Special Trains: ఏపీకి గుడ్ న్యూస్.. రాష్ట్రం మీదుగా బెంగుళూరు, చెన్నైకి 2 పర్మనెంట్ ట్రైన్స్.. రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే
Indian Railways | రాష్ట్రం మీదుగా బెంగుళూరు, తాంబరం (చెన్నై) కు రెండు పర్మనెంట్ ట్రైన్స్ వెళ్తాయి. ఏపీకి చెందిన ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు.

ఏపీ మీదుగా వెళ్లే రెండు క్రొత్త రైళ్లను ప్రారంభించింది రైల్వే శాఖ. ఇవి స్పెషల్ ట్రైన్స్ కాదు. పెర్మనెంట్ గా ఏపీ మీదుగా వెళ్లే ట్రైన్స్ కావడం విశేషం. అవేంటో ఇప్పుడు చూద్దాం.
1) 16523 SMVT బెంగళూరు, బాలూర్ ఘాట్ (వెస్ట్ బెంగాల్ ) వీక్లీ ఎక్స్ ప్రెస్
ఈ ట్రైన్ 21-01-2026 అంటే ఈరోజు (బుధవారం) నుండే ప్రారంభం అవుతోంది. SMVT బెంగళూరు స్టేషన్ లో ఉదయం 10:15 కి బయలుదేరే ఈ ట్రైన్ మొత్తం 2420km ప్రయాణించి మూడో రోజు (శుక్రవారం) ఉదయం 4:15 కి బాలూర్ ఘాట్ చేరుతుంది. ఈ ఎక్స్ ప్రెస్ 5 రాష్ట్రాల్లో 43 స్టాపుల్లో ఆగుతుంది.ఏపీ లో ఈ ట్రైన్ కు 17 స్టాపులు ఇచ్చారు. కుప్పం,నాయుడు పేట, నెల్లూరు, ఒంగోలు, చీరాల,తెనాలి, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి,సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి,కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్,పలాస స్టేషన్ల లో ఈ వీక్లీ ఎక్స్ ప్రెస్ ఆగుతుంది.
16524 బాలూర్ ఘాట్ - smvt బెంగుళూరు ఎక్స్ ప్రెస్
రిటర్న్ జర్నీ లో ఈ ట్రైన్ 16524 నెంబర్ తో వెస్ట్ బెంగాల్ లోని బాలూర్ ఘాట్ లో ప్రతీ శనివారం ఉదయం 5:15కి బయలుదేరి సోమవారం ఉదయం 3:00 గంటలకు బెంగుళూరు చేరుతుంది. ఈ ట్రైన్ 24.01.26 నుండి ప్రారంభం అవుతుంది . ఈ రైల్లో మొత్తం 22 కోచ్ లు ఉండగా వాటిలో 2AC-2, 3AC -6, స్లీపర్ -8, జనరల్ -04, సెకండ్ కమ్ లగేజ్-2 కోచ్ లు ఉంటాయి.
2) 16107-తాంబరం (చెన్నై )- సత్రాగచ్చి అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్
ట్రైన్ నెంబర్ 16107 అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ 23.01.26 నుండి ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం 3:30కి తాంబరం (చెన్నై) నుండి బయలుదేరి శనివారం రాత్రి 08:15కి సత్రాగచ్చి చేరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ ట్రైన్ సూళ్లూరుపేట, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి,సామర్లకోట, అనకాపల్లి,దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస స్టేషన్ల లో ఆగుతుంది.
16108- సత్రాగచ్చి- తాంబరం అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్
రిటర్న్ జర్నీ లో 16108 నెంబర్ తో సత్రాగచ్చి లో ప్రతీ శనివారం రాత్రి 11:55కి బయలుదేరి సోమవారం ఉదయం 09:15 కి తాంబరం చేరుకుంటుంది. ఈ రైలు 24.01.26 నుండి అందుబాటులోకి రానుంది.
ఈ ట్రైన్ లో మొత్తం 22 కోచెస్ ఉండగా వాటిలో సెకండ్ క్లాస్-11,స్లీపర్-08,సెకండ్ క్లాస్ కమ్ లగేజ్-2 బో్గీలు ఉంటాయి.





















