అన్వేషించండి

Chanakya Niti In Telugu: భర్త దగ్గర భార్య కామన్ గా దాచే 6 ముఖ్యమైన విషయాలు!

Chanakya Niti : ఎంత పారదర్శకంగా ఉండే రిలేషన్లో అయినా కొన్ని రహస్యాలుంటాయి. ఏ విషయం దాచేదేలే అనుకుంటే సమస్యలు తప్పవు. ఇలా ప్రతి భార్యా తన భర్త దగ్గర కామన్ గా కొన్ని విషయాలు దాచుతుంది..అవేంటంటే..

Chanakya Niti In Telugu:  అప్పటి పరిస్థితులకు అనుగుణంగా చాణక్యుడు చెప్పిన మాటలు, చేసిన బోధనలు ఎప్పటికీ ఆచరణీయంగానే ఉంటాయి. ముఖ్యంగా మనుషుల వ్వవహారశైలికి సంబంధించి చెప్పిన మాటలు ప్రతి ఒక్కరి జీవితానికీ ఎంతో ఉపయోగపడతాయి. ఎలా ప్రవర్తించాలి -ఎలా ప్రవర్తించకూడదో అనే విషయాలపై ఓ స్పష్టతని ఇస్తాయి. ముఖ్యంగా రిలేషన్ షిప్ గురించి చాణక్యుడు చాలా విషయాలు చెప్పాడు. ఆరోగ్యకరమైన రిలేషన్ షిప్ నమ్మకం, నిజాయితీపై ఆధారపడి ఉంటుంది. పారదర్శకత ఆ బంధాన్ని మరింత అందంగా మార్చుతాయి. తన అనుకున్న వ్యక్తితో ప్రతి విషయం పంచుకోవాలి అనుకుంటారు. అయితే ఎంత నమ్మకంగా ఉన్నా...కొన్ని విషయాలు మాత్రం ఇద్దరూ ఒకరి దగ్గర మరొకరు సీక్రెట్ గా ఉంచుతారు. ముఖ్యంగా ప్రతి భార్యా..తన భర్త దగ్గర ఈ 6 విషయాలు దాచిపెడుతుంది. ఇవి దాచిపెడితేనే ఇద్దరి మధ్యా మనస్పర్థలు రాకుండా, ఆ బంధం చెడిపోకుండా ఉంటుందన్నది చాణక్యుడి భావన.

Also Read: చాణక్య నీతి: పెళ్లికి ముందే ఈ నాలుగు విషయాలపై క్లారిటీ తెచ్చుకోవడం మంచిది

రహస్య సంబంధం (Secret Crush)

ప్రతి స్త్రీకి సీక్రెట్ క్రష్ ఉంటుందంటాడు చాణక్యుడు. అది ఏ దశలో అయినా కావొచ్చు కానీ వేరొక వ్యక్తిని ఇష్టపడే సందర్బం ఆమె జీవితంలో తప్పనిసరిగా ఉంటుంది. ఈ విషయాన్ని ఏ భార్యా...భర్తకు చెప్పాలి అనుకోదు. తన సన్నిహితుడికి సంబంధించిన ఏ విషయాన్నీ జీవిత భాగస్వామి దగ్గర ప్రస్తావించే అవకాశం వచ్చినా అస్సలు పంచుకోదు.

ఓకే అంటుంది కానీ..(Agrees (but doesn't agree) on most issues)

చాలా విషయాలపై అంగీకరించినట్టే కనిపిస్తుంది కానీ నచ్చకపోయినా నో అనిమాత్రం చెప్పలేదు. కొన్నిసార్లు భర్త తీసుకునే నిర్ణయాలు ఆమెకు నచ్చకపోయినా కానీ  ఆ విషయం చెప్పకుండా ఓకే అనేస్తుంది.

కలయిక తర్వాత నిజం చెప్పరు (Feeling of satisfaction after sex)

శృంగారం తర్వాత కూడా ప్రతి భార్యా భర్తకు అబద్ధం చెబుతుందన్నది చాణక్యుడి భావన. సాధారణంగా మగవారి కన్నా ఆడవారిలో కోర్కెలు ఎక్కువని చెప్పిన చాణక్యుడు...సెక్స్ తర్వాత వారు పూర్తిగా సంతృప్తి చెందకపోయినా కానీ జీవిత భాగస్వామి అడిగితే నిజం చెప్పరు. 

Also Read: పడకగది పనులు కూడా బహిరంగం.. కాకిని చూసి ఈ విషయాలు నేర్చుకోవాలన్న చాణక్యుడు

సీక్రెట్ సేవింగ్స్ ( Wives hide savings)

సంపాదించే భార్య అయినా, గృహిణి అయినా కానీ నూటికి నూరుశాతం మహిళలు భర్తకు తెలియకుండా పొదుపు చేస్తారు. అందుకే గృహలక్ష్మి అంటారు. సంక్షోభ సమయంలో ఆదుకునే బ్యాంక్ ఇది. కుటుంబానికి అత్యవసర సమయం వచ్చినప్పుడు ఉపయోగపడేవి ఈ డబ్బులే. 

అనారోగ్యం చెప్పరు (Their ailment)

తొందరగా అలసిపోయినా, అనారోగ్యం పాలైనా కానీ ఆ విషయం జీవితభాగస్వామికి చెప్పాలని అనుకోరు. అవే తగ్గుతాయిలే అని సర్దుకుపోతూ కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అనుకుంటారు.

అభిప్రాయ బేధాలు ( Reveal issues, but not let the man know)

జీవిత భాగస్వామితో ఉండే అభిప్రాయ బేధాలను చాలామంది భార్యలు వారితో కాకుండా మూడో వ్యక్తితో పంచుకుంటారు. భర్త దగ్గర మాత్రం తమ భావోద్వేగాలను దాచుకుని సర్దుకుపోతారు.

Also Read: కింగ్ అవ్వాల్సిన కొడుకుని కురూపిగా మార్చేసిన తండ్రి, కానీ..చాణక్యుడికి అదే వరమైంది.. 

ఈ రహస్యాలేవీ ప్రమాదకరమైనవి కాదు..ఇలాంటి విషయాలు చెప్పడం వల్ల ఇద్దరి మధ్యా సమస్యలు పెరుగుతాయి. అందుకే ఎంత పారదర్శకంగా ఉండే బంధం మధ్య అయినా కొన్ని రహస్యాలుండడం మంచిదే అన్నది చాణక్యుడి ఉద్దేశం...

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

మేడారంలో భక్తులకు హెలికాప్టర్‌ సేవలు, 7 నిముషాలు ఏరియల్‌ వ్యూ చూసేందుకు ఛార్జీ ఎంతో తెలుసా?
మేడారంలో భక్తులకు హెలికాప్టర్‌ సేవలు, 7 నిముషాలు ఏరియల్‌ వ్యూ చూసేందుకు ఛార్జీ ఎంతో తెలుసా?
Disqualification of YSRCP MLAs: వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హతకు స్పీకర్ రోడ్ మ్యాప్ - జగన్ ఎలా కాపాడుకుంటారు?
వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హతకు స్పీకర్ రోడ్ మ్యాప్ - జగన్ ఎలా కాపాడుకుంటారు?
Kamareddy Crime News:కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!
కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!
Ee Nagaraniki Emaindi Sequel Cast: 'యానిమల్' నుంచి ఈ నగరానికి... తరుణ్ భాస్కర్ సినిమాలో హీరోగా 'హిట్' యాక్టర్!
'యానిమల్' నుంచి ఈ నగరానికి... తరుణ్ భాస్కర్ సినిమాలో హీరోగా 'హిట్' యాక్టర్!

వీడియోలు

Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam
Medaram Jatara Day 1 Speciality | మేడారం జాతర మొదటి రోజు ప్రత్యేకత ఇదే | ABP Desam
MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
మేడారంలో భక్తులకు హెలికాప్టర్‌ సేవలు, 7 నిముషాలు ఏరియల్‌ వ్యూ చూసేందుకు ఛార్జీ ఎంతో తెలుసా?
మేడారంలో భక్తులకు హెలికాప్టర్‌ సేవలు, 7 నిముషాలు ఏరియల్‌ వ్యూ చూసేందుకు ఛార్జీ ఎంతో తెలుసా?
Disqualification of YSRCP MLAs: వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హతకు స్పీకర్ రోడ్ మ్యాప్ - జగన్ ఎలా కాపాడుకుంటారు?
వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హతకు స్పీకర్ రోడ్ మ్యాప్ - జగన్ ఎలా కాపాడుకుంటారు?
Kamareddy Crime News:కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!
కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!
Ee Nagaraniki Emaindi Sequel Cast: 'యానిమల్' నుంచి ఈ నగరానికి... తరుణ్ భాస్కర్ సినిమాలో హీరోగా 'హిట్' యాక్టర్!
'యానిమల్' నుంచి ఈ నగరానికి... తరుణ్ భాస్కర్ సినిమాలో హీరోగా 'హిట్' యాక్టర్!
Gold Investment: లక్షా యాభై వేలు దాటిన 10 గ్రాముల బంగారం!ఇప్పుడు బంగారం కొనడం మంచిదేనా?
లక్షా యాభై వేలు దాటిన 10 గ్రాముల బంగారం!ఇప్పుడు బంగారం కొనడం మంచిదేనా?
Nandyala Crime News:నంద్యాలలో ఘోర ప్రమాదం- ట్రావెల్ బస్‌ టైరు పేలి అంటుకున్న మంటలు- ముగ్గురు మృతి
నంద్యాలలో ఘోర ప్రమాదం- ట్రావెల్ బస్‌ టైరు పేలి అంటుకున్న మంటలు- ముగ్గురు మృతి
Mana Shankara Vara Prasad Garu BO Day 10: బాక్సాఫీస్‌లో వరప్రసాద్ గారు కుమ్ముడు... పది రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ అదిరిందిగా
బాక్సాఫీస్‌లో వరప్రసాద్ గారు కుమ్ముడు... పది రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ అదిరిందిగా
Guntur Crime News: గుంటూరులో దారుణం! ప్రియుడి కోసం భర్తను చంపిన ఇల్లాలు, రాత్రంతా శవం పక్కన పోర్న్‌ వీడియోలు చూస్తూ కాలక్షేపం
గుంటూరులో దారుణం! ప్రియుడి కోసం భర్తను చంపిన ఇల్లాలు, రాత్రంతా శవం పక్కన పోర్న్‌ వీడియోలు చూస్తూ కాలక్షేపం
Embed widget