATCతో సిగ్నల్స్ కట్ - లోపల ఉన్న 22 మందిలో భారతీయులు కూడా

Nepal Plane Missing: నేపాల్‌లో విమానం మిస్సింగ్, ATCతో సిగ్నల్స్ కట్ - లోపల ఉన్న 22 మందిలో భారతీయులు కూడా