Foods for Cancer: క్యాన్సర్‌ను అడ్డుకునే ఆహార పదార్థాలివే... వారంలో ఓసారైనా తినండి
ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ వల్ల వేల మంది మరణిస్తారు. కొంతమంది ఏం తినాలో అవగాహన లేక ప్రమాదంలో పడుతున్నారు.
మానవ ఆరోగ్యాన్ని కాపాడేందుకు నిత్యం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉంటారు. చెడు జీవనశైలి, సారం లేని ఆహారం వల్ల ప్రజలు అనేక రోగాల బారిన పడుతుండడం వారిని కలవరపెడుతున్న అంశం. అందుకే కొన్ని రోగాలు రెచ్చిపోతున్నాయి. వాటికి అడ్డుకట్ట వేయాలంటే కేవలం మందులు వాడడమే కాదు, వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తినడం ముఖ్యంగా. ప్రపంచంలో మహమ్మారి రోగాల్లో మొదటిస్థానం క్యాన్సర్‌దే. కొన్ని ఆహారపదార్థాలు క్యాన్సర్ ను నిరోధించడంలో ముందుంటాయని కనుగొన్నారు అమెరికన్ ఇన్స్‌స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ పరిశోధకులు. వీటిని మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. వారంలో వీటన్నింటినీ ఒకసారైనా తినాలి. రోజూ తింటే మరీ మంచిది.
1. చెర్రీ పండ్లు
చెర్రీ పండ్లు మనకు తక్కువగానే దొరుకుతాయి. సూపర్ మార్కెట్లు, ఆన్‌లైన్ గ్రోసరీ స్టోర్లలో ఇవి లభిస్తాయి. టెక్సాస్ యూనివర్సిటీలోని న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సైన్స్ విభాగం నిపుణులు చెప్పిన ప్రకారం చెర్రీపండ్లలో ఆంథోసైనిన్స్ సమృద్ధిగా ఉంటాయని, ఇవి రొమ్ముక్యాన్సర్, పాంక్రియాటిక్ క్యాన్సర్ నివారించడంలో ముందుంటాయి. పాంక్రియాటిక్ క్యాన్సర్ చాలా ప్రాణాంతకమైనది. వచ్చిన ఆరునెలల్లోనే అనేక మంది రోగులను చంపేస్తుంది. చెర్రీల్లో ఉండే పాలీఫెనాల్స్ దీనిపై ప్రభావవంతంగా పనిచేస్తాయి. చెర్రీలలో క్యాన్సర్ పోరాట గుణాలు పుష్కలంగా ఉన్నాయి.
2. బ్లూ బెర్రీస్
అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ ప్రకారం బ్లూబెర్రీస్ అనేక ఫైటో కెమికల్స్, పోషకాలను కలిగి ఉంటాయి. ఇది క్యాన్సర్ నిరోధక లక్షణాలను చూపెట్టాయి. వీటిని తినడం ల్ల రక్తంలో యాంటీఆక్సిడెంట్ పనితీరు పెరుగుతుందని అలాగే డీఎన్ఏ దెబ్బతినకుండా నిరోధించే సామర్థ్యాన్ని చూపుతుందని అనేక అధ్యయనాల్లో తేలింది.
3. ద్రాక్ష పండ్లు
ద్రాక్ష పండ్లలో బెర్గామోటిన్ అనే బయోయాక్టివ్ సమ్మేళనం ఉంది. ఇది క్యాన్సర్ నిరోధక లక్షణాలు కలిగి ఉంటుంది. పరిశోధకులు చెప్పిన ప్రకారం ద్రాక్షపండులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడేటివ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. గ్లియోమో, రొమ్ము క్యాన్సర్, మల్టిపుల్ మైలోమా, ప్రొస్టేట్ క్యాన్సర్, కాలేయం, చర్మం, ఊపిరితిత్తుల క్యాన్సర్లను నిరోధించే అద్భుతమైన లక్షణాలు ద్రాక్షపండ్లలో ఉన్నాయి.
4. దానిమ్మ
హార్వర్డ్ వైద్యులు దానిమ్మను అన్ని పండ్లలో రత్నం లాంటి పండని అంటారు. దీనింలో హీలింగ్ ఎలిమెంట్స్, రోధనిరోధక శక్తిని పెంచే లక్షణాలు పుష్కలంగా ఉంటాయని చెబుతారు. ఇవి కాలుష్యం, సిగరెట్ పొగ వంటి పర్యావరణ విషపదార్థాల నుంచి కణాలను రక్షించడంలో సహాయపడతాయి. క్యాన్సర్‌కు దారితీసే డీఎన్ఏ దెబ్బతినకుండా నిరోధించడానికి సాయపడతాయి. దానిమ్మలో ఉండే పాలీఫెనాల్స్ బలమైన యాంటీక్యాన్సర్ చర్యను ప్రదర్శిస్తాయని గుర్తించారు.
5. బ్రకోలి, కాలీఫ్లవార్, క్యాబేజీ
బ్రస్సెల్స్ మొలకలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రకోలి, కాలేలను క్రూసిఫెరస్ జాతి కూరగాయలు అని పిలుస్తారు. వీటిలో ఫైటో కెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి క్రూసిఫెరస్ కూరగాయల్లో క్యాన్సర్ పోరాట లక్షణాలు ఎక్కువ. వీటిలో విటమిన్ సి, కె, ఫోలేట్, పొటాషియం, మెగ్నిషియం కూడా లభిస్తాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి ముందుంటాయి. క్యాన్సర్ కణాలను నిర్వీర్యం చేస్తాయి, డీఎన్ఏ దెబ్బతినకుండా కణాలను కాపాడతాయి, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టిరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. అందుకే వీటిని వారానికి కనీసం రెండు సార్లు తింటే మంచిది.
Read Also: నిద్ర సరిగా పట్టడం లేదా... ఈ విటమిన్ల లోపం ఉందేమో చెక్ చేసుకోండి
Read Also: అబార్షన్ చేయించుకున్నాక ఎలా ఉంటుందో తెలుసా? ఈ బాధలన్నీ భరించాల్సిందే
Read Also: ఒక సరస్వతి మొక్కను పెంచుకోండి, ఆ ఆకుల రసంతో ఎన్నో ఆరోగ్యసమస్యలు తొలగిపోతాయి
Read Also: ఈ కూరల్లో కొలెస్ట్రాల్ తక్కువ, బరువు తగ్గాలనుకునే వాళ్లకి ప్రత్యేకం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి