Revanth Chit Chat: కేసీఆర్‌కు అసెంబ్లీకి వచ్చే స్థాయి నిజంగానే లేదు - కేటీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్
Telangana: కేసీఆర్ స్థాయి గల వాళ్లు ఎవరూ కాంగ్రెస్ లో లేరని చేసిన వ్యాఖ్యలపై రేవంత్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్సీల నామినేషన్ల పాల్గొన్న ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్డారు.

Revanth strong counter To KTR : కేసీఆర్ చెల్లని రూపాయి అని ఆయన గురించి మాట్లాడటం వృథా అని సీఎం రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్ చాట్‌లో వ్యాఖ్యానించారు. కేసీఆర్ స్థాయికి కాంగ్రెస్‌లో ఎవరూ సరిపోరని. వాళ్ల పిచ్చి మాటలు, దూషణలు, కారుకూతలు వినడానికి కేసీఆర్ అసెంబ్లీకి రాకూడదనేది తన అభిప్రాయని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ ఇలా స్పందించారు. కేటిఆర్ అన్నట్లు నిజంగానే అసెంబ్లీకి వచ్చే స్థాయి కేసీఆర్ కు లేదని సెటైర్ వేశారు. క్రిమినల్స్ కేసులకు భయపడరు. భయపడే వ్యక్తే అయితే నేరాలు చేయడన్నారు. కేసులకు తాను భయపడబోనని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఇలా స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో హరీష్ రావు బీజేపీకి పని చేశారని..ఆయన దగ్గర ఉండి బీజేపీకి ఓట్లు వేయించడం వల్లనే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందన్నారు. హరీష్ రావు బీజేపీకి పూర్తిగా లొంగిపోయాడని స్పష్టం చేశారు.
రైతులకు కష్టాలు ఎదురవుతున్నాని తెలిస్తే చాలు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పైశాచిక ఆనందం పొందుతున్నారని రేవంత్ అసహనం వ్యక్తం చేశాు. ఎస్ఎల్బీసీని పడావ్ పెట్టి కాళేశ్వరం కట్టిందని ఆరోపించారు. ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేసి ఉంటే..ఇవాళ ప్రమాదం జరిగేది కాదన్నారు. గతంలో రెండో పంట 35లక్షల ఎకరాలు వేశారు. కానీ ఇప్పుడు మొదటి సారి రాష్ట్రంలో 55 లక్షల ఎకరాలలో రైతులు పంటలు వేశారని గుర్తు చేశారు. కాళేశ్వరం కట్టామని చెప్పుకుంటున్నామని ఇప్పుడు కరువు వచ్చిందని అంటున్నారని మండిపడ్డారు.
తెలంగాణ ఇస్తున్న నిధులెంత.. కేంద్రం ఇస్తున్న నిధులెంతో తేల్చుకుందామని.. చర్చకు రావాలని కిషన్ రెడ్డికి రేవంత్ సవాల్ చేశారు. చర్చకు తాను, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వస్తామని కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చిద్దామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం నుండి ఎన్ని పన్నులు కట్టాం, వాళ్లు ఎన్ని ఇచ్చారో లెక్క తేలుద్దామని సవాల్ చేశారు. తెలంగాణకు అధిక నిధులు ఇచ్చినట్లు నిరూపిస్తే కిషన్‌రెడ్డికి సన్మాసం చేస్తామన్నారు. రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణకు వ్యతిరేకంగా ఈటల రాజేందర్, లక్షణ్ ఆందోళనలు చేస్తూ అడ్డుపడున్నారని.. మళ్లీ వాళ్లే భూసేకరణ చేయడం లేదని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాు. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేననన్నారు.
రాష్ట్ర సమస్యలపై చర్చించడానికి భట్టి విక్రమార్క అఖిలపక్షానికి ఆహ్వానిస్తే బీజేపీ నాయకులు ఎందుకు రాలేదో చెప్పాలని రేవంత్ సవాల్ చేశారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ సమావేశానికి కిషన్ రెడ్డి ఎందుకు రాలేదని నిలదీశారు. మోడీ బుల్లెట్ ట్రైన్ గుజరాత్ కి ఇచ్చారు మరి తెలంగాణ కు ఎందుకు ఏమీ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తాను ఢిల్లీకి వెళ్లి అడిగినందునే కాజీపేట కొచ్ ఫ్యాక్టరీ వచ్చిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం 39 సార్లు కాదు అవసరం అయితే 99 సార్లు ఢిల్లీకి వెళ్తానని రేవంత్ స్పష్టం చేశారు.





















