Jagadhatri Serial Today August 11th: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
Jagadhatri Serial Today Episode August 11th: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ

Jagadhatri Serial Today Episode: జీతెలుగు ఛానెల్‌లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది. గణపతి కోర్టులో నోరు విప్పితే తమకు తిప్పలు తప్పవని మినిస్టర్, ఆయన కొడుకు టెన్షన్ పడుతుంటే మీనన్ వచ్చి గణపతిని స్టేషన్‌లోనే చంపేస్తున్నామని చెబుతాడు. బస్తీ జనాలతో స్టేషన్ ముందు గొడవ చేయించిన మీనన్...వాళ్లలో తన మనుషులను పంపి గణపతి హత్యకు ప్లాన్ వేస్తాడు.సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన జేడీ, కేడీ గణపతిని కాపాడి...అసలు అతని వెనక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయడంతో ఈరోజు ఎపిసోడ్ ఆసక్తిగా సాగుతుంది.
గణపతి హత్యకు మీనన్ కుట్ర
గణపతిని కోర్టు తీసుకెళ్తున్నారని తెలుసుకుని మినిస్టర్ చాలా కంగారుపడతాడు. ఆ గణపతిగాడు కోర్టులో భయపడి నిజం చెప్పేస్తాడేమోనని ఆందోళన చెందుతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మీనన్...మీకు అలాంటి భయం అక్కర్లేదని...గణపతిని స్టేషన్‌లోనే చంపేయడానికి ప్లాన్ వేశాననిచ చెప్పడంతో మినిస్టర్ రిలాక్స్ అవుతాడు. ఎలా అంటే...తమ బస్తీ పిల్లను రేప్ చేసి చంపినవాడిని వదిలిపెట్టొద్దంటూ బస్తీ జనాలను రెచ్చగొట్టి స్టేషన్ మీదకు ఉసిగొల్పుతామని అంటాడు. ఆ జనంలో మనవాళ్లు కలిసిపోయి ఆ గణపతిని లేపేస్తారని చెబుతాడు. ప్లాన్ అదిరిపోయిందని మినిస్టర్ మెచ్చుకుంటాడు.
గణపతిని కాపాడిని జేడీ,కేడీ
మినిస్టర్, మీనన్ కుట్రలు తెలిసిన జగధాత్రి ఏదో కీడు శంకిస్తుంది. ఎందుకైనా మంచిదని ఎస్‌ఐకి ఫోన్ చేసి అలెర్ట్‌గా ఉండమని చెబుతుంది.ఇంతలో బస్తీ జనం చాలామంది స్టేషన్ ముట్టడించారని కానిస్టేబుల్ చెబుతాడు. ఎస్‌ఐ బయటకు వెళ్లి అందరూ వెళ్లిపోవాలని హెచ్చరిస్తాడు. మా బస్తీ అమ్మాయిని చంపినవాడిని మాకు అప్పగించాలంటూ వాళ్లు గొడవకు దిగుతారు. స్టేషన్‌పై దాడికి ప్రయత్నిస్తారు. ఇంతలో మీనన్ తన మనుషులతో అక్కడికి చేరుకుని జనంలో కలిపిపోయి గణపతిని ఎలా హత్య చేయాలో ప్లాన్ చెబుతాడు.ఇంతలో ఎస్‌ఐ గన్ తీసి గాల్లో కాల్పులు జరుపుతాడు. అబ్బా మాకు కావాల్సింది కూడా ఇదేనని మీనన్ సంబరపడిపోతాడు. తన మనుషులను జనంలో కలిసిపొమ్మని చెబుతాడు.వాళ్లు పోలీసులను కొట్టుకుంటూ స్టేషన్ లోపలకి వెళ్లిపోతారు.
అక్కడ గణపతిని పట్టుకుని చంపడానికి ప్రయత్నిస్తుండగా జేడీ,కేడీ అక్కడికి చేరుకుని రౌడీలను చితక్కొడతారు. గణపతిని ప్రాణాలతో కాపాడతారు. ఇప్పటికైనా నిజం చెప్పమని....అసలు ఎందుకు నువ్వు ఈ కేసులో ఇరుక్కున్నావని అడుగుతారు. నువ్వు చేయని తప్పును ఎందుకు మీద వేసుకున్నావని అడుగుతారు. అయినా కానీ గణపతి వారి మాటలు వినడు. పద్మను తానే రేప్ చేసి హత్య చేశానని అంటాడు. దీంతో గణపతి ఎట్టిపరిస్థితుల్లోనూ నోరుతెరవడని జేడీకి అర్థమవుతుంది.
గణపతి బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసిన జేడీ
గణపతి కేసులో ఇరుక్కుంటే ఏమవుతుందో తెలిసినా ఇంత బలంగా నేరం అంగీకరిస్తున్నాడంటే...వెనక బలమైన కారణం ఏదో ఉంటుందని జేడీ అంటుంది. అసలు గణపతి ఇంటికి వెళ్తే ఏం జరిగిందో తెలిసిపోతుందని చెబుతుంది. దీంతో అందరూ కలిసి గణపతి ఇంటికి వెళ్తారు. జేడీ,కేడీ, సంధ్య ముగ్గురు కలిసి గణపతి ఫ్రెండ్స్ అని చెప్పి ఇంట్లోకి వెళ్తారు. గణపతి ఇలా కేసులో ఇరుక్కుంటాడని అనుకోలేదంంటూ నాటకం మొదలుపెడతారు. ఇంట్లో గణపతి తండ్రి సోఫాలోనే పడుకుని ఉండటం చూసి ఆరా తీస్తారు. రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడం వల్ల ఇటీవలే 20లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించామని.. వాళ్లు నోరుజారతారు. అంత డబ్బులు మీకు ఎక్కడి నుంచి వచ్చాయని అడిగితే...మా గణపతి కష్టపడి సంపాదించి దాచుకున్న డబ్బులతో పాటు మా పుట్టింటి వాళ్లు ఇచ్చిన నగలు అమ్మామని గణపతి తల్లి చెబుతంది. దీంతో వాళ్లు అబద్ధం చెబుతున్నారని అర్థం చేసుకున్న జేడీ....మరో ప్లాన్ అమలు చేస్తుంది.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు





















