అన్వేషించండి

Morning Top News: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్, దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ సంబరాలు వంటి మార్నింగ్ న్యూస్

Top 10 Headlines Today: దేశ వ్యాప్తంగా దిగొచ్చిన ఎల్పీజీ సిలిండర్ ధరలు, మైనర్‌పై అత్యాచారం కేసులో కేరళ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు సంచలన తీర్పు వంటి మార్నింగ్ న్యూస్

Top 10 Headlines Today:  

మద్యం షాపు యజమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నెరవేర్చాలని నిర్ణయం తీసుకుంది.  మద్యం షాపు యజమానులకు మార్జిన్ సైతం పెంచారు. తాజాగా జరిపిన ఏపీ ఎక్సైజ్ పాలసీపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయించాలన్నారు. దీనిపై వారం రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చి, 340 షాపులు కేటాయించనున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

9 నెలల చిన్నారికి యాసిడ్ తాగించిన తండ్రి 

 భార్యపై అనుమానం పెనుభూతమైంది. ఆ చిన్నారి తనకు పుట్టలేదనే అనుమానంతో ఆ వ్యక్తి ఉన్మాదిలా మారిపోయాడు. పాప అనే కనికరం లేకుండా 9 నెలల చిన్నారికి యాసిడ్ తాగించేశాడు. తీవ్రమైన నొప్పితే విలవిల్లాడిన చిన్నారిని తల్లి స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించింది. కర్కశ తండ్రిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

కొడాలి నాని ముఖ్య అనుచరుడి అరెస్ట్ 

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక కనిపించకుండా పోయిన కొడాలి నాని ముఖ్య అనుచరుడు కాళీని పోలీసులు అస్సాంలో అరెస్టు చేశారు. ఎన్నికలకు ముందు గుడివాడ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు చెందిన వ్యాపార సంస్థపై పెట్రోల్ బాంబులతో దాడి జరిగింది. ఈ కేసులో మెరుగుమాల కాళీ నిందితుడిగా ఉన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

రత్నాచల్ ఎక్స్ ప్రెస్ టైమింగ్ మారింది

నూతన సంవత్సర వేళ దక్షిణ మధ్య రైల్వే  కీలక ప్రకటన చేసింది. పలు రైళ్ల ప్రయాణ వేళలను మార్చినట్లు అధికారులు తెలిపారు. జనవరి 1 నుంచి కొత్త టైమింగ్స్ అమల్లోకి వస్తాయని చెప్పారు. ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందించడం సహా రైల్వే సర్వీసులను మరింత మెరుగుపరిచేందుకు ఈ మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ విజయవాడ స్టేషన్‌లో ఇక నుంచి 15 నిమిషాలు ముందుగానే బయలుదేరుతుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

బాణసంచాతో పండగ చేసుకున్నతెలంగాణ అగ్నిమాపక శాఖ

2023తో పోలిస్తే రాష్ట్రంలో అగ్ని ప్రమాదాల సంఖ్య తగ్గిందని తెలంగాణ అగ్నిమాపకశాఖ చెబుతోంది. రెస్క్యూ ఆపరేషన్లు కూడా పటిష్టంగా చేపట్టామంటున్నారు అధికారులు. 2023 సంవత్సరంలో మొత్తం 7400 ఫైర్ కాల్స్ వస్తే...  ఏడాది 7383కు తగ్గాయి. ఇందులో చిన్నవి 7093, మధ్యస్థంగా ఉన్నవి 180, సీరియస్ 87, మేజర్ 24 కాల్స్ ఉన్నట్టు పేర్కొన్నారు. గతేడాదితో పోల్చినప్పుడు మీడియం ప్రమాదాల కాల్స్  5.9శాతం పెరిగాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్

 తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్ అయింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ తీర్పును రిజర్వ్ చేశారు. తీర్పు వెల్లడించే వరకూ కేటీఆర్ ను అరెస్టు చేయవద్దని తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంపై ముఖ్యమైన అప్‌డేట్

హైదరాబాద్ ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంలో నిర్మించే 4 వరుసల రహదారికి 11 జాతీయ, రాష్ట్ర రహదారులు ఇంటర్ లింక్ కానున్నాయి. గ్రీన్‌ఫీల్డ్‌ రీజినల్‌ ఎక్స్‌ప్రెస్‌వే  గా వ్యవహరించే హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా ఉండే మార్గాలతో సిటీలోకే కాదు, సిటీ శివారులోకి సైతం ఎంటర్ అవకాకుండానే నేరుగా ఇతర రాష్ట్రాలకు ప్రయాణం చేయవచ్చు అని అధికారులు చెబుతున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

దేశ వ్యాప్తంగా దిగొచ్చిన ఎల్పీజీ సిలిండర్ ధరలు

ఐదు నెలలపాటు వరుసగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర నూతన సంవత్సరం సందర్భంగా దిగొచ్చింది. చమురు మార్కెటింగ్ సంస్థలు జనవరి 1, 2025న కమర్షియల్ LPG సిలిండర్ల ధరను తగ్గించాయి. ఢిల్లీలో నేడు 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ. 1,804కి పడిపోయింది. గతంలో రూ. 1,818.5 ఉన్న సిలిండర్ ధర రూ. 14.5 తగ్గింది. దాంతో పాటు జెట్ ఇంధనం లేక ATF ధరలు సైతం నూతన సంవత్సరం రోజు బుధవారం 1.54 శాతం దిగి రావడం విశేషం. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

మైనర్‌పై అత్యాచారం కేసులో కేరళ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు సంచలన తీర్పు

 బాలికపై లైంగిక దాడికి పాల్పడిన టీచర్‌కు 111 ఏళ్ల కఠిన కారాగార జైలుశిక్ష విధించింది కోర్టు. కేరళలోని ఫాస్ట్‌-ట్రాక్‌ కోర్టు మైనర్ బాలికపై ఓ అత్యాచారం కేసులో ఈ కీలక తీర్పు వెలువరించింది. దాంతోపాటు నిందితుడికి రూ.1.05 లక్షల జరిమానా సైతం విధించింది. బాలికపై తన భర్త అత్యాచారం చేశాడని తెలియడంతో అవమాన భారంతో నిందితుడి భార్య ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

మహా కుంభమేళాకి భారీ ఏర్పాట్లు

 జనవరి 13 భోగి రోజు నుంచి 45 రోజుల పాటు సాగనున్న మహా కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ సిద్ధమవుతోంది. భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. భక్తుల అవసరాలు, భద్రతను దృష్టిలో పెట్టుకుని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Posani Bail: సీఐడీ కేసులోనూ పోసానికి బెయిల్ - ఈ సారైనా బయటకు వస్తారా?
సీఐడీ కేసులోనూ పోసానికి బెయిల్ - ఈ సారైనా బయటకు వస్తారా?
CM Chandrababu: తిరుమల ఆలయంలో హిందువులు మాత్రమే సేవలు అందించాలి, అన్య మతస్తులకు నో ఛాన్స్: చంద్రబాబు
తిరుమల ఆలయంలో హిందువులు మాత్రమే సేవలు అందించాలి, అన్య మతస్తులకు నో ఛాన్స్: చంద్రబాబు
IPL 2025 Fand Park: ఐపీఎల్‌ 2025 సీజన్ కోసం తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన ఫ్యాన్ పార్క్‌లు ఇవే
ఐపీఎల్‌ 2025 సీజన్ కోసం తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన ఫ్యాన్ పార్క్‌లు ఇవే
Harish Rao on Fire: నాలుగున్నర లక్షలు కాదు కదా... నాలుగు ఇళ్లు కూడా కట్టలేదు. భట్టన్నా.. మధిరలో ఒక్క ఇళ్లైనా కట్టిన్రా..?
నాలుగున్నర లక్షలు కాదు కదా... నాలుగు ఇళ్లు కూడా కట్టలేదు. భట్టన్నా.. మధిరలో ఒక్క ఇళ్లైనా కట్టిన్రా..?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sunita Williams Return to Earth | సునీత సాహసంపై Cousin Dinesh Rawal మాటల్లో | ABP DesamSSMB29 Location | ఒడిశా అడవుల్లో జక్కన్న | ABP DesamBRS MLAs Supreme Court Affidavit | వేటు పడకుండా..10మంది BRS ఎమ్మెల్యేల రహస్య వ్యూహం..! | ABPNara Lokesh Holds Jr NTR Flexi | లోకేశ్ చర్యల వెనుక రీజన్ ఇదేనా.! | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Posani Bail: సీఐడీ కేసులోనూ పోసానికి బెయిల్ - ఈ సారైనా బయటకు వస్తారా?
సీఐడీ కేసులోనూ పోసానికి బెయిల్ - ఈ సారైనా బయటకు వస్తారా?
CM Chandrababu: తిరుమల ఆలయంలో హిందువులు మాత్రమే సేవలు అందించాలి, అన్య మతస్తులకు నో ఛాన్స్: చంద్రబాబు
తిరుమల ఆలయంలో హిందువులు మాత్రమే సేవలు అందించాలి, అన్య మతస్తులకు నో ఛాన్స్: చంద్రబాబు
IPL 2025 Fand Park: ఐపీఎల్‌ 2025 సీజన్ కోసం తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన ఫ్యాన్ పార్క్‌లు ఇవే
ఐపీఎల్‌ 2025 సీజన్ కోసం తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన ఫ్యాన్ పార్క్‌లు ఇవే
Harish Rao on Fire: నాలుగున్నర లక్షలు కాదు కదా... నాలుగు ఇళ్లు కూడా కట్టలేదు. భట్టన్నా.. మధిరలో ఒక్క ఇళ్లైనా కట్టిన్రా..?
నాలుగున్నర లక్షలు కాదు కదా... నాలుగు ఇళ్లు కూడా కట్టలేదు. భట్టన్నా.. మధిరలో ఒక్క ఇళ్లైనా కట్టిన్రా..?
10th Examinations 2025: తెలుగు పరీక్ష కోసం వెళ్తే హిందీ ప్రశ్నపత్రం ఇచ్చారు- మంచిర్యాల జిల్లాలో షాక్ తిన్న విద్యార్థులు
తెలుగు పరీక్ష కోసం వెళ్తే హిందీ ప్రశ్నపత్రం ఇచ్చారు- మంచిర్యాల జిల్లాలో షాక్ తిన్న విద్యార్థులు
Karnataka Honey Trap Politics: కర్ణాటక రాజకీయ నేతలకు హనీ ట్రాప్ భయం - అంత ఈజీగా పడిపోతారా- అసలేం జరుగుతోంది ?
కర్ణాటక రాజకీయ నేతలకు హనీ ట్రాప్ భయం - అంత ఈజీగా పడిపోతారా- అసలేం జరుగుతోంది ?
Dhanashree Verma: క్రికెటర్ చాహల్‌తో విడాకులు - గృహహింసపై ధనశ్రీ వర్మ కొత్త పాట.. యూట్యూబ్‌లో ట్రెండింగ్
క్రికెటర్ చాహల్‌తో విడాకులు - గృహహింసపై ధనశ్రీ వర్మ కొత్త పాట.. యూట్యూబ్‌లో ట్రెండింగ్
Delhi High Court Judge Issue: ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు - రాజ్యసభలోనూ చర్చ - విచారణ కమిటీ నియమించిన సీజేఐ
ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు - రాజ్యసభలోనూ చర్చ - విచారణ కమిటీ నియమించిన సీజేఐ
Embed widget