Border 2 Advance Booking: రిలీజుకు ముందే సన్నీ డియోల్ సినిమా సంచలనం... అడ్వాన్స్ బుకింగ్‌లో దుమ్ము దులుపుతున్న బోర్డర్ 2
Border 2 Collection Prediction: బోర్డర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ బావున్నాయి. సన్నీ డియోల్ తాజా దేశభక్తి చిత్రం విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. ప్రీ టికెట్ సేల్స్ ద్వారా భారీ వసూళ్లు సాధించింది.

బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ నటించిన తాజా సినిమా 'బోర్డర్ 2'. ఈ శుక్రవారం (జనవరి 23న) థియేటర్లలో విడుదలవుతోంది. బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. సినిమా అడ్వాన్స్ బుకింగ్ సోమవారం ప్రారంభమైంది. అది మొదలైన 48 గంటల్లోనే రికార్డు స్థాయిలో ప్రీ సేల్స్ సాధించింది. దీంతో ఇప్పటికే సన్నీ డియోల్ లాస్ట్ సినిమా 'జాట్' టోటల్ అడ్వాన్స్ బుకింగ్‌ను అధిగమించింది. అంతే కాకుండా ఇటీవల విడుదలైన 'ధురంధర్', పాన్ ఇండియా యాక్షన్ ఫిల్మ్ 'వార్ 2'ని కూడా అధిగమించింది. 'బోర్డర్ 2' అడ్వాన్స్ బుకింగ్‌లో ఇప్పటి వరకు ఎంత సంపాదించిందో తెలుసుకోండి.
'బోర్డర్ 2' అడ్వాన్స్ బుకింగ్‌లో ఇప్పటి వరకు ఎంత సంపాదించింది?
ఇండియాలో సోమవారం ఉదయం సన్నీ డియోల్ 'బోర్డర్ 2' అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. దేశభక్తితో కూడిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి రోజు సినిమా చూడటానికి ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. టికెట్ సేల్స్ జోరుగా సాగుతున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... విడుదలకు ముందే కోట్లలో వసూళ్లు సాధించిందీ సినిమా.
- సాక్‌నిల్క్ గణాంకాల ప్రకారం... 'బోర్డర్ 2' హిందీ 2D ఫార్మాట్‌లో ఇప్పటి వరకు ఒక లక్షా 2 వేల 750 టిక్కెట్లు అమ్ముడు అయ్యాయి.
- అదే విధంగా... బ్లాక్ సీట్లు లేకుండా ప్రీ టికెట్ సేల్‌లో ఇప్పటి వరకు రూ. 3.29 కోట్లు వసూలు చేసింది.
- బ్లాక్ సీట్లతో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా వచ్చిన ఆదాయం రూ. 6.53 కోట్లకు చేరుకుంది.
ఆ సినిమాల రికార్డులను బద్దలు కొట్టిన 'బోర్డర్ 2' అడ్వాన్స్ బుకింగ్!
విడుదలకు రెండు రోజుల ముందు 'బోర్డర్ 2' మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా వచ్చిన కలెక్షన్లు సన్నీ డియోల్ సినిమా 'జాట్' రికార్డును అధిగమించింది. 'జాట్' అడ్వాన్స్ బుకింగ్‌లో రూ. 2.4 కోట్లు వసూలు చేయగా... మొదటి రోజున రూ. 9 కోట్లు వసూలు చేసింది. అయితే ఇది సన్నీ నటించిన 'గదర్ 2' కంటే వెనుకబడి ఉంది. ఇది అడ్వాన్స్ బుకింగ్‌లో రూ. 17.60 కోట్లు వసూలు చేసింది. అయితే 'బోర్డర్ 2' అడ్వాన్స్ బుకింగ్‌కి ఈ రోజు, రేపు మరికొంత సమయం ఉంది. ఈ రెండు రోజుల్లో ప్రీ టికెట్ సేల్‌లో మరింత వృద్ధి చెందే అవకాశం ఉంది. దీని కారణంగా ఈ చిత్రం భారీ ఓపెనింగ్ సాధిస్తుందని భావిస్తున్నారు.
జె.పి. దత్తా 1997లో రూపొందించిన బ్లాక్ బస్టర్ 'బోర్డర్'కి సీక్వెల్ 'బోర్డర్ 2'. దీనికి అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు. సన్నీ డియోల్‌తో పాటు వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్, అహాన్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. 'బోర్డర్ 2'ని భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, జె.పి.దత్తా, నిధి దత్తా నిర్మించారు. ఈ చిత్రం గణతంత్ర దినోత్సవానికి ముందు జనవరి 23న థియేటర్లలో విడుదల కానుంది.






















