అన్వేషించండి

Hyderabad Regional Ring Road: ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంపై ముఖ్యమైన అప్‌డేట్- జాతీయ, రాష్ట్ర రహదారులను కలిపేలా 11 ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మాణం

Hyderabad News | హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తరభాగంలో జాతీయ, రాష్ట్ర రహదారులను 11 చోట్ల అనుసంధానం కానుంది. దాంతో వాహనాలు సిటీలోకి రాకుండానే జిల్లాల్లోకి వెళ్లనున్నాయి.

Hyderabad Regional Ring Road: హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ (Hyderabad Regional Ring Road) నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 162 కిలోమీటర్లు ఉన్న ఈ ఫోర్‌లేన్ రహదారికి రూ.8,500 కోట్లు అవుతుందని నేషనల్ హైవే అథార్టీ ఆఫ్‌ ఇండియా (NHAI) ఇదివరకే అంచనా వేసింది. ఈ మేరకు డీపీఆర్‌లో విషయాలు పొందుపరిచింది. హైదరాబాద్ ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంలో నిర్మించే 4 వరుసల రహదారికి 11 జాతీయ, రాష్ట్ర రహదారులు ఇంటర్ లింక్ కానున్నాయి. గ్రీన్‌ఫీల్డ్‌ రీజినల్‌ ఎక్స్‌ప్రెస్‌వే (Greenfiled Expressway)గా వ్యవహరించే హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా ఉండే మార్గాలతో సిటీలోకే కాదు, సిటీ శివారులోకి సైతం ఎంటర్ అవకాకుండానే నేరుగా ఇతర రాష్ట్రాలకు ప్రయాణం చేయవచ్చు అని అధికారులు చెబుతున్నారు. 

హైదరాబాద్‌ శివార్లలోకి సైతం రాకుండానే ఆర్ఆర్ఆర్ నుంచి పలు జిల్లా కేంద్రాలకు కూడా నేరుగా రాకపోకలు సాగించవచ్చు. దాంతో అంతర్రాష్ట్ర వాహనాలకు ట్రాఫిక్ సమస్యతో పాటు దూరం సైతం తగ్గనుంది. దీని ఫలితంగా హైదరాబాద్‌ రీజియన్‌లో సైతం ట్రాఫిక్ కష్టాలకు కొంతమేర ఊరట లభించనుంది. ఆర్ఆర్ఆర్ నుంచి రాష్ట్ర, జాతీయ రహదారులకు కనెక్టివిటీ పెరగడంతో భవిష్యత్తులో ఇది ఎకనామిక్‌ కారిడార్‌గా అభివృద్ధి చెందడానికి అవకాశాలున్నాయి. పదకొండు చోట్ల జాతీయ, రాష్ట్ర రహదారులతో ఆర్ఆర్ఆర్ అనుసంధానం అవుతున్న జిల్లాల్లోనూ మరింత వృద్ధి జరగనుంది. మెట్రో రైలు, ఫ్లై ఓవర్లు, ఓఆర్ఆర్‌తోనే హైదరాబాద్ రూపురేఖలు ఇలా మారిపోతే.. ఇక రీజనల్ రింగ్ రోడ్డు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ శివారు ప్రాంత రూపురేఖలు కూడా పూర్తిగా మారిపోతాయి

ఐదు ప్యాకేజీల్లో ఉత్తర భాగం పనులు
హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పనులను మొత్తం 5 ప్యాకేజీల్లో చేయాలని ప్లాన్ చేస్తున్నారు. భారత్‌మాల పరియోజన కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల మీదుగా నేషనల్ హైవే అథార్టీ ఆఫ్‌ ఇండియా (NHAI) దీన్ని నిర్మించనుంది. రోడ్లు, భవనాల శాఖకు సంబంధించిన అధికారుల సలహాలు, సూచనలు తీసుకుని ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం డిజైన్‌ చేశారు. హైదరాబాద్ ఔటర్‌ రింగ్‌ రోడ్డు (Hyderabad ORR)తో పాటు జాతీయ రహదారులు, ఇతర జిల్లా కేంద్రాలకు వెళ్లే రాష్ట్ర రహదారులు, మార్గాలను దృష్టిలో పెట్టుకుని ఇంటర్‌ఛేంజ్‌లను ఏర్పాటు చేస్తారు.

ఆర్ఆర్ఆర్ మొత్తం 11 ఇంటర్‌ఛేంజ్‌లతో పాటు టోల్‌ప్లాజాలు, సర్వీసు రోడ్లు, రెస్ట్‌రూంలు, బస్‌బేలు, ట్రక్‌ బేలు నిర్మించేలా ప్లానింగ్ జరుగుతోంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ నాలుగు లేన్లుకు నిర్మిస్తుండగా.. భవిష్యత్తులో అప్పటి అవసరాలకు తగ్గట్లుగా 8 లేన్లుగా విస్తరించే అవకాశం ఉంది. భూసేకరణ చేసి భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా రీ డిజైన్ చేయనున్నారు.

Also Read: Hyderabad Drunk And Drive Cases: మందుబాబుల జోరు - హైదరాబాద్‌లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly: డీలిమిటేషన్‌పై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం - ప్రక్రియ వాయిదా వేయాలని డిమాండ్
Telangana Assembly: డీలిమిటేషన్‌పై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం - ప్రక్రియ వాయిదా వేయాలని డిమాండ్
Kishan Reddy Letter : హెచ్‌సీయూ వద్ద భూములు వేలం వేయొద్దు- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ 
హెచ్‌సీయూ వద్ద భూములు వేలం వేయొద్దు- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ 
Andhra Pradesh Latest News:ఏపీలో లోకల్ రాజకీయ రచ్చ - పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు
ఏపీలో లోకల్ రాజకీయ రచ్చ - పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు
Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో నాలా రద్దు, అధికారులు విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో నాలా రద్దు, అధికారులు విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు: సీఎం చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SRH vs LSG Match Preview IPL 2025 | నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ | ABPKL Rahul Joins Delhi Capitals | నైట్ పార్టీలో నానా హంగామా చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ | ABP DesamRC 16 Ram Charan Peddi First Look | రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా RC16 టైటిల్, ఫస్ట్ లుక్ | ABP DesamRiyan Parag Fan touches Feet | రియాన్ పరాగ్ కాళ్లు మొక్కిన అభిమాని | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly: డీలిమిటేషన్‌పై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం - ప్రక్రియ వాయిదా వేయాలని డిమాండ్
Telangana Assembly: డీలిమిటేషన్‌పై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం - ప్రక్రియ వాయిదా వేయాలని డిమాండ్
Kishan Reddy Letter : హెచ్‌సీయూ వద్ద భూములు వేలం వేయొద్దు- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ 
హెచ్‌సీయూ వద్ద భూములు వేలం వేయొద్దు- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ 
Andhra Pradesh Latest News:ఏపీలో లోకల్ రాజకీయ రచ్చ - పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు
ఏపీలో లోకల్ రాజకీయ రచ్చ - పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు
Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో నాలా రద్దు, అధికారులు విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో నాలా రద్దు, అధికారులు విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు: సీఎం చంద్రబాబు
RC16: రామ్‌చరణ్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది - 'పెద్ది'గా గ్లోబల్ స్టార్, మాస్ లుక్ అదిరిపోయిందిగా..
రామ్‌చరణ్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది - 'పెద్ది'గా గ్లోబల్ స్టార్, మాస్ లుక్ అదిరిపోయిందిగా..
AP Inter Results 2025: పేరెంట్స్ వాట్సాప్‌కే ఏపీ ఇంటర్‌ ఫలితాలు! విడుదల ఎప్పుడు అంటే?
పేరెంట్స్ వాట్సాప్‌కే ఏపీ ఇంటర్‌ ఫలితాలు! విడుదల ఎప్పుడు అంటే?
The Raja Saab : కంగారు పడొద్దు డార్లింగ్స్... 'ది రాజా సాబ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది
కంగారు పడొద్దు డార్లింగ్స్... 'ది రాజా సాబ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది
Bank Account Nominee: బ్యాంక్‌ ఖాతాలో నలుగురు నామినీలు - నామినేషన్‌ లేకుండా ఖాతాదారు మరణిస్తే ఆ డబ్బు ఎవరికి ఇస్తారు?
బ్యాంక్‌ ఖాతాలో నలుగురు నామినీలు - నామినేషన్‌ లేకుండా ఖాతాదారు మరణిస్తే ఆ డబ్బు ఎవరికి ఇస్తారు?
Embed widget