అన్వేషించండి

Chanakya Niti In Telugu: మీరు తెలివైన వారో కాదో ఇలా తెలిసిపోతుంది - చాణక్యనీతి !

అప్పట్లో చాణక్యుడు చెప్పిన సూత్రాలు ఈ జనరేషన్ కి చాలా ఉపయోగపడతాయి. ఓ వ్యక్తి జీవితంలో ఉన్నతంగా ఎదగాలి అంటే జ్ఞానంతో పాటూ తెలివి కూడా చాలా అవసరం . ఇలాంటి వారికి శత్రువులు ఉండరన్నది చాణక్యుడి బోధన.

Chanakya Niti In Telugu:  తత్వవేత్తగా, ఆర్థికవేత్తగా, ఆచార్యునిగా మన్ననలు అందుకున్న వ్యక్తి చాణక్యుడు. కౌటిల్యుడు రచించిన రాజనీతి గ్రంథం అర్థశాస్త్రంగా ప్రసిద్ధి చెందింది. గుప్తల కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంటారు. ఆ కాలానికి చెందిన చాణక్యుడు తన అసమాన ప్రతిభాపాటవాలతో గుప్త సామ్రాజ్యంలో సుస్థిర పాలనకు బీజం వేశాడు. తత్వవేత్తగా, ఆర్థికవేత్తగా, ఆచార్యునిగా మన్ననలు అందుకున్నాడు. ఈయన రచించిన రాజనీతి గ్రంథమైన అర్థశాస్త్రం ప్రస్తుత సమకాలీన రాజకీయాలకు అద్దం పడుతోంది. కేవలం రాజకీయ, ఆర్థిక విషయాలనే కాదు ఓ వ్యక్తి ఉన్నతమైన జీవితం గడిపేందుకు ఎలాంటి లక్షణాలుండాలో శిష్యులకు బోధించాడు. ఇందులో భాగంగా మీరు నిజంగా తెలివైనవారైతే మీకు శత్రువులే ఉండరన్నాడు చాణక్యుడు. 

  “నాస్తి బుద్ధిమతాం శత్రుః”
 అంటే  తెలివైన వ్యక్తికి శత్రువులు లేరని అర్థం 

శత్రువులు మిత్రులుగా మార్చే లక్షణం

ఓ వ్యక్తి ప్రవర్తనే తెలివైనవాడా కాదా అనే అంశాన్ని నిర్ధరిస్తుంది. ఎందుకంటే తెలివైన వ్యక్తికి శత్రువులను కూడా మిత్రులుగా చేసుకునే విశిష్ట లక్షణం ఉంటుంది. 

Also Read: మీరు పెళ్లిచేసుకునేముందు ఇవన్నీ ఆలోచించారా - పెళ్లి గురించి చాణక్యుడు చెప్పిన ఆసక్తికర విషయాలివే!

జ్ఞానం పుస్తకాల్లో బంధీ అయితే ఏ లాభం

వ్యక్తి విద్యా పరమైన విజ్ఞానంతో పాటు ఆచరణాత్మక జ్ఞానానికి కూడా కౌటిల్యుడు అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. ఎవరి కంటే ఎవరూ గొప్పవారు కాదు. ఇతరుల చేతిలో ధనం ఉంటే మనకు ఉపయోగం ఎలా ఉండదో, అలాగే విజ్ఞానం కూడా పుస్తకాల్లో బంధీ అయిపోతే ఎవరికీ మంచి జరగదు. తెలివైనవాడు తన జ్ఞానాన్ని పంచుకుంటాడు..జ్ఞానం ఉన్నా దాని వల్ల ఎవరికీ ఎలాంటి ఉపయోగం లేకపోతే కను  తెలివైన వ్యక్తి కాదు

అనవసర విషయాలు వదిలేయాలి

సాధారణ మనిషికి జీవితంలో కొన్ని విషయాలపై మాత్రమే నియంత్రణ ఉంటుంది. చాలా విషయాల్లో ఇతరుల సహాయం లేనిది ముందుకు సాగలేడు. అదే తెలివైవాడు కొన్నిసార్లు అనవసరమైన విషయాలను పక్కనబెట్టి ముఖ్యమైన లక్ష్యాలను చేరుకోడానికి ఎలాంటి భేషజాలు లేకుండా పనిచేస్తాడు. పెట్టుకున్న టార్గెట్ చేరుకోవడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాడు.

Also Read: భర్త దగ్గర భార్య కామన్ గా దాచే 6 ముఖ్యమైన విషయాలు!

అయోమయం వద్దు

వ్యక్తులు కొన్ని సందర్భాల్లో తమ అహం, శౌర్యం, ఆత్మగౌరవం, అందం పట్ల ఆకర్షణతో ఆయోమయానికి గురవుతారు. ఇలాంటి సందర్భంలో తనకు అవసరమైంది ఏంటో అవగాహన చేసుకుని సమస్య నుంచి బయటపడటానికి తెలివైన వ్యక్తి ప్రయత్నిస్తాడు. 

అహాన్ని వీడాల్సిందే

సమస్యలు ఎదురైనప్పుడు అహాన్ని పక్కనబెట్టి వాటిని పరిష్కరించుకోవాలి. ఏదైనా పని చివరి దశలో ఉన్నప్పుడు ప్రతి అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ పని వల్ల ముప్పు తొలగిపోయినా అది ఎందుకు ఎదురయిందో తెలుసుకోవాలి. అనుచిత వ్యాఖ్యలు, అసందర్భ ప్రేలాపనతో విలువైన సమయాన్ని వృథా చేయరాదు.

Also Read: మీ జీవితంలో ఆ ఇద్దరి మీదా ఎప్పుడూ నోరు పారేసుకోవద్దు…ఎవరా ఇద్దరు....చాణక్యుడు ఎందుకలా చెప్పాడు…

ప్రతిష్ట అంటే అహానికి మరో పేరు

ప్రతి అంశాన్ని ప్రతిష్ట‌కు ముడిపెట్టి కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటారు కొందరు. అసలు  ప్రతిష్ట అంటే ఏంటో తెలుసుకోవాలి. అహానికి మరో రూపమే ప్రతిష్ట కాబట్టి  దీన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటాడు చాణక్యుడు. దీని వల్ల ఒరిగేదేం లేదు..పైగా అహం అన్నం పెట్టదు కదా అంటాడు చాణక్యుడు.

కాలయాపన వద్దు

అనవసర విషయాలతో కాలయాపన చేసి టన్నుల కొద్దీ కాలం, శక్తిని వృథా చేసుకోకుండా అద్భుతాలు సృష్టించ‌డానికి ప్రయత్నించండి. తెలివైన వ్యక్తి ఇదే చేస్తాడు.... పెద్ద లక్ష్యాలు ఏర్పరచుకుంటాడు వాటిపైనే మనసు కేంద్రీకరించి పక్కన జరిగే అనవసరమైన విషయాల గురించి పట్టించుకోడు. 

Also Read:  వైవాహిక జీవితం - లైంగిక సంబంధాలు.. చాణక్యుడు చెప్పిన ఆసక్తికర అంశాలు

నీ శక్తి నువ్వు తెలుసుకో

నీ శక్తి ఏంటో నువ్వు తెలుసుకున్న రోజు ఎంత పెద్ద సమస్య అయినా నీముందు చిన్నబోతుంది...ఆ శక్తిని గుర్తించడం తెలివైనవారి లక్షణం. ఇలాంటి వారికి ఏ సమస్యా పెద్దగా అనిపించదు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Embed widget