Gaddar Awards 2025 : ది బెస్ట్ డాక్యుమెంటరీ 'యూనిటి' - కొండా లక్ష్మణ్ బాపూజీ కథకు ఫిదా
Unity Documentary : 'యూనిటీ' డాక్యుమెంటరీ గద్దర్ అవార్డ్ కైవసం చేసుకుంది. తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ కథను అద్భుతంగా వివరించారంటూ జ్యూరీ ప్రశంసలు కురిపించింది.

Konda Laxman Bapuji Unity Documentary Bags Gaddar Award 2025 : గత ఏడాదికి సంబంధించి గద్దర్ అవార్డ్స్‌ను తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం అనౌన్స్ చేసింది. బెస్ట్ డాక్యుమెంటరీగా 'యూనిటీ' అవార్డు దక్కించుకుంది. డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్మ్స్‌కు జ్యూరీ ఛైర్మన్‌గా ఉన్న ప్రముఖ డైరెక్టర్ విజయ్ కనకమేడల ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు. ఉగాది సందర్భంగా ఈ నెల 19న ఈ పురస్కారాన్ని అందించనున్నారు. వీటితో పాటే ఇతర విభాగాల్లోనూ బెస్ట్ వాటిని జ్యూరీ సభ్యులు సెలక్ట్ చేశారు.
స్వాతంత్ర్య సమర యోధుడు, తెలంగాణ జాతిపితగా పేరొందిన కొండా లక్ష్మణ్ బాపూజీపై యంగ్ డైరెక్టర్ బుడుగు విజయ్ కుమార్ ఈ డాక్యుమెంటరీ రూపొందించారు. 'ది మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్' అనేది ట్యాగ్ లైన్. చిరందాస్ శ్రీకాంత్ ఈ డాక్యుమెంటరీ నిర్మించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ... తెలంగాణ సమాజానికి మరో గాంధీ ఎలా అయ్యారనే విషయాన్ని ఇందులో ఇంట్రెస్టింగ్‌గా చూపించారు.
బాల్యం నుంచి మరణం వరకూ...
మైమ్ మధు, చైల్డ్ ఆర్టిస్ట్ భాను ప్రధాన పాత్రలు పోషిస్తూ కొండా లక్ష్మణ్ బాపూజీ కథను వివరించారు. డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకింగ్‌లో ఇలా వినూత్నమైన పద్దతిలో బాపూజీ బాల్యం నుంచి మరణం వరకు, ఆ తర్వాత తెలంగాణ సాధన వరకు ప్రతి విషయాన్ని ఎంతో స్పష్టంగా చిత్రీకరించడం పట్ల జ్యూరీ సభ్యులు ప్రశంసలు కురిపించారు. నాణ్యమైన విజువల్స్, స్పష్టమైన వాయిస్ ఓవర్, చక్కని ఎడిటింగ్‌తో దాదాపు అరగంట పాటు 'యూనిటీ' డాక్యుమెంటరీని తీర్చిదిద్దిన దర్శక నిర్మాతలకు అభినందనలు తెలిపారు.
Also Read : గద్దర్ అవార్డ్స్... బెస్ట్ మూవీ రాజు వెడ్స్ రాంబాయి - బెస్ట్ యాక్టర్‌గా చై, హీరోయిన్ రష్మిక
ఇతర అవార్డులు సైతం
ఇప్పటికే 'యూనిటీ' డాక్యుమెంటరీ పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై కూడా శభాష్ అనిపించుకొని అవార్డులు కైవసం చేసుకుంది. గతేడాది ఢిల్లీలో జరిగిన 15వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల్లో ఉత్తమ దర్శకుడిగా దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకోగా... ముంబయిలో జరిగిన భారత్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ - 2023లో యూనిటీ డాక్యుమెంటరీకి రెండు అవార్డులు దక్కాయి.
బెస్ట్ హిస్టారికల్ డాక్యుమెంట్ ఫిల్మ్, ఐకానిక్ ఫ్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డును సైతం సొంతం చేసుకుంది. ఇలా... ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకున్న UNITY డాక్యుమెంటరీ ఫిల్మ్ ను తెలంగాణ ప్రభుత్వం గుర్తించి గద్దర్ అవార్డుకు ఎంపిక చేయడం పట్ల దర్శకుడు విజయ్ కుమార్, నిర్మాత శ్రీకాంత్ ఆనందం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కోసం పరితపించిన మహోన్నత శిఖరం లాంటి వ్యక్తి చరిత్రను గుర్తించి ప్రోత్సహించడం కొండా లక్ష్మణ్ బాపూజీ పట్ల ప్రభుత్వం తన సామాజిక బాధ్యతను చాటుకుందని తెలిపారు. అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీ ఛైర్మన్ విజయ్ కనకమేడల, జ్యూరీ సభ్యులకు దర్శకుడు విజయ్, నిర్మాత శ్రీకాంత్‌తో పాటు అందులో నటించిన మైమ్ మధు, బాలనటుడు మాస్టర్ భాను ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ట్రెండింగ్ వార్తలు























