అన్వేషించండి

Weekly Horoscope 19 to 25 February 2024: ఈ వారం ఈ రాశులవారి ఆరోగ్యం, ఆదాయం అద్భుతం- ఫిబ్రవరి 19 నుంచి 25 వారఫలాలు!

Weekly Horoscope 19 to 25 February : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ వారం రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

Weekly Horoscope 19 to 25 February 2024: ఫిబ్రవరి 19 నుంచి 25 వారఫలాలు

మేష రాశి (Aries Weekly Horoscope)

మేష రాశి వారు ఈ వారం అనవసర విషయాలను పక్కనపెట్టి అత్యవసర పనులపై మాత్రమే దృష్టి సారించాలి. శని చంద్రుని రాశి నుంచి  పదకొండో స్థానంలో ఉన్నందున ఈ వారం ఈ రాశి వ్యాపారులు మంచి లాభాలు పొందే అవకాశాలున్నాయి. భారీ ఆర్థిక లాభాలను పొందుతారు. అయితే ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉన్నత చదువుల కోసం ప్రయత్నిస్తున్న వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. "ఓం భౌమాయ నమః" అని ప్రతిరోజూ 27 సార్లు జపించండి. 

వృషభ రాశి (Taurus Weekly Horoscope)

వృషభ రాశి వారికి ఈ వారం అనుకూల సమయం. రాహువు చంద్రుని రాశి నుంచి పదకొండవ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక వ్యవహారాలు కలిసొస్తాయి. వివిధ రకాల పెట్టుబడుల వైపు ఆకర్షితులవుతారు. చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఆహారంపై శ్రద్ధ వహించాలి...ఆరోగ్యకర ఆహారం తీసుకోవాలి. ఉద్యోగులు, వ్యాపారులకు కలిసొచ్చే సమయం. ప్రతిరోజూ లలితా సహస్రనామాన్ని జపించండి.  

Also Read: ఈ రాశులవారికి ఇది రైజింగ్ టైమ్, ఫిబ్రవరి 17 రాశిఫలాలు

మిథున రాశి (Gemini Weekly Horoscope)

ఈ వారం మీరు చేపట్టిన పనులు మధ్యలో వదిలేయవద్దు. మీకోసం మీరు సమయం వెచ్చించండి. గతంలో విపరీతమైన మానసిక ఒత్తిడికి గురయ్యారు..దాన్నుంచి బయటపడేందుకు మీకు తగిన విశ్రాంతి అవసరం. తొందరగా అలసిపోయే పనులకు దూరంగా ఉండాలి. ఈ రాశివారికి కూడా ఈవారం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ వారం మీరు మూగజీవాలకు ఆహారం అందించాలి. ముఖ్యంగా ఆవులకు మేత వేయాలి. 

కర్కాటక రాశి (Cancer Weekly Horoscope) 

కర్కాటక రాశి వారికి ఈ వారం ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ రాశ్యాధిపతి పెద్ద రోగాల బారినుంచి రక్షిస్తాడు.  చిన్న చిన్న శారీరక సమస్యలు ఎప్పటికప్పుడు ఎదురవుతున్నప్పటికీ గడిచినవారం కన్నా ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు వినియోగించే ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  రోజూ హనుమాన్ చాలీశా చదవడం మంచిది. 

సింహ రాశి (Leo Weekly Horoscope)

సింహ రాశి వారికి తొమ్మిదో స్థానంలో బృహస్పతి ఉండటం వల్ల ఆరోగ్యం బావుంటుంది. వారం ప్రారంభం అన్నీ అనుకూల ఫలితాలున్నాయి. వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితి అనుకూలం. నూతన పెట్టుబడులు కలిసొస్తాయి. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం.. రోజూ  11 సార్లు ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రం జపించండి. 

Also Read: మీరు సక్సెస్ అవ్వాలంటే ఈ 3 ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉండాలి - ఉన్నాయా మరి! - చాణక్యనీతి!

కన్యా రాశి (Virgo Weekly Horoscope)

ఈ వారం కన్యారాశివారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది.  శని చంద్రరాశి నుంచి ఆరో స్థానంలో ఉంటుంది. ఈ ఫలితంగా ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ సీజనల్ సమస్యలు కొంత ఇబ్బంది పెడతాయి. మీలో ఉత్సాహాన్ని పెంచే ప్రణాళికలు వేసుకోండి. ఉద్యోగులు, వ్యాపారులు పనిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించినప్పుడే మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థిక పరంగా మంచి సమయం. ఈ వారం మీరు అన్నదానం చేయండి. 

తులా రాశి (Libra Weekly Horoscope)

తులా రాశివారు ఈ వారం ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగులకు సమయపాలన చాలా అవసరం. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలి. ఈ వారం మీ మనసులో కొన్ని గందరగోళ పరిస్థితులుంటాయి. మీకు ఏం కావాలో మీకే అర్థంకాని స్థితిలో ఉంటారు. కుటుంబానికి సమయం కేటాయించాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో తొందరపాటు వద్దు.  ప్రతిరోజూ గణేష్ చాలీసా చదువుకోండి

వృశ్చిక రాశి (Scorpio Weekly Horoscope)

వృశ్చిక రాశి వారు ఈ వారం బిజీ బిజీగా ఉంటారు. ఆరోగ్యం సాధారణం కన్నా మెరుగ్గా ఉంటుంది కానీ అజాగ్రత్తగా ఉండొద్దు. మీ గౌరవాన్ని తగ్గించే పనులు చేయవద్దు. మీలో సృజనాత్మక ఆలోచనలు పెరుగుతాయి. ఆర్థిక సంబంధించిత వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులు పనికి తగిన గుర్తింపు పొందుతారు.  "ఓం భూమి పుత్రాయ నమః" అని రోజూ 21 సార్లు జపించండి 

ధనస్సు రాశి (Sagittarius Weekly Horoscope)

ధనుస్సు రాశి వారికి గతం వారం కన్నా ఈ వారం మంచి ఫలితాలున్నాయి. ఉద్యోగులు పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. మీ చుట్టుపక్కల వారికి మీరు ఆదర్శనీయంగా మారుతారు. కుటుంబంలో, కార్యాలయంలో మీకు సంపూర్ణ ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారులు ఊహించని లాభాలు పొందుతారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. అకస్మాత్తుగా ధనం పొందుతారు. సేవ చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు.  గురువారం రోజు వృద్ధులకు పండ్లు దానం చేసి వారి ఆశీర్వాదం తీసుకోండి. 

Also Read:  వైవాహిక జీవితం - లైంగిక సంబంధాలు.. చాణక్యుడు చెప్పిన ఆసక్తికర అంశాలు

మకర రాశి (Capricorn Weekly Horoscope)

మకర రాశివారు ఈ వారం పనితో పాటూ ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవాలి.పనిభారం పెరుగుతుంది ..ఒత్తిడిని అధిగమించాలి. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ ఖర్చులు తగ్గించుకునే ప్రణాళికలు వేసుకోవాలి. వ్యాపారులు పాత ప్రణాళికలను ఇప్పుడు అమలు చేసేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వారం శనిగ్రహానికి యాగం-హవనం చేయండి.

కుంభ రాశి (Aquarius Weekly Horoscope)

కుంభ రాశి వారికి ఆరోగ్యపరంగా ఈ వారం మీకు మంచిది. చంద్రునికి సంబంధించి మూడో ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల మీ ఆరోగ్యంలో చాలా మెరుగుదల ఏర్పడి సానుకూలత కనిపిస్తుంది.  ఉద్యోగులకు, వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. మంగళవారం కేతు గ్రహాన్ని ఆరాధించండి. 

Also Read: భర్త దగ్గర భార్య కామన్ గా దాచే 6 ముఖ్యమైన విషయాలు!

మీన రాశి (Pisces Weekly Horoscope)

మీన రాశి వారికి ఈ వారం శని చంద్రుని రాశి నుండి పన్నెండవ ఇంట్లో ఉండటం వల్ల మీరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మీరు ప్రారంభించే కొత్త పనులకు కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. ఈ వారం ఈ రాశి ఉద్యోగులకు పని ఒత్తిడి ఉంటుంది కానీ ప్రశాంతంగా ఉంటారు. మీ దినచర్యలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల మరింత ఆనందం మీ సొంతం.  ప్రతిరోజూ 22 సార్లు "ఓం రాహవే నమః" జపించండి.

గమనిక:  ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
Embed widget