అన్వేషించండి

SCR: 'రత్నాచల్' ఎక్స్ ప్రెస్ టైమింగ్ మారింది తెలుసా! - జనవరి 1 నుంచి ఈ రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు, ద.మ రైల్వే కీలక ప్రకటన

AP News: ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు జనవరి 1వ తేదీ నుంచి పలు రైళ్ల టైమింగ్స్‌ను అధికారులు మార్చారు. విజయవాడ నుంచి విశాఖ వెళ్లే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను రీషెడ్యూల్ చేశారు.

SCR Rescheduled Trains Timings: నూతన సంవత్సర వేళ దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) కీలక ప్రకటన చేసింది. పలు రైళ్ల ప్రయాణ వేళలను మార్చినట్లు అధికారులు తెలిపారు. జనవరి 1 (బుధవారం) నుంచి కొత్త టైమింగ్స్ అమల్లోకి వస్తాయని చెప్పారు. ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందించడం సహా రైల్వే సర్వీసులను మరింత మెరుగుపరిచేందుకు ఈ మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ (Ratnachal Express) విజయవాడ స్టేషన్‌లో ఇక నుంచి 15 నిమిషాలు ముందుగానే బయలుదేరుతుంది. పాత షెడ్యూల్ ప్రకారం ఈ రైలు ఉదయం 6:15 గంటలకు బయలుదేరుతుండగా.. ఇకపై మారిన షెడ్యూల్ ప్రకారం ఉదయం 6 గంటలకే విజయవాడ నుంచి బయలుదేరుతుంది. నిత్యం విజయవాడ నుంచి విశాఖ వెళ్లే ప్రయాణికులు ఈ రైలును ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని అధికారులు సూచించారు.

ఎంఎంటీఎస్ రైళ్లలోనూ మార్పులు

అలాగే, జనవరి 1వ తేదీ నుంచి ఎంఎంటీఎస్ రైళ్ల ప్రయాణ వేళల్లోనూ దక్షిణ మధ్య రైల్వే మార్పులు చేసింది. నగర వ్యాప్తంగా 88 ఎంఎంటీఎస్ సర్వీసులు ప్రయాణికులకు సేవలందిస్తుండగా.. ప్రయాణికుల సౌకర్యార్థం, వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను అనుసంధానం చేసేందుకు వీలుగా ఈ మార్పులు చేసినట్లు ద.మ రైల్వే తెలిపింది.

ఈ ప్రత్యేక రైళ్లు పొడిగింపు

మరోవైపు, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను పొడిగించింది. జనవరి 7వ తేదీ నుంచి మార్చి 25 వరకూ షోలాపూర్ - ముంబయి (రైలు నెం. 01435) వరకు ప్రతి మంగళవారం రైలును ద.మ రైల్వే పొడిగించింది. జనవరి 1 నుంచి మార్చి 26 వరకూ ఎల్‌టీటీ ముంబయి - షోలాపూర్ (రైలు నెం. 01436) వరకు ప్రతి బుధవారం అందుబాటులో ఉండనుంది. జనవరి 2 నుంచి మార్చి 27 వరకూ ప్రతి గురువారం షోలాపూర్ - తిరుపతి (రైలు నెం. 01437), జనవరి 3 నుంచి మార్చి 28 వరకు తిరుపతి - షోలాపూర్ (రైలు నెం. 01438) ప్రతి శుక్రవారం అందుబాటులో ఉండనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Also Read: Kodali Nani aide arrested: అస్సాం పారిపోయిన కొడాలి నాని రైట్ హ్యాండ్ - పట్టుకొచ్చిన పోలీసులు !

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Bopparaju Venkateswarlu: ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఉద్యోగుల అల్టిమేటం! సెప్టెంబర్ రెండో వారం నుంచి వర్క్‌ టు రూల్ అమలు!
ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఉద్యోగుల అల్టిమేటం! సెప్టెంబర్ రెండో వారం నుంచి వర్క్‌ టు రూల్ అమలు!
Chandra Babu On YS Jagan: కోర్టుల వెనుక దాక్కుంటున్న జగన్! ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!
కోర్టుల వెనుక దాక్కుంటున్న జగన్! ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!
NTA New Director: NTAలో కీలక మార్పులు! కొత్త డైరెక్టర్లలో ఒకరు ఏపీ ఐఏఎస్‌ ప్రసన్న వెంకటేష్!
NTAలో కీలక మార్పులు! కొత్త డైరెక్టర్లలో ఒకరు ఏపీ ఐఏఎస్‌ ప్రసన్న వెంకటేష్!
Vizag Google Data Center: వైజాగ్‌లో ఏఐ డాటా సెంటర్‌ 2028 నాటికి ప్రారంభం! నీరు, విద్యుత్ విషయంలో క్లారిటీ వచ్చేసినట్టే! భారత్‌లో గూగుల్‌ విస్తరణ ప్లాన్ ఇదే!
వైజాగ్‌లో ఏఐ డాటా సెంటర్‌ 2028 నాటికి ప్రారంభం! నీరు, విద్యుత్ విషయంలో క్లారిటీ వచ్చేసినట్టే! భారత్‌లో గూగుల్‌ విస్తరణ ప్లాన్ ఇదే! 

వీడియోలు

Allu Arjun Graces Forbes India 2026 Cover | ఫోర్బ్స్ ఇండియా కవర్‌పై అల్లు అర్జున్
IND vs SL 2nd Test | కొలంబో టెస్ట్‌లో శ్రీలంక డ్రా
Dhoni CSK 25% Share Controversy | ధోనీ 25% సీఎస్‌కే వాటా? ఆకాష్ చోప్రా క్లారిటీ
CM Revanth Inspects Mir Alam Tank Bridge | క్రేన్ ఎక్కి బ్రిడ్జి పనులను పరిశీలించిన రేవంత్
Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bopparaju Venkateswarlu: ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఉద్యోగుల అల్టిమేటం! సెప్టెంబర్ రెండో వారం నుంచి వర్క్‌ టు రూల్ అమలు!
ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఉద్యోగుల అల్టిమేటం! సెప్టెంబర్ రెండో వారం నుంచి వర్క్‌ టు రూల్ అమలు!
Nikitha Godishala Murder Case: అమెరికాలో తెలుగు యువతి నిఖిత హత్యకేసులో కీలక పరిణామం! నిందితుడు ఆగ్రాలో అరెస్టు!
అమెరికాలో తెలుగు యువతి నిఖిత హత్యకేసులో కీలక పరిణామం! నిందితుడు ఆగ్రాలో అరెస్టు!
NTA New Director: NTAలో కీలక మార్పులు! కొత్త డైరెక్టర్లలో ఒకరు ఏపీ ఐఏఎస్‌ ప్రసన్న వెంకటేష్!
NTAలో కీలక మార్పులు! కొత్త డైరెక్టర్లలో ఒకరు ఏపీ ఐఏఎస్‌ ప్రసన్న వెంకటేష్!
PM Modi Rakhi Celebrations: పిల్లలతో కలిసి రాఖీ పండుగ జరుపుకున్న ప్రధాని!  
పిల్లలతో కలిసి రాఖీ పండుగ జరుపుకున్న ప్రధాని!  
Petrol, LPG Price Hike:పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మరింత పెరగనున్నాయి! భారీగా పెరిగిన చమురు దిగుమతి ఖర్చు!
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మరింత పెరగనున్నాయి! భారీగా పెరిగిన చమురు దిగుమతి ఖర్చు!
Nepal Earth Quake: నేపాల్-చైనా సరిహద్దుల్లో భూకంపం! పొంచి ఉన్న వరద ముప్పు!
నేపాల్-చైనా సరిహద్దుల్లో భూకంపం! పొంచి ఉన్న వరద ముప్పు!
Praggnanandhaa Record: ప్రజ్ఞానంద కొత్త చరిత్ర! గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు! 
ప్రజ్ఞానంద కొత్త చరిత్ర! గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు! 
NCLT: ఎన్‌సిఎల్‌టి అంటే ఏమిటి? సుభాష్ చంద్రకు చెందిన రూ. 22,000 కోట్ల అప్పు వివాదాన్ని ఎలా పరిష్కరించింది?
ఎన్‌సిఎల్‌టి అంటే ఏమిటి? సుభాష్ చంద్రకు చెందిన రూ. 22,000 కోట్ల అప్పు వివాదాన్ని ఎలా పరిష్కరించింది?
Embed widget