అన్వేషించండి

Rains In AP and Telangana: రుతుపవనాలపై ఎల్‌నినో ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: ఐఎండీ

Andhra Pradesh Rains | ఏపీ, తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారనుంది. ఎల్‌నినో ప్రభావంతో పలు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో వర్షాలు తగ్గుముఖం పట్టనున్నాయని వాతావరణశాఖ అంచనా వేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలంగాణలో ఉరుములు, ఈదురు గాలులు; రైతులు, కార్మికులు జాగ్రత్త.

Telangana Rains | అమరావతి/ హైదరాబాద్: ఎల్‌నినో కారణంగా పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయని, ఇది నైరుతి రుతుపవనాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3 రోజుల్లో తూర్పు, ఈశాన్య భారతదేశంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతాయని అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. వారం రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమలతో పాటు తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు కురవనున్నాయిన వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఎల్‌నినో కారణంగా ఈ ఏడాది భారత్‌లో పలు రాష్ట్రాల్లో తక్కువ వర్షపాతం నమోదవుతోంది. వాతావరణ శాఖ అంచనా వేసినట్లుగానే పలు రాష్ట్రాల్లో లోటు వర్షపాతం కనిపిస్తోంది.

ఏపీలో ఈ జిల్లాలకు వర్ష సూచన

మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) శుక్రవారం రాష్ట్రంలో కురిసే వర్షాలపై అప్డేడ్ ఇచ్చింది. నేడు విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు (పోలవరం ప్రాంతం), కాకినాడ, ఎన్టీఆర్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు, ముఖ్యంగా రైతులు పిడుగులు పడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

తెలంగాణలో ఒక్కసారిగా మారనున్న వాతావరణం

తెలంగాణలో వాతావరణం అకస్మాత్తుగా మారనుందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. జూలై 24వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ కేంద్రం సూచించింది. రాబోయే రోజుల్లో ఉరుములు, మెరుపుల ప్రభావం క్రమంగా తగ్గిపోనుండటంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఎలాంటి అలర్ట్ జారీ చేయలేదు.

Also Read: KTR Revanth Globarena: గ్లోబరీనా వివాదం - రేవంత్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు.. తీవ్ర వ్యాఖ్యలు!

పలు జిల్లాల్లో మలమైన ఈదురు గాలులు

వరంగల్, మహబూబాబాద్‌తో పాటు ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు వాతావరణ శాఖ గ్రీన్ అలెర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో ఎలాంటి తీవ్రమైన వాతావరణ ముప్పు లేదని, కొన్ని చోట్ల మాత్రం గాలుల ప్రభావం స్వల్పంగా కనిపించే అవకాశం ఉందని తెలిపింది. పెద్దగా వర్షాల ముప్పు లేకపోయినప్పటికీ, ఉత్తరాన ఆదిలాబాద్ నుంచి దక్షిణాన జోగులాంబ గద్వాల వరకు అన్ని జిల్లాల్లోనూ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. రెండేళ్ల కిందట భారీ వర్షాలతో ఖమ్మం, కామారెడ్డిలో భారీ వరదలు సంభవించి ప్రాణ నష్టం జరగడం తెలిసిందే.

బలమైన ఈదురుగాలుల ప్రభావం వల్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఆరుబయట ఉండేవారు, చెరువులు, కుంటలు, జలాశయాల సమీపంలో పనిచేసేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రయాణాల్లో గాలుల ఉధృతికి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నందున వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. వర్షాల సమయంలో రైతులు, కార్మికులు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

Frequently Asked Questions

తెలంగాణలో రాబోయే రోజుల్లో వాతావరణ అంచనా ఏమిటి, ప్రజలకు ఎలాంటి సూచనలు చేశారు?

జూలై 24న కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉండవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ప్రజలు, ముఖ్యంగా ఆరుబయట ఉండేవారు జాగ్రత్తగా ఉండాలి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Rebel BRA MLAs looking back | ఫిరాయింపు ఎమ్మెల్యేల ‘రివర్స్ గేర్’.. గులాబీ గూటివైపు చూపులు?
Rebel BRA MLAs looking back | ఫిరాయింపు ఎమ్మెల్యేల ‘రివర్స్ గేర్’.. గులాబీ గూటివైపు చూపులు?
Telangana Graduate MLC Elections 2027: పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా పోటీకి యువనేతలు పోటాపోటీ -అన్ని పార్టీలు యువతకే ప్రాధాన్యం ఇవ్వనున్నాయా?
పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా పోటీకి యువనేతలు పోటాపోటీ -అన్ని పార్టీలు యువతకే ప్రాధాన్యం ఇవ్వనున్నాయా?
SIR Enumeration Uncollectable Votes: తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తున్న SIR ప్రక్షాళన - లక్షల్లో ఓట్ల గల్లంతు - వాళ్లంతా ఏమయ్యారు?
తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తున్న SIR ప్రక్షాళన - లక్షల్లో ఓట్ల గల్లంతు - వాళ్లంతా ఏమయ్యారు?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Ajay Devgn: బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
Embed widget