అన్వేషించండి

Chanakya Niti: వైవాహిక జీవితం - లైంగిక సంబంధాలు.. చాణక్యుడు చెప్పిన ఆసక్తికర అంశాలు

గొప్ప దౌత్యవేత్తగా, రాజనీతికోవిదుడిగా, ఆర్థికవేత్తగా మన్ననలు అందుకున్న చాణక్యుడు… వైవాహిక జీవితం..లైంగిక సంబంధాల గురించి కూడా ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పాడు. అవేంటో చూద్దాం…

అర్థశాస్త్రంలో ఎనిమిది రకాల వివాహాల గురించి చెప్పాడు చాణక్యుడు

బ్రాహ్మణ: యుక్త వయస్సు వచ్చిన తన కుమార్తెను తండ్రి తగు వరుడుకి ఇచ్చి వివాహం చేయడం

ప్రజాపత్య: తండ్రి అనుమతి లేకుండా ఓ పురుషుడు - ఓ స్త్రీని వివాహం చేసుకోవడం

ఆర్ష: వివాహం అయిన తర్వాత వరుడు రెండు గోవులను వధువు తండ్రికి ఇచ్చి పెళ్లిని శాస్త్రబద్ధం చేసుకోవడం.

దైవ: దైవపీఠం వద్ద తండ్రి తన కుమార్తెను పురోహితుడిగా వ్యవహరిస్తున్న వ్యక్తికి ఇచ్చేయడం

గాంధర్వ: ప్రేమికులు రహస్యంగా పెళ్లిచేసుకోవడం

అసుర: తండ్రి తన కుమార్తెను ఏదో ఒక ధరకు ఎవరో ఒకరికి ఇచ్చి పెళ్లిచేయడం

రాక్షస: అమ్మాయిని బలవంతంగా ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోవడం

పైశాచ: యువతికి మత్తుమందిచ్చి ఆమెకు తెలియకుండా పెళ్లిచేసుకోడం

మొదటి నాలుగు చట్టబద్ధత కల వివాహాలు... మిగిలిన నాలుగూ చట్టబద్ధతలేని వివాహాలు అయినప్పటికీ… ఆ తర్వాత వధువు తల్లిదండ్రులు అంగీకరించాక… అవికూడా చట్టబద్ధమైనవి అవుతాయి.

వివాహ సమయంలో ఇచ్చిన కట్నం వరుడి తండ్రికి చెందుతుంది. తండ్రిలేకపోతే తల్లికి చెందుతుంది. పురుషుడు పునర్వివాహం చేసుకుంటే ఆ కట్నం మొత్తం స్త్రీకే చెందుతుంది. 

Chanakya Niti: వైవాహిక జీవితం - లైంగిక సంబంధాలు.. చాణక్యుడు చెప్పిన ఆసక్తికర అంశాలు

పెళ్లి ఎప్పుడు రద్దుచేసుకోవచ్చు

  • పెళ్లి విషయంలో ఒప్పందం కుదిరినా… పాణిగ్రహణం కాకపోతే వివాహం రద్దుచేసుకోవచ్చు.
  • పాణిగ్రహణం అయిన తర్వాత కూడా… వధువు ఇదివరకే కన్యత్వం కోల్పోయిందని రుజువైనా… వరుడు పురుషత్వం లేనివాడైనా ఆ వివాహం రద్దవుతుంది. ఈ నియమం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలవారికే వర్తిస్తుంది.
  • శూద్రుల విషయంలో వైవాహిక ఒప్పందం వధూవరుల కలయికకు ముందు ఎప్పుడైనా జరగొచ్చు. కలయిక అయిన తర్వాత రద్దు అయ్యే అవకాశం లేదు.
  • ఏ కులంలో అయినా స్త్రీ గర్భవతి అయిన తర్వాత వివాహం రద్దుకి అవకాశం ఉండదు
  • స్త్రీకి లైంగికపరమైన లోపం ఉందని తల్లిదండ్రులకు తెలిశాక… రహస్యంగా ఉంచి పెళ్లి చేసినా… వధువుకు-ఆమె తల్లిదండ్రులకు అపరాధ రుసుము విధించి పెళ్లి రద్దుచేస్తారు. పురుషుడి విషయంలో ఇదే జరిగితే అపరాధ రుసుము ఎక్కువ మొత్తంలో వసూలు చేయాల్సి ఉంటుంది
  • పెళ్లిచూపుల్లో ఒకరిని చూపించి మరోకరితో పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తే అది పెద్దనేరంగా భావించి… వధువు లేదా వరుడు తల్లిదండ్రుల నుంచి పెద్దమొత్తంలో అపరాధ రుసుము వసూలు చేయాల్సి ఉంటుంది. 
    Chanakya Niti: వైవాహిక జీవితం - లైంగిక సంబంధాలు.. చాణక్యుడు చెప్పిన ఆసక్తికర అంశాలు
  • కౌటిల్యుడి కాలంలో రజస్వల అయిన బాలికకు మూడేళ్లలోపు పెళ్లి జరిపించడం సంప్రదాయం. అలా చేయకపోతే బాలికతండ్రి శిక్షార్హుడు.
  • తమ కులానికి చెందిన పురుషుడితో కూతురికి తండ్రి పెళ్లి చేయాలి. వేరే కులానికి చెందిన యువకుడికి ఇచ్చి పెళ్లిచేస్తే… ఆ సమయంలో వధువుకి ఇచ్చిన నగలన్నీ తండ్రి తిరిగి తీసుకోవచ్చు. కులాంతర వివాహానికి చాణక్యుడు విధించిన శిక్ష ఇది.
  • స్త్రీకి 12 ఏళ్లు వచ్చినపుడు… పురుషుడికి 16 ఏళ్లు  ఉండాలి. అప్పుడే వారి వైవాహిక జీవితం మొదలవుతుంది. వేరే కారణాలతో బాలిక తల్లిదండ్రులు కాలయాపన చేస్తే శిక్షార్హులు.
  • ఏ కారణం చేతేనైనా పెళ్లిచేయలేకపోతే… కనీసం నిశ్చితార్థమైనా జరిపించాలి. ఆ తర్వాత ఏడు నెలలు దాటేలోగా పెళ్లిచేయకపోతే…వరుడు-వధువు లైంగిక సంబంధం పెట్టుకోవచ్చు. అది నేరంగా పరిగణించరాదు.
  • నిశ్చితార్థం అయిన తర్వాత ఏవేవో కారణాలు చూపి వరుడు… వధువుని నిందిస్తే శిక్షార్హుడు. ఆ వివాహం కూడా రద్దు చేసి సదరు వరుడికి శిక్ష విధిస్తారు.
  • పెళ్లైనంత మాత్రాన భార్యపై… భర్తకి సర్వాధికారులు ఉండవు. ఆమె అంగీకారం లేకుండా ముట్టుకోరాదు.. అంటూ వైవాహిక జీవితం - లైంగిక సంబంధాల గురించి చాణక్యుడు తన అభిప్రాయాలు పేర్కొన్నాడు.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget