Srikakulam Crime News: శ్రీకాకుళంలో క్రైమ్‌థ్రిల్లర్- తాళం వేసిన ఇంట్లో మహిళను హత్య చేసిందెవరు? పోలీసుల సీక్రెట్ విచారణ
Srikakulam Crime News: శ్రీకాకుళంలో తాళం వేసిన ఇంట్లో మహిళ హత్య కలకలం రేపింది. ఘటన జరిగి ఐదు రోజులు దాటినా ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదు. అనుమానితుడిని పోలీసులు ఇంకా విచారిస్తున్నారు.

Srikakulam News: శ్రీకాకుళంలో మహిళ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్టు సమాచారం. అసలు ఆ మహిళ ఆ రూమ్‌కు ఎందుకు వెళ్లి, అక్కడ ఏం జరిగిందనే కోణంలో ఎంక్వయిరీ సాగుతోంది. ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదులో బంగారం కనిపించడం లేదని చెప్పడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది.
స్థానిక న్యూ కాలనీలో ఓ ఇంట్లో వివాహిత పూజారి కళావతి(48) శవమై కనిపించడం సంచలనం సృష్టించింది. పొందూరు మండలం మొదలవలసకు చెందిన కళావతి టైలర్ వద్దకు వెళ్లి వస్తాని చెప్పి శనివారం ఇంటి నుంచి బయల్దేరింది. శ్రీకాకుళం వచ్చి ఆమె తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో ఇద్దరు కుమారులు, భర్త ఆమెకు ఫోన్ చేశారు. అయినా కళావతి స్పందించ లేదు.సన్నిహితులతో కలిసి నగరమంతా వెతికారు.
ఇంతలో కళావతి నడిపే టూ వీలర్ న్యూ కాలనీలో కనిపించిందని ఎవరో చెప్పారు. అక్కడికి వెళ్లి చూసిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ఆమె తన స్టూటీని ఓ ఇంటికి సమీపంలో ఆపేసి నడుచుకుంటూ వీధిలోకి వెళ్లారు.
అలా వెళ్లిన కళావతి ఓ రూంలోకి వెళ్లినట్టు గుర్తించారు. అక్కడికి వెళ్లి చూస్తే ఆ ఇంటికి తాళం వేసింది. వెంటనే స్థానికుల సహాయంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. ఇళ్లంతా వెతికినా ఏం కనిపించలేదు. చివరకు బాత్‌రూమ్‌లో చూస్తే కళావతి చనిపోయి పడి ఉంది. ఆ సీన్ చూసిన అంతా షాక్ అయ్యారు.
హత్య జరిగినట్టు నిర్దారించిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ రూమ్‌లో ఎవరు ఉన్నారు. ఎప్పటి నుంచి ఉన్నారనే కోణంలో విచారణ స్టార్ట్ చేశారు. శనివారం మధ్యాహ్నం 2.45 ప్రాంతంలో న్యూ కాలనీలోని ఆ ఇంటికి కళావతి వెళ్లారు. అందులో జనరేటర్ల మెకానిక్ శరత్‌కుమార్ నివసిస్తున్నట్టు తేల్చారు.
ఆ ఇంట్లో ఏం జరిగిందో తెలియదు కానీ కళావతి గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. నిందితుడిగా భావిస్తున్న శరత్‌కుమార్ గంజాయికి అలవాటు పడ్డాడని, ఆ మత్తులోనే హత్యచేసి ఉంటాడన్న ప్రచారం సాగుతోంది. ఆమె ఒంటిపై ఉండే 20 తులాల బంగారం తస్కరించినట్లు చెబుతున్నారు.
Also Read: సైకోలా మారిపోయాడు..భార్యను కిరాతకంగా చంపేశాడు
శరత్ రూమ్లో శవం కనిపిండంతో కొందరు ఆయనకు ఫోన్ చేశారు. తాను బయట ఊరిలో ఉన్నానని తరువాత వస్తానని చెప్పినట్లు తెలిసింది. పోలీసులు మాత్రం సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా వెళ్లి శరత్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నారు. కళావతి బంగారం కోసం హత్య చేశాడా, లేకా గంజాయి మత్తులో జరిగిందా అనేది తేలాల్సి ఉంది.
ఈ హత్య కేసులో శరత్‌తోపాటు ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శరత్ వ్యవహార శైలి బాగోలేకపోవడం, వ్యసనాలకు బానిసవడంతో మూడేళ్ల క్రితమే ఇంటి నుంచి ఫ్యామిలీ మెంబర్స్ బయటకు పంపించేశారట. న్యూ కాలనీలో నివాసం ఉంటూ జనరేటర్లు బాగుచేస్తూ జీవిస్తున్నాడు. డీసీసీబీ కాలనీలో కళావతితో పరిచయం ఏర్పడినట్టు ప్రచారం జరుగుతోంది. కరోనా తరువాత కళావతి ఫ్యామిలీ మొదలవలస వెళ్లిపోయింది. పాత పరిచయంతోనే శరత్ పిలిచిన వెంటే వచ్చి ఉంటారని చెబుతున్నారు.
హత్య జరిగిందని సమాచారం అర్ధరాత్రి రావడంతో శ్రీకాకుళం ఎస్పీ రాత్రి ఒంటిగంట సమయంలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వెంటనే చుట్టుపక్కల వాళ్ళని ఆరా తీయడం మొదలుపెట్టి నిందితుని అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి సమాచారాన్ని పోలీసులు బయటికి రానివ్వడం లేదు. పూర్తి వివరాలు తెలిసిన తర్వాతే చెబుతామంటున్నారు. ఈ ఘటనతో శ్రీకాకుళం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
Also Read: పూత బాగుంది- కోత వరకు వస్తుందా? ఉద్దానం రైతులను భయపెడుతున్న గత అనుభవాలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

