Sourav Ganguly: పోలీస్ ఆఫీసర్‌గా సౌరభ్ గంగూలీ - అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Khakee 2 Web Series: భారత మాజీ క్రికెటర్ సౌరభ గంగూలీ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారనే వార్తలపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో ఆయన ప్రచారంలో మాత్రమే భాగమయ్యారని అర్థమవుతోంది.

Sourav Ganguly Being A Part Of Khakee 2 Web Series Ad: భారత మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ (Sourav Ganguly) నటుడిగా తెరంగేట్రం చేయనున్నారని.. ఓ వెబ్ సిరీస్‌లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారనే వార్తలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఫోటోలు సైతం గత కొద్ది రోజులుగా వైరల్ అయ్యాయి. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు.
ఈ ట్విస్ట్ ఊహించలేదుగా..
గంగూలీ.. 'ఖాకీ 2: ది బెంగాల్ చాప్టర్'లో (Khakee 2: The Bengal Chapter) పోలీస్ ఆఫీసర్‌గా అతిథి పాత్రలో కనిపిస్తారనే ప్రచారం సాగింది. అందుకు తగ్గట్టుగానే ఫోటోలు సైతం వైరల్‌గా మారాయి. ఈ నెల 20 నుంచి ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో (Netflix) స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా సదరు సంస్థ ఓ వీడియోను రిలీజ్ చేసింది. అందులో గంగూలీ ఖాకీ దుస్తుల్లో కనిపించగా.. హీరో చేయాల్సిన పనులను దర్శకుడు వివరిస్తాడు.
The Bengal Tiger meets the Bengal Chapter 👀🐯
— Netflix India (@NetflixIndia) March 17, 2025
Watch Khakee: The Bengal Chapter out 20 March, only on Netflix.#KhakeeTheBengalChapterOnNetflix pic.twitter.com/wawwa5oq58
దీంతో ఇవన్నీ చేయడం తన వల్ల కాదని గంగూలీ అనగా.. అయితే, మీరు మార్కెటింగ్ చేయండంటూ డైరెక్టర్ అనడంతో గంగూలీ ఓకే అంటారు. దీని ప్రకారం ఈ సిరీస్ ప్రచారంలో మాత్రమే గంగూలీ భాగమయ్యారని స్పష్టమవుతోంది. అందులో నటించలేదని తెలుస్తోంది. ఈ యాడ్‌ను క్రికెట్ ప్రియులకు సర్ ప్రైజ్‌గా భావిస్తున్నారు. మరోవైపు, సౌరభ్ గంగూలీ బయోపిక్ త్వరలోనే తెరపైకి రానుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో రాజ్ కుమార్ రావు ఇందులో గంగూలీగా కనిపించనున్నారు.
Also Read: 'ఎవరూ అద్భుతాల కోసం ఎదురుచూడొద్దు' - బ్రేకప్ ప్రచారం వేళ మిల్కీ బ్యూటీ తమన్నా ఇంట్రెస్టింగ్ పోస్ట్
బిహార్ చాప్టర్‌కు సీక్వెల్‌గా..
'ఖాకీ: ది బిహార్ చాప్టర్' 2022, నవంబర్ 25న నెట్ ఫ్లిక్స్‌లో విడుదలై ఓటీటీ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రముఖ ఐపీఎస్ అధికారి అమిత్ లోథా జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది. ఆయన రచించిన 'Bihar Diaries' బుక్ ఆధారంగా సిరీస్ తీశారు. దీనికి కొనసాగింపుగా సీజన్ 2 రూపొందించారు. నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో కరణ్ టక్కర్, అవినాష్ తివారి, అభిమన్యుసింగ్, నీరజ్ కశ్యప్, జతిన్ శరణ్, రవి కిషన్, అశుతోష్ రాణా, నికితా దత్త, ఆకాంక్ష సింగ్, ఐశ్వర్య సుష్మిత తదితరులు కీలక పాత్రలు పోషించారు.
కొత్త సిరీస్‌లో కోల్‌కతాలోని ఓ డాన్ ఆటను కట్టించే పోలీస్ ఆఫీసర్ అర్జున్ మైత్రా కథను చూపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో జీత్ మద్నాని, ప్రోసేన్ జీత్ ఛటర్జీ, శాశ్వతా ఛటర్జీ వంటి వాళ్లు నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి సైతం ఈ సిరీస్‌లో నటిస్తున్నారు. ఈ నెల 20న సిరీస్ అందుబాటులోకి రానుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

