India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విక్టరీతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. వైభవ్ సూర్యవంశీ సిక్సర్లు, ఫోర్లతో హోరెత్తించాడు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వేను భారత బౌలర్లు ఒత్తిడిలోకి నెట్టారు. 20 ఓవర్లలో జింబాబ్వే 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ బౌలర్లలో మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌తో రెండేసి వికెట్లుతీసాడు.
ఛేజింగ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ త్వరగానే నిష్క్రమించినా, వైభవ్ సూర్యవంశీ తో పాటు ఇషాన్ కిషన్ సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. ఆ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ చివరకు 126 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 13.2 ఓవర్లలోనే పూర్తి చేసింది. ఈ సాలిడ్ గెలుపుతో ఎనిమిది మ్యాచ్‌ల తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఖాతాలో ఒక మంచి విజయం చేరింది.
ట్రెండింగ్ వార్తలు






















