Hyderabad News: బేగంపేట ఫ్లైఓవర్‌పై కారు బోల్తా, నలుగురికి గాయాలు.. అసలేం జరిగింది
hyderabad News Today | రద్దీగా ఉండే బేగంపేట ఫ్లైఓవర్‌పై ఓ కారు అకస్మాత్తుగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. కాసేపు ట్రాఫిక్ జామ్ అయింది.

Begumpet Flyover | హైదరాబాద్: నగరంలోని రద్దీగా ఉండే బేగంపేట ఫ్లైఓవర్‌పై బుధవారం ఒక కారు ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ తాకిడికి కారు గాల్లోకి లేచి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో కారులో ఉన్న నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఫ్లైఓవర్‌పై కారు బోల్తా పడటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. క్రేన్ సహాయంతో కారును రోడ్డుపై నుంచి తొలగించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే చర్యలు చేపట్టారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.






















