Rajiv Yuva Vikasam Scheme: రాజీవ్ యువ వికాసం స్కీమ్, యువతకు రూ.3 లక్షల వరకు సాయం- పూర్తి వివరాలు ఇలా
Rajiv Yuva Vikasam Scheme Details in Telugu: యువతలో ఆర్థిక స్వావలంబన కోసం తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా 5 లక్షల మంది యువతకు రుణాలు మంజూరు చేయనున్నారు.

Online Applications for Rajiv Yuva Vikasam Scheme | హైదరాబాద్: యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం తీసుకొచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద రూ.3 లక్షల వరకు లోన్ పొందడానికి ప్రభుత్వం నేటి (మార్చి 17) నుంచి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులను స్వీకరిస్తుంది.
సొంతంగా తమ కాళ్లపై తాము నిలబడి వ్యాపారం చేయాలనుకుంటున్న వారి కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ స్కీమ్ తీసుకొచ్చింది. ప్రత్యేక వెబ్‌సైట్ సైతం లాంచ్ చేశారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లతో కలిసి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభిస్తారు. సోమవారం నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. అధికారిక వెబ్‌సైట్ https://tgobmmsnew.cgg.gov.in/ లో దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తిన వారు జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారులు, బీసీ కార్పొరేషన్ అధికారులు, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ అధికారులను సంప్రదించాలి. అప్లికేషన్లను ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు పరిశీలిస్తారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2న రుణాల మంజూరు, వీలైతే ఖాతాల్లో లోన్ నగదును ప్రభుత్వం జమ చేయనుందని సమాచారం. కేవలం ఉద్యోగాలే జీవిత లక్ష్యం కాదని, సొంతంగా వ్యాపారం చేసి అభివృద్ధి పథంలో నడిచే దిశగా యోచించాలని ప్రభుత్వం సూచించింది. రాజీవ్ యువ వికాసం విధివిధానాలపై అధికారులకు మంత్రులు సూచనలు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి ఉపాధి
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల యువత రాజీవ్ యువ వికాసం నుంచి లబ్ధి పొందవచ్చు. 5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఆర్థిక తోడ్పాడు అందించనుంది. ఇందుకోసం ప్రభుత్వం దాదాపు రూ.6 వేల కోట్ల నిధులు కేటాయించాలని భావిస్తోంది. తొలి ఏడాది లక్షా 50 వేల మంది యువతకు లబ్ధి చేకూరనుందని సమాచారం. ఎస్సీ ఆర్థిక సహకార సంస్థ రూ.1200 కోట్లు, ఎస్టీ ఆర్థిక సహకార సంస్థ రూ.360 కోట్లు, తెలంగాణ బడ్జెట్ కేటాయించిన రూ.2000 కోట్లు దీని కోసం ఖర్చు చేయనున్నారు.
3 క్యాటగిరీలుగా లబ్ధిదారుల విభజన..
రాజీవ్ యువ వికాసం పథకం కింద యువతకు ప్రయోజనం చేకూర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారులను మూడు క్యాటగిరీలుగా విభజించింది.
Category 1: క్యాటగిరీ 1 కింద రూ.1 లక్ష వరకు లోన్ లభిస్తుంది. ఈ మొత్తంలో 80 శాతం సబ్సిడీ కాగా, మిగతా 20 శాతం నగదును లబ్ధిదారులు సమకూర్చుకోవాలి. లేక బ్యాంకుల ద్వారా అరెంజ్ చేసుకోవాలి.
Category 2: క్యాటగిరీ 2 కింద 1 లక్ష రూపాయల నుంచి రూ.2 లక్షల వరకు లోన్ అందిస్తారు. ఇందులో ప్రభుత్వం 70 శాతం వరకు సబ్సిడీ వస్తుంది. మిగతా 30 శాతం మొత్తాన్ని లబ్ధిదారులు సమకూర్చుకోవాలి.
Category 3: క్యాటగిరీ 3 అధిక రుణ సహాయం అందిస్తారు. ఈ క్యాటగిరీలో 2 లక్షల రూపాయల నుంచి రూ.3 లక్షల వరకు లోన్ ఇవ్వనుండగా.. అందులో 60 శాతం సబ్సిడీ లభిస్తుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

