అన్వేషించండి

KTR Quash Petition: కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !

Formula E Case: కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ ను అరెస్టు చేయవద్దని తెలిపింది.

KTR got a shock in the high court:  తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్ అయింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ తీర్పును రిజర్వ్ చేశారు. తీర్పు వెల్లడించే వరకూ కేటీఆర్ ను అరెస్టు చేయవద్దని తెలిపారు. 

కేటీఆర్ తరపున వాదనలు ఏమిటంటే ? 

కేటీఆర్ తరఫున  సుప్రీంకోర్టు లాయర్ సిద్దార్థ్ దావే వాదనలు వినిపించారు. కేటీఆర్ వేసిన కాష్ పిటిషన్ పై ఏసీబీ డీఎస్పీ  కౌంటర్ దాఖలు చేశారు. కేటీఆర్ పై ఉన్న నాట్ టు అరెస్ట్ ఎత్తివేయాలని  కౌంటర్ లో ఏసీబీ కోరింది.  అదే సమయంలో నాట్ టు  టు అరెస్ట్ పై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన కేటీఆర్ కూడా తన వాదనలు వినాలని కోరారు. డబ్బులు చేరిన సంస్థ ను నిందితుడిగా చేర్చలేదని కేటీఆర్ తరపు లాయర్ హైకోర్టుకు తెలిపారు. విచారణ కొనసాగే క్రమంలో నిందితుడిగా చేర్చవచ్చు కదా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ కేసులో 13(1)(a) సెక్షన్ అసలు వర్తించదని.. ఈ డబ్బుల ద్వారా లబ్ధి పొందింది కేటీఆర్ కాదన్నారు.  ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నప్పుడు పాలసీ నిర్ణయాలు తీసుకోకూడదు కానీ ఇక్కడ ముందుగానే ఉన్న అగ్రిమెంట్ ఇంప్లిమెంట్ చేసామమన్నారు. 

కేటీఆర్ పై 5 ఆరోపణలు చేశారని..  అనుమతి లేకుండా విదేశీ కరెన్సీ ను విదేశీ సంస్థకు  పంపడం,  అగ్రిమెంట్ లేకుండానే చెల్లింపులు చేయడం, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడే చెల్లింపులు  చేయడం,  FEO కు రెండు విడుతల్లో చెల్లించిన నిధులు ద్వారా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపమలు చేశారన్నారు.  నిధులు చేరిన FEO ను మాత్రం నిందితుల జాబితాలో చేర్చలేదని.. ఇక్కడ దర్డ్ పార్టీ లబ్ధి పొందింది అని చెప్తున్నారు కానీ థర్డ్ పార్టీ ఎవరో FIR లో ఎక్కడ చెప్పలేదన్నారు. డిసెంబర్ 18 సాయంత్రం 5:30కి కంపిటేoట్ అదారిటీ నుండి ఏసీబీ కి అనుమతి వచ్చింది.. డిసెంబర్ 19న ఏసీబీ FIR నమోదు చేసిందని ఇది కుట్రపూరితంగ ాజరిగిందన్నారు. 
అరవింద్ కుమార్ ఫైల్ పెట్టారు, కేటీఆర్ ఫైల్ పై సంతకం చేశారు, అంత మాత్రాన నిందితుడిగా చేరుస్తారా అని ప్రశఅనించారు. విదేశీ సంస్థ తో అగ్రిమెంట్ చేసుకోవద్దు అని నిబంధన ఉంటే  కేటీఆర్ తప్పు చేసినట్టు.. కానీ ఇక్కడ అగ్రిమెంట్ చేసుకుంటే తప్పు ఎలా అవుతుందని కేటీఆర్ తరపు లాయర్ ప్రశ్నించారు. 

ప్రభుత్వం తరపు వాదనలు ఏమిటంటే ..

FEO తో అగ్రిమెంట్ చేసుకున్నారు  కానీ దాని ద్వారా ఎలా లాభాలు వస్తాయో చెప్పలేదని అడ్వకేట్ జనరల్  సుదర్శన్ రెడ్డి తన వాదనలు వినిపించారు. మూడు దఫాలుగా నగదు బదిలీ చేశారు. రూ.  55 కోట్లు ఎలాంటి అనుమతులు లేకుండా FEO కి బదిలీ చేశారన్నారు. వాదనలు కొనసాగుతున్న సమయంలో ఏసీబీ దర్యాప్తు ఎక్కడ వరకు వచ్చిందని హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో ఎంత మంది స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ...ఎలాంటి ఆధారాలు సేకరించారని ప్రశ్నించింది న్యాయస్థానం.  ఇప్పటి వరకు ఫిర్యాదు దారుడు దాన కిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశామనికేసు విచారణ కొనసాగుతుంది .. విచారణ దశలో అన్ని ఆధారాలు బయట పడుతాయని ఏజీ కోర్టు తెలిపారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Chit Chat: కేసీఆర్‌కు అసెంబ్లీకి వచ్చే స్థాయి నిజంగానే లేదు  - కేటీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్
కేసీఆర్‌కు అసెంబ్లీకి వచ్చే స్థాయి నిజంగానే లేదు - కేటీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్
Andhra Pradesh Latest News: నెక్స్ట్‌ రోజా! అసెంబ్లీలో క్రీడల శాఖ మంత్రి కీలక ప్రకటన
నెక్స్ట్‌ రోజా! అసెంబ్లీలో క్రీడల శాఖ మంత్రి కీలక ప్రకటన
Tamil Nadu Vs Center: పార్లమెంట్‌లో  హిందీ మంటలు.. Uncivilised  అంటూ నోరు జారిన ధర్మేంద్ర ప్రధాన్, ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని హెచ్చరించిన స్టాలిన్
పార్లమెంట్‌లో  హిందీ మంటలు.. Uncivilised  అంటూ నోరు జారిన ధర్మేంద్ర ప్రధాన్, ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని హెచ్చరించిన స్టాలిన్
Andhra Pradesh Latest News : వర్మను పవన్ టార్గెట్ చేశారా? ఎమ్మెల్సీ పదవి ఇవ్వనీయకుండా సైడ్ చేశారా?
వర్మను పవన్ టార్గెట్ చేశారా? ఎమ్మెల్సీ పదవి ఇవ్వనీయకుండా సైడ్ చేశారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

DMK Uncivilised Heated Argument in Parliament | నోరు జారిన ధర్మేంద్ర ప్రధాన్..ఒళ్లు దగ్గర పెట్టుకోమన్న స్టాలిన్ | ABP DesamChampions Trophy 2025 Winners Team India | కాలు కదపకుండా ఆడి ట్రోఫీ కొట్టేశామా | ABP DesamRohit Sharma Virat Kohli Kolatam | వైట్ కోటులతో రచ్చ చేసిన టీమిండియా హీరోలు | ABP DesamRohit Sharma Fitness Champions Trophy 2025 | ఫిట్ నెస్ లేకుండానే రెండు ఐసీసీ ట్రోఫీలు కొట్టేస్తాడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Chit Chat: కేసీఆర్‌కు అసెంబ్లీకి వచ్చే స్థాయి నిజంగానే లేదు  - కేటీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్
కేసీఆర్‌కు అసెంబ్లీకి వచ్చే స్థాయి నిజంగానే లేదు - కేటీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్
Andhra Pradesh Latest News: నెక్స్ట్‌ రోజా! అసెంబ్లీలో క్రీడల శాఖ మంత్రి కీలక ప్రకటన
నెక్స్ట్‌ రోజా! అసెంబ్లీలో క్రీడల శాఖ మంత్రి కీలక ప్రకటన
Tamil Nadu Vs Center: పార్లమెంట్‌లో  హిందీ మంటలు.. Uncivilised  అంటూ నోరు జారిన ధర్మేంద్ర ప్రధాన్, ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని హెచ్చరించిన స్టాలిన్
పార్లమెంట్‌లో  హిందీ మంటలు.. Uncivilised  అంటూ నోరు జారిన ధర్మేంద్ర ప్రధాన్, ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని హెచ్చరించిన స్టాలిన్
Andhra Pradesh Latest News : వర్మను పవన్ టార్గెట్ చేశారా? ఎమ్మెల్సీ పదవి ఇవ్వనీయకుండా సైడ్ చేశారా?
వర్మను పవన్ టార్గెట్ చేశారా? ఎమ్మెల్సీ పదవి ఇవ్వనీయకుండా సైడ్ చేశారా?
Kannappa Love Song: పెదవుల శబ్దం, విరి ముద్దుల యుద్ధం.. ‘కన్నప్ప’ లవ్ సాంగ్ ఎలా ఉందంటే..
పెదవుల శబ్దం, విరి ముద్దుల యుద్ధం.. ‘కన్నప్ప’ లవ్ సాంగ్ ఎలా ఉందంటే..
Supreme Court: ప్రైవేటు భాగాలపై గాయాల్లేకపోతే రేప్ జరగలేదని నిర్ధారణ కాదు - 40 ఏళ్ల నాటి  కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
ప్రైవేటు భాగాలపై గాయాల్లేకపోతే రేప్ జరగలేదని నిర్ధారణ కాదు - 40 ఏళ్ల నాటి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
Case On Avinash Reddy: వేరే వ్యక్తి భార్యను కాపురానికి పోనివ్వని అవినాష్ రెడ్డి - పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త
వేరే వ్యక్తి భార్యను కాపురానికి పోనివ్వని అవినాష్ రెడ్డి - పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త
Viral Video: తల్లి కాళ్లు పట్టుకుంటే తండ్రిని కొట్టి చంపిన కూతుళ్లు -  ఇంత ఘోరమా ?
తల్లి కాళ్లు పట్టుకుంటే తండ్రిని కొట్టి చంపిన కూతుళ్లు - ఇంత ఘోరమా ?
Embed widget