Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని
తెలుగు బుల్లితెర వీక్షకులను ఆకట్టుకుంటున్న సీరియల్ 'కార్తీక దీపం'. ఈ సీరియల్ కీ సీక్వెల్ గా వస్తుంది 'కార్తీక దీపం' 2. ఈ సీరియల్‌లో 'మాలిని' పాత్రతో మెప్పిస్తున్న నటి తేజస్విని ప్రకాష్. 1987 జులై 12న కర్ణాటకలో జన్మించిన ఈమె, బెంగళూరులోనే తన ఎడ్యుకేషన్ పూర్తి చేసింది. 2007లో 'మాతాడ్ మాతాడు మల్లిగే' చిత్రం ద్వారా కన్నడ సినీ రంగంలోకి అడుగుపెట్టిన తేజస్విని, 'గజ', 'అరమనే' వంటి హిట్ చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది.
టాలీవుడ్‌లో తన పేరును 'తనీష్క'గా మార్చుకుని ‘ప్రతిక్షణం’, ‘కట్ చేస్తే’ వంటి సినిమాల్లో అలరించింది. 2022లో తెలుగు బిజినెస్‌మన్ ఫణి వర్మను వివాహం చేసుకున్న ఈ కన్నడ భామ, ప్రస్తుతం 'కార్తీక దీపం 2' సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
ఈ సీరియల్‌లో ప్రాధాన్యత ఉన్న పాత్ర కావడంతో ఒక్కో ఎపిసోడ్‌కు 15,000 నుండి 25,000 వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తేజస్విని, షూటింగ్ విశేషాలను అభిమానులతో పంచుకుంటుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















