అన్వేషించండి

Horoscope 17th February 2024: ఈ రాశులవారికి ఇది రైజింగ్ టైమ్, ఫిబ్రవరి 17 రాశిఫలాలు

Horoscope 16 February 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

Horoscope Today 17 February 2024  - ఫిబ్రవరి 17 రాశిఫలాలు

మేష రాశి (Aries Horoscope Today) 

ఈ రోజు మీకు ఆర్థికపరంగా అనకూలమైనరోజే కానీ ఖర్చులు తగ్గించుకోవాలి.  అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు.  ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కుటుంబానికి సమయం కేటాయించడం ద్వారా సంతోషం పెరుగుతుంది. ఉద్యోగులు,వ్యాపారులకు మిశ్రమ సమయం. 

వృషభ రాశి (Taurus  Horoscope Today)

ఈ రోజు మీకు ఆర్థికంగా ఆహ్లాదకరమైన రోజు.పెట్టిన పెట్టుబడులు కలిసొస్తాయి.  భవిష్యత్ కోసం మీ నైపుణ్యాలను మరింత మెరుగుపర్చుకోవాలి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోండి.  మీరు ఎవరితో అర్ధవంతమైన సంబంధాలను ఏర్పరచుకోవాలనుకుంటున్నారనే దాని గురించి మీకు స్పష్టత వస్తుంది.  మీ ఖర్చులను పరిశీలించండి. 

Also Read: మీరు తెలివైన వారో కాదో ఇలా తెలిసిపోతుంది - చాణక్యనీతి !

మిథున రాశి (Gemini Horoscope Today) 
 
ఈరోజు మీకు సాధారణమైన రోజు.   పని పరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఓపికపట్టండి .. సమస్యలను పరిష్కరించడానికి సరైన నిర్ణయాలు తీసుకోండి. మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీకు విశ్రాంతి అవసరం.   ఈ రోజు మీరు మీ సంబంధాలలో సవాలుగా అనిపిస్తుంది. ప్రస్తుత భావోద్వేగాలు సంబంధాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో గమనించండి. మీ భావాలను వ్యక్తీకరించడానికి కొంత సమయం తీసుకోవాలి..మీ భాగస్వామి భావాలు జాగ్రత్తగా వినండి. 

కర్కాటక రాశి (Cancer Horoscope Today)  

ఈ రోజు మీకు  కుటుంబ పరంగా శుభప్రదంగా ఉంటుంది. మీ భాగస్వామితో ఆనందంగా గడిపే అవకాశం మీకు లభిస్తుంది.  కెరీర్ సంబంధిత విషయాలలో మంచి ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులు కొత్త అవకాశాలు పొందుతారు. మీపై మీరు నమ్మకంగా ఉండండి. మీ మనసు చెప్పింది వినండి. మీరు అనుకున్న పనులు పూర్తిచేస్తారు. కాస్త సహనంగా వ్యవహరించాలి. 

Also Read: మీరు పెళ్లిచేసుకునేముందు ఇవన్నీ ఆలోచించారా - పెళ్లి గురించి చాణక్యుడు చెప్పిన ఆసక్తికర విషయాలివే!

సింహ రాశి (Leo Horoscope Today)

ఈ రోజు మీకు కెరీర్ పరంగా అనుకూలమైన రోజు. ఉద్యోగ, వృత్తిపరమైన వృద్ధికి అవకాశం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి . పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు మంచి రోజు. మీ ఆలోచనా విధానం బావుంటుంది.  ఈ రోజు మీరు మీ కుటుంబానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వార్తలు అందుకోవచ్చు. నూతన ఆస్తిలో పెట్టుబడి పెట్టొద్దు.  

కన్యా రాశి  (Virgo Horoscope Today) 

ఈ రోజు మీకు ఆరోగ్య పరంగా శుభప్రదంగా ఉంటుంది.  మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అనుకున్న పనిని పూర్తి చేయడానికి మీ సామర్థ్యాలను ఉపయోగించాలి. పనిలో వేగాన్ని కొనసాగించండి.  ఈ రోజు మీరు ఖర్చు చేయడం కంటే ఎక్కువ పొదుపు చేయడంపై దృష్టి సారించాలి. నూతన పెట్టుబడులకు మంచి రోజు. తగిన విశ్రాంతి అవసరం. 

తులా రాశి (Libra Horoscope Today) 

ఈ రోజు మీకు వ్యక్తిగత , వృత్తిపరమైన అభివృద్ధికి అనుకూలమైన రోజు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందుతారు..ఉద్యోగులు కెరీర్లో ఉన్నత అవకాశం అందుకునే ఛాన్స్ ఉంది.  కాస్త ఓపికగా ఉండి సమస్యలను పరిష్కరించడానికి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన అలవాట్లపై మీ శక్తిని తిరిగి కేంద్రీకరించండి. ఒత్తిడి స్థాయిలను తగ్గించే  కార్యకలాపాల్లో పాల్గొనండి. అదృష్టం మీకు కలిసొస్తుంది. మీ లక్ష్యం విషయంలో పట్టుదలతో ఉంటే మీకు విజయం గ్యారెంటీ. మిమ్మల్ని మీరు నమ్మండి. 

వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 

ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.  ఓ  ప్రత్యేక వ్యక్తి ఈ రోజు మీ జీవితంలో ఉత్సాహాన్ని  నింపుతారు.  మీ భాగస్వామితో కొంత నాణ్యమైన సమయాన్ని స్పెండ్ చేస్తారు. మీ వృత్తిపరమైన జీవితానికి సంబంధించి పెద్ద మార్పులు జరగబోతున్నాయి. మీరు చేసిన కృషి , అంకితభావం చివరకు ఫలించి మంచి ఫలితం అందుకుంటారు. ఆర్థిక నష్టాలకు దూరంగా ఉండండి. 

Also Read: భర్త దగ్గర భార్య కామన్ గా దాచే 6 ముఖ్యమైన విషయాలు!

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 

ఈ రోజు ధనుస్సు రాశి వారికి  వ్యాపారంలో ఆర్థిక విజయం వచ్చే అవకాశం ఉంది.  మీ పెట్టుబడి ప్రణాళిక , ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.   పనిలో, సహోద్యోగుల నుంచి అభిప్రాయం తీసుకోవడం మంచిది.  మీ ఉత్పాదకత  పనిని మరింత మెరుగుపరచగల కొత్త మార్గాలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. వృ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు.  ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. డబ్బు ఆదా చేయడంపై దృష్టి పెట్టండి.  

మకర రాశి (Capricorn Horoscope Today) 

రోజు మకరరాశి వారి కుటుంబంలో ఆనందం ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల సహకారం మీరు ముందుకు సాగడానికి సహాయపడుతుంది. కొత్త ప్రాజెక్ట్ లేదా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తారు. మీ కృషి, అంకితభావం మిమ్మల్ని విజయపథంలో నడిపించగలవు. తీసుకున్న అప్పులు తిరిగి చెల్లిస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత బలహీనంగా ఉంటుంది. కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. అతి ఉత్సాహం నియంత్రించుకోవాలి.  ఈరోజు మీ ప్రియమైన వ్యక్తి మీ మాట వినడానికి బదులు తన మనసులో మాటను చెప్పడానికి ఇష్టపడతారు. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఉద్యోగస్తులు   కార్యాలయంలో   సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

Also Read: మీ జీవితంలో ఆ ఇద్దరి మీదా ఎప్పుడూ నోరు పారేసుకోవద్దు…ఎవరా ఇద్దరు....చాణక్యుడు ఎందుకలా చెప్పాడు…

కుంభ రాశి  (Aquarius Horoscope Today) 

కుంభరాశి వారికి ఈరోజు కెరీర్‌లో ముందుకు సాగే సమయం. మీరు మీ పనిలో కష్టపడి పని చేయాలి కొత్త అవకాశాలను దృష్టిలో ఉంచుకోవాలి. మీ సామర్థ్యాలను ప్రదర్శించడానికి మీకు అవకాశం లభిస్తుంది . ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి.  ప్రొఫెషనల్‌గా ఉండండి . మిమ్మల్ని మీరు విశ్వసించండి . రిస్క్ తీసుకోవడానికి భయపడొద్దు. ఎదురైన సవాళ్లను అధిగమించేందుకు సిద్ధంగా ఉండండి.  

మీన రాశి (Pisces Horoscope Today) 
 
ఈ రోజు మీనరాశి వారికి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. మీ కుటుంబం నుంచి మద్దతు పొందుతారు. ప్రేమను వ్యక్తం చేసేందుకు, మీ బంధాన్ని బలపర్చుకునేందుకు ఇదే మంచి సమయం. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. 

Also Read:  వైవాహిక జీవితం - లైంగిక సంబంధాలు.. చాణక్యుడు చెప్పిన ఆసక్తికర అంశాలు

గమనిక:  ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..
చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి ChatGPT ప్రిడిక్షన్ ఇదే..
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Manmohan Singh: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
TG TET 2024 Halltickets: తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP DesamPushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP DesamPir Panjal Rail Tunnel | ఇండియాలో లాంగెస్ట్ రైల్వే టన్నెల్ ఇదే | ABP Desamరాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్‌ ప్రారంభం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..
చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి ChatGPT ప్రిడిక్షన్ ఇదే..
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Manmohan Singh: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
TG TET 2024 Halltickets: తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
Osamu Suzuki : భారత్‌కు మారుతీ కారు పరిచయం చేసిన వ్యక్తి మృతి- సంతాపం తెలియజేసిన ప్రధాని
భారత్‌కు మారుతీ కారు పరిచయం చేసిన వ్యక్తి మృతి- సంతాపం తెలియజేసిన ప్రధాని
Rohit Sharma News: రోహిత్ కెప్టెన్సీపై మాజీల మండిపాటు - ఆ విషయంలో విఫలమయ్యాడని విమర్శలు, టెస్టు కెరీర్ ముగింపునకు వచ్చేసినట్లేనా?
రోహిత్ కెప్టెన్సీపై మాజీల మండిపాటు - ఆ విషయంలో విఫలమయ్యాడని విమర్శలు, టెస్టు కెరీర్ ముగింపునకు వచ్చేసినట్లేనా?
Charith Balappa Arrested: లైంగిక వేధింపులకు పాల్పడిన టీవీ నటుడు - అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో అరెస్ట్
లైంగిక వేధింపులకు పాల్పడిన టీవీ నటుడు - అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో అరెస్ట్
Embed widget