అన్వేషించండి

Boatman: కుంభమేళాలో కోట్లు సంపాదించిన బోట్ మ్యాన్ మామూలోడు కాదు - హత్య కేసులతో పాటు చాలా పెద్ద రికార్డే ఉందట !

Maha Kumbh: మహాకుంభ్‌లో ఓ వ్యక్తి నెలన్నరలో ముఫ్పై కోట్లు సంపాదించారని సీఎం ఆదిత్యనాథ్ కూడా గొప్పగా ప్రకటించారు. కానీ ఆ బోట్ మ్యాన్ నొటొరియస్ క్రిమినల్ అని తాజాగా తేలింది.

Boatman istory Sheeter:  మహాకుంభమేళా వైభవంగా జరిగింది. వేల కోట్ల వ్యాపారం జరిగిందని యూపీ సీఎం ఆదిత్యనాథ్ ప్రకటించారు.  ఇందుకు ఉదాహరణగా ఆయన ఓ బోట్ మ్యాన్ గురించి చెప్పారు. ఆయన కుటుంబం నెలలో ముఫ్పై కోట్లు సంపాదించిందని.. ఇలా ఎంతో మంది ఆర్థికంగా బాగుపడ్డారన్నారు. దీంతో పింటూ మహారా అనే బోట్ మ్యాన్ జాతీయంగా వైరల్ అయ్యారు. ఇప్పుడు ఆయన గురించి తెలుస్తున్న అసలు నిజం ఏమిటంటే.. ఆయన పెద్ద హిస్టరీ షీటర్, జంట హత్తుల కేసులతో పాటు చాలా నేరాలు ఆయనపై ఉన్నాయి. 

సాధారణ బోట్ మ్యాన్ 30 కోట్లు సంపాదించాడని యోగి ప్రశంస            

ఆ కుటుంబం తమకు ముఫ్పై కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పడం లేదు.  వారు తమ వద్ద 130 పడవలు ఉన్నాయని చెబుతున్నారు. ఎంత ఆదాయం వచ్చిందో మాత్రం రచెప్పలేదు. యోగి ఈ కుటుంబం గురించి చెప్పడంతో అందరూ పింటూ మహారా గురించి ఆరా తీశారు.  ఆ కుటుంబానికి ఊహించనంత నేర చరిత్ర ఉంది. చాలా మంది తీవ్ర నేరాలు చేసి జైలుకెళ్లారు. తీవ్రమైన సెక్షన్ల కింద నమోదైన 21 క్రిమినల్ కేసుల్లో పింటు పేరు కూడా ఉంది.  గూండా చట్టం , గ్యాంగ్‌స్టర్ చట్టం కింద అతనిపై రెండుసార్లు చర్యలు తీసుకున్నారు. అంతే కాదుఆధిపత్య పోరాటంలో వీరి కుటుంబంలోని ఐదుగురు సభ్యులు హత్యకు గుయ్యారు.  చుట్టుపక్కల ప్రాంతంలో బెదిరింపులు ,మాఫియా ఇమేజ్ ఈ కుటుంబానికి ఉంది.                 

బోట్ మ్యాన్ పింటూ కుటుంబం అంతా నేరస్తులే            

పింటు మహారాపై హత్య, దోపిడీ ఆరోపణలు ఉన్నాయి. పింటుపై మొదటి కేసు 2005లో నమోదైంది. అప్పుడు అతనికి 23 సంవత్సరాలు. అతనికి హత్య, హత్యాయత్నం  దోపిడీతో సహా 21 తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో ప్రమేయం ఉందని పోలీసులు చెబుతున్నారు. పలుమార్లు జైలుకు వెళ్లాడు.  చాలా సంవత్సరాలు జైలులో ఉన్న తర్వాత  ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యాడు. జైలులో ఉన్నప్పుడు  కూడా అతను బెదిరింపులు కొనసాగించాడు. ఈ విషయం తెలియడంతో అతన్ని వేరే జైలుకు తరలించారు. పింటూపై హిస్టరీ షీట్ ప్రయాగ్‌రాజ్‌లోని నైని పోలీస్ స్టేషన్‌ ఉంది.             

మాఫియా పోరాటంలో పింటూ కుటుంబసభ్యులు కూడా హతం 

పింటు తండ్రి రామ్ సహరే అలియాస్ బచ్చా మహారా ఒక క్రూరమైన నేరస్థుడని పోలీసులు చెబుతున్నారు. ఆయన జైల్లోనే చనిపోయాడు.  పింటూ అన్నయ్య ఆనంద్ మహారా కూడా ఒక క్రూరమైన నేరస్థుడని.. అతను గ్యాంగ్ వార్ లో చనిపోయాడని పోలీసు రికార్డుల్లో ఉంది.  క్రిమినల్ రికార్డులతో పాటు, పింటు ప్రయాగ్‌రాజ్‌లోని సంగం ఒడ్డున మొత్తం పడవ  సిండికేట్ నడుపుతున్నాడు.ఇతర పడవలు నడిపేవారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు.  పింటు తల్లి శుక్లవతి దేవి విద్యుత్ శాఖలో రిజిస్టర్డ్ కాంట్రాక్టర్. ఆమెకు చాలా పనులు .. కుంభమేళా సందర్భంగా దక్కాయి. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం- లోయలో పడిన కారు, 13 మంది మృతి 
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం- లోయలో పడిన కారు, 13 మంది మృతి 
Raj Kundra Legal War: రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
NTA 47 Officials Removed: నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
CJP Protest: రెండు డిమాండ్లకు ప్రభుత్వం సిద్ధం! ధర్మేంద్ర రాజీనామా వీడని చిక్కుముడి! రెండో విడత సమావేశంలో ఏం జరిగిందో తెలుసుకోండి!
రెండు డిమాండ్లకు ప్రభుత్వం సిద్ధం! ధర్మేంద్ర రాజీనామా వీడని చిక్కుముడి! రెండో విడత సమావేశంలో ఏం జరిగిందో తెలుసుకోండి!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget