అన్వేషించండి

Vijayasai Reddy: విజయసాయిరెడ్డికి షాక్ - బుధవారం హాజరు కావాలని ఏపీసీఐడీ నోటీసులు

AP CID: విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. కాకినాడ పోర్టు కేసులో ఈ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.

AP CID issues notices to Vijayasai Reddy:  మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. బుధవారం విజయవాడ సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.  ఏ కేసులో అన్నదానిపై స్పష్టత లేదు కానీ.. కాకినాడ పోర్టు కేసులో కావొచ్చని భావిస్తున్నారు.  కాకినాడ పోర్టును బలవంతంగా రాయించుకున్నారన్న ఆరోపణలపై ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఈడీ కూడా విచారణకు పిలించింది కానీ సీఐడీ ఇంకా పిలువలేదు. ఆ కేసులో ఇప్పుడు విచారణకు పిలిచినట్లుగా భావిస్తున్నారు. నోటిసుల్లో 506, 384, 420, 109,467, 120(b) రెడ్ విత్ 34 BNS సెక్షన్లును పేర్కొన్నారు. ఇవి కఠినమైన సెక్షన్లుగానే భావిస్తున్నారు. 

కాకినాడ పోర్టు కేసులోనే నోటీసులు?                   

కాకినాడ సీపోర్టును బెదిరించి అన్యాయంగా వాటాలను రాయించుకున్నారని ఆ పోర్టు యజమాని కేవీ రావు  సీఐడీకి ఫిర్యాదు చేశారు.  ఈ కేసులో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్‌ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, అరబిందో ఫార్మాకు చెందిన శరత్‌ చంద్రారెడ్డి, చెన్నైకు చెందిన ఆడిటింగ్‌ కంపెనీ పీకేఎఫ్‌ ప్రతినిధులు సుందర్‌, విశ్వనాథ్‌, ప్రసన్నకుమార్‌, అపర్ణలను నిందితులుగా చేర్చారు. సెజ్‌ను తమ పేరుతో రాయించుకున్న అరబిందో ఇన్‌ఫ్రాను కేసులో చేర్చారు. వాటాలు రాసివ్వకపోతే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని కేవీ రావును బెదిరించి, భయపెట్టి అత్యధిక షేర్లను అరబిందో సంస్థ సొంతం చేసుకున్నారని కేవీ రావు ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డి ఈకేసులో విదేశాలకు పారిపోకుండా ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు.                      

ఇప్పటికే ఈడీ విచారణకు హాజరైన విజయసాయి                                   

ఈ కేసులో ఇప్పటికే ఈడీ కూడా విజయసాయిరెడ్డిని ప్రశ్నించింది. ఆ తర్వాత ఆయ న రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైసీపీకి కూడా రాజీనామా చేశారు. తాను పొలం పనులు చేసుకుంటానని ప్రకటించారు.అయితే ఆయన వచ్చే జూన్ లేదా జూలైలో బీజేపీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని చెబుతున్నారు. రాజకీయాల నుంచి విరమించుకున్నా ఆయనపై కేసులు కనసాగుతున్నాయి. ముఖ్యంగా కాకినాడ పోర్టు వ్యవహారంలో  ప్రభుత్వ అధికారాన్ని ఘోరంగా దుర్వినియోగం చేసి ఆస్తులు కాజేశారన్న ఆరోపణలను సీఐడీ  చాలా సీరియస్ గా తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.             

విచారణకు హాజరవుతారా ? 

అయితే పోర్టులో వాటాలను .. తిరిగి కేవీరావుకు ఇచ్చేసి రాజీ చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎంత నిజం ఉందో స్పష్టత లేదు.బుధవారం విజయసాయిరెడ్డి సీఐడీ ఎదుట హాజరు కానున్నారు. ఈ కేసులో ఆయనను అరెస్టు  చేయకూడదన్న ముందస్తు ఆదేశాలేమీ లేవు.  దీంతో విచారణకు హాజరవుతారా.. గడువు కోరుతారా అన్నది సస్పెన్స ్గా మారింది.  

టాప్ హెడ్ లైన్స్

Mudragada Padmanabham Passes Away: ముద్రగడ పద్మనాభం ఇక లేరు - తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లో కన్నుమూత
ముద్రగడ పద్మనాభం ఇక లేరు - తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లో కన్నుమూత
Breaking News: ముద్రగడ పద్మనాభ రెడ్డి కన్నుమూత!
ముద్రగడ పద్మనాభ రెడ్డి కన్నుమూత!
Singarayakonda Train Suicide: ఆస్తి కోసం బావను చంపాడు - భయంతో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు - సింగరాయకొండలో విషాదం
ఆస్తి కోసం బావను చంపాడు - భయంతో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు - సింగరాయకొండలో విషాదం
TTD Darshan Fraud Arrest: దర్శన టిక్కెట్ల పేరుతో లక్షల్లో మోసం - టీటీడీ మాజీ ఉద్యోగి అరెస్ట్ - భక్తులకు కీలక సూచనలు
దర్శన టిక్కెట్ల పేరుతో లక్షల్లో మోసం - టీటీడీ మాజీ ఉద్యోగి అరెస్ట్ - భక్తులకు కీలక సూచనలు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 1st ODI Result Update: తొలి వ‌న్డేలో టీమిండియా ఈజీ విక్ట‌రీ.. యూకే టూర్ లో తొలి విజ‌యం.. స‌త్తా చాటిన గిల్, అక్ష‌ర్, వాషింగ్ట‌న్
తొలి వ‌న్డేలో టీమిండియా ఈజీ విక్ట‌రీ.. యూకే టూర్ లో తొలి విజ‌యం.. స‌త్తా చాటిన గిల్, అక్ష‌ర్, వాషింగ్ట‌న్
HMDA Chief Engineer ACB Raids: హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
Kerala Lottery Raghavan Story: జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
Kohli Milestones Show: కోహ్లీ కెరీర్ లో మైండ్ బ్లాకింగ్ ట్రిపుల్ సెంచరీ మార్క్.. స‌చిన్, ద్ర‌విడ్ స‌ర‌స‌న కింగ్..
కోహ్లీ కెరీర్ లో మైండ్ బ్లాకింగ్ ట్రిపుల్ సెంచరీ మార్క్.. స‌చిన్, ద్ర‌విడ్ స‌ర‌స‌న కింగ్..
This Week Theatrical Releases : ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
Jabardasth Faima: పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
Embed widget