అన్వేషించండి

Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్

Hyderabad News | హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ బ్రిడ్జిపై యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో నడిపిన మైనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా, జువైనల్ బోర్డు నెలరోజుల కమ్యూనిటీ సర్వీస్ శిక్ష విధించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మైనర్ ఆటో డ్రైవర్ చాదర్‌ఘాట్ బ్రిడ్జిపై అసభ్యంగా ప్రవర్తించాడు.
  • వైరల్ వీడియో ఆధారంగా మైనర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
  • జువైనల్ బోర్డు అతనికి నెలరోజుల కమ్యూనిటీ సేవను విధించింది.

Minor Auto Driver News | హైదరాబాద్: ఇటీవల నడిరోడ్డుపైనే భరితెగిస్తూ కొందరు యువత పిచ్చి చేష్టలకు పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాలలో చిన్న శిక్షలతో బయటపడుతుండగా, కొన్ని తప్పిదాల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. తాజాగా నగరంలో ఓ యువకుడి అసభ్యకర ప్రవర్తన వైరల్ అవుతోంది. చాదర్‌ఘాట్ బ్రిడ్జిపై ఓ యువకుడు ఒక యువతిని తన ఒళ్లో కూర్చోబెట్టుకుని ప్రమాదకరంగా, అసభ్యంగా ఆటో నడుపుతున్నాడు. తనతో పాటు ప్రజల భద్రతకు ముప్పు కలిగిస్తూ, నిర్లక్ష్యంగా వాహనం నడిపిన ఈ ఘటనపై చాదర్‌ఘాట్ పోలీసులు తక్షణమే స్పందించి కేసు నమోదు చేశారు. వీడియో ఆధారంగా ఆటో నంబర్ (TG05T4061) సహాయంతో వాహనాన్ని నడుపుతున్న యువకుడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా, అతడు మైనర్ అని విచారణలో తేలింది.

శిక్ష విధించిన జువైనల్ జస్టిస్ బోర్డ్

ఆటోలో డ్రైవింగ్ సీట్లో కూర్చుని తన ఒడిలో యువతిని కూర్చోబెట్టుకుని ప్రమాదకరంగా వ్యవహరించిన కేసులో మైనర్ నిందితుడిని జువైనల్ జస్టిస్ బోర్డు (JJB) ముందు ప్రవేశపెట్టగా బోర్డు అతడికి శిక్ష విధించింది. నాంపల్లి రెడ్ హిల్స్‌లోని జువైనల్ బోర్డు ఆఫీస్‌లో నెలరోజుల పాటు ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కమ్యూనిటీ సర్వీస్ (ఆఫీస్ సేవలు) చేయాలని ఆదేశించింది. నగరంలో రోడ్డు భద్రతను సవాల్ చేయడంతో పాటు, అసభ్య ప్రవర్తనకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు ఈ కేసు ద్వారా మరోసారి స్పష్టం చేశారు. యువతి వివరాలు తెలియాల్సి ఉంది.

జనాలకు చిరాకు పుట్టిస్తున్న మైనర్లు

ఇటీవలి కాలంలో హైదరాబాద్‌ నగరంలో ఇలాంటి బాధ్యతారాహిత్యమైన, రీల్స్ పిచ్చి ఘటనలు వరుసగా వెలుగుచూస్తూ సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. కొద్దిరోజుల క్రితం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై అలాగే ఔటర్ రింగ్ రోడ్డుపై వేగంగా వెళ్లే కార్ల సన్‌రూఫ్‌ల నుంచి బయటకు వచ్చి ప్రమాదకర రీతిలో డాన్సులు చేస్తూ రీల్స్ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. మరొక ఘటనలో రద్దీగా ఉండే మెట్రో రైళ్లలో ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తూ డ్యాన్సులు, స్టంట్లు చేసిన యువతపై మెట్రో అధికారులు, పోలీసులు కేసులు నమోదు చేసి భారీగా జరిమానాలు విధించడం తెలిసిందే.

Also Read: Rains In AP and Telangana: రుతుపవనాలపై ఎల్‌నినో ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: ఐఎండీ

కొన్ని రోజుల కిందట రంగారెడ్డి జిల్లాలో ఓ ఎస్సై అయితే ఆరేళ్ల తన మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తూ ఇతరుల ప్రాణాలను సైతం రిస్కులో పెట్టాడు. బాధ్యతాయుతమైన జాబ్ చేస్తున్న పోలీస్ ఇలా చేయడంపై ఆ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్నతాధికారుల దృష్టికి విషయం వెళ్లగా కేసు నమోదు చేశారు.  ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. 

Frequently Asked Questions

చాదర్‌ఘాట్ బ్రిడ్జిపై జరిగిన సంఘటన ఏమిటి?

ఓ మైనర్ యువకుడు ఒక యువతిని తన ఒళ్లో కూర్చోబెట్టుకుని ప్రమాదకరంగా, అసభ్యకరంగా ఆటో నడిపాడు. ప్రజల భద్రతకు ముప్పు కలిగించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ సంఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?

వీడియో ఆధారంగా పోలీసులు ఆటో నంబర్‌ను గుర్తించి, మైనర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు మైనర్ అని విచారణలో తేలింది.

మైనర్ డ్రైవర్‌కు ఎలాంటి శిక్ష విధించారు?

జువైనల్ జస్టిస్ బోర్డు నాంపల్లి రెడ్ హిల్స్‌లోని కార్యాలయంలో ఒక నెలపాటు ప్రతిరోజూ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కమ్యూనిటీ సేవలు చేయాలని ఆదేశించింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Ajay Devgn: బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
Embed widget