APSRTC Maha Kumbh Mela: మహా కుంభమేళాకు విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులు.. 8 రోజుల ప్యాకేజీ ఛార్జీల వివరాలివే!
Maha Kumbh Mela: మహా కుంభమేళాకి వెళ్లాలి అనుకునే తెలుగువారికి APSRTC గుడ్ న్యూస్ చెప్పింది. ఇందుకో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ప్యాకేజీ వివరాలు పూర్తిగా ఇక్కడ తెలుసుకోండి

Maha Kumbh Mela APSRTC Special Buses: ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా (Maha Kumbh Mela 2025) వైభవంగా జరుగుతోంది. పుణ్యస్నానాలు ఆచరించేందుకు భారీగా భక్తులు తరలివెళుతున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే భక్తులకోసం APSRTC గుడ్ న్యూస్ చెప్పింది.
తెలుగు రాష్ట్రాల నుంచి మహా కుంభమేళాకి వెళ్లాలి అనుకున్న భక్తులకోసం విజయవాడ బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది APSRTC. ఈ బస్సులు కేవలం మహాకుంభమేళాకి మాత్రమే కాదు..ఈ యాత్రలో భాగంగా ప్రయాగరాజ్‌తో పాటు అయోధ్య, కాశీ పుణ్యక్షేత్రాలను దర్శించుకొనే విధంగా మొత్తం 8 రోజుల టూర్ ప్లాన్ రూపొందించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
Also Read: మౌని అమావాస్య, శివరాత్రికి భారీ రద్దీలో కుంభమేళాకి పరిగెత్తకండి.. ఇంట్లోనే ఇలా చేయండి చాలు!
ఫిబ్రవరి 1 శనివారం ఉదయం విజయవాడ PNBS నుంచి బస్సులు స్టార్ట్ అవుతాయి
ఫిబ్రవరి 2 ఆదివారం సాయంత్రం యాత్రికులు ప్రయాగరాజ్ చేరుకుంటారు
ఫిబ్రవరి 3 సోమవారం ప్రయాగ్ రాజ్‌లోనే బస చేయాల్సి ఉంటుంది
ఫిబ్రవరి 4 మంగళవారం రాత్రి ప్రయాగ్ రాజ్ నుంచి అయోధ్యకు బయలుదేరుతారు
ఫిబ్రవరి 5 బుధవారం ఉదయం అయోధ్య చేరుకుని బాల రాముడిని దర్శించుకుంటారు...ఇదే రోజు రాత్రి కాశీ ప్రయాణం ఉంటుంది
ఫిబ్రవరి 6 గురువారం వారణాసికి చేరుకుని ఆ రోజు అక్కడే దర్శనాలు చేసుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు
ఫిబ్రవరి 7 శుక్రవారం ఉదయం వారణాసి నుంచి బయలుదేరి ఫిబ్రవరి 08 ఉదయానికి విజయవాడ చేరుకుంటారు.
మొత్తం ఫిబ్రవరి 1 నుంచి 8 వరకూ..అంటే శనివారం నుంచి శనివారం వరకూ టూర్ ప్లాన్ ఇది...
Also Read: మహా కుంభమేళాలో భారీ తొక్కిసలాట.. మౌని అమావాస్య రోజు జరిగిన ఘటన 70 ఏళ్లు గడిచినా వణికిస్తూనే ఉంది!
ఈ యాత్రలో భాగంగా పిల్లలు, పెద్దలకు ఛార్జీల విషయంలో ఎలాంటి వ్యత్యాసం ఉండదు. అందరకీ టికెట్ రేట్ ఒకటే. సూపర్ లగ్జరీ కి 8 వేల రూపాయలు, స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్ కి 11 వేల రూపాయలు, వెన్నెల ఏసీ స్లీపర్ కి 14 వేల 500 రూపాయలు ఛార్జీలు వసూలు చేస్తారు. ఈ ఛార్జీలు కేవలం టికెట్ మాత్రమే.. భోజనం, వసతి ఖర్చులు ఎవరికి వారే పెట్టుకోవాలి.
యాత్రకు వెళ్లాలి అనుకుని ప్లాన్ చేసుకునే భక్తులు 30 నుంచి 35 మంచి కలసి వస్తే ఆర్టీసీ ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తుంది. ముందస్తు రిజర్వేషన్ కావాలంటే మీకు సమీపంలో ఉన్న బస్టాండ్, RTC టికెట్ బుకింగ్ ఏజెంట్లను సంప్రదిస్తే సరిపోతుంది.
మరిన్ని అదనపు వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే 80742 98487, 0866 2523926, 0866 2523928 ఈ ఫోన్ నంబర్ కి కాల్ చేస్తే తెలుసుకోవచ్చు.
విజయవాడ నుంచి మాత్రమే కాదు..ఇప్పటికే కొవ్వూరు, రాజమహేంద్రవరం డిపోల నుంచి బస్సులు ఏర్పాటు చేశామని, వాటిల్లో రిజర్వేషన్లు పూర్తయ్యాయని RTC అధికారులు తెలిపారు. విజయవాడ నుంచి కుంభమేళాకు ప్రత్యేక బస్సులు మాత్రం ఫిబ్రవరి 01 నుంచి బయలుదేరుతాయి.
జనవరి 13 న ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26 మహా శివరాత్రిలో ముగుస్తుంది... ఈ 45 రోజుల్లో రాజస్నానాలు ఆచరించే రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది...
Also Read: మౌని అమావాస్య రోజున కుంభమేళాకు వెళ్తున్నారా - సంగంలో స్నానం చేసే విధానం, పాటించాల్సిన నియమాలివే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

