అన్వేషించండి

Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!

విచారణ ఎదుర్కొంటున్న అన్నమయ్య జిల్లా పీజీఆర్‌ఎస్ తహసీల్దార్ శ్రీనివాసులు చిత్తూరు సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం సెలవులో ఉన్న ఆయన సూసైడ్ చేసుకున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో శ్రీనివాసులు సెలవులో ఉన్నారు.

రైలు కింద పడి ఎమ్మార్వో శ్రీనివాసులు ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో విషాదం

విచారణ ఎదుర్కొంటున్న అన్నమయ్య జిల్లా పీజీఆర్‌ఎస్ తహసీల్దార్ శ్రీనివాసులు చిత్తూరు సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం సెలవులో ఉన్న ఆయన సూసైడ్ చేసుకున్నారు. 

చిత్తూరు: అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ ఎమ్మార్వో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా  కలెక్టరేట్ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ (PGRS) విభాగంలో ఎమ్మార్వోగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసులు గురువారం సూసైడ్ చేసుకున్నారు. చిత్తూరు నగర సమీపంలోని సిద్ధంపల్లె వద్ద రైలు కింద పడి ప్రాణాలు విడిచారు. సాయంత్రం దాదాపు 6.30 గంటలకు తమిళనాడులోని కాట్పాడి నుంచి చిత్తూరు వైపు వస్తున్న మెము ఎక్స్‌ప్రెస్ రైలు సిద్ధంపల్లె సమీపిస్తుండగా, ఆయన ఒక్కసారిగా పట్టాలపైకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు.

 2024 సాధారణ ఎన్నికల సమయంలో శ్రీనివాసులు రామాపురం తహసీల్దారుగా పనిచేశారు. ఎన్నికలు ముగిసిన అనంతరం ఆయన లక్కిరెడ్డిపల్లెకు బదిలీ అయ్యారు. ఆ సమయంలో పీజీఆర్‌ఎస్ ద్వారా వచ్చిన ఒక ఫిర్యాదుపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి.. సంబంధిత వీఆర్వో వెంకటరమణను సస్పెండ్ చేయగా, తహసీల్దార్ శ్రీనివాసులును కలెక్టరేట్‌లోని కోనేరు రంగారావు రిఫార్మ్స్ కమిటీ (KRRC) విభాగానికి ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆ తర్వాత జిల్లా కేంద్రం మదనపల్లెకు మారడంతో ఆయన పీజీఆర్‌ఎస్ విభాగంలో పనిచేస్తున్నారు. ఆయనపై వచ్చిన అభియోగాలపై ఇటీవల విచారణ పూర్తి చేసిన ఉన్నతాధికారులు, విధుల్లో తప్పులు దొర్లాయనే అంశంపై సీసీఎల్‌ఏ (CCLA)కు నివేదిక అందించినట్లు తెలిసింది.

గత కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాసులు ప్రస్తుతం సెలవులో ఉన్నారు. అనారోగ్య సమస్యకు చికిత్స తీసుకుంటున్నారు. ఆయన భార్య కూడా ఇదే జిల్లాలోని సదుం (MPDOగా పనిచేస్తూ, ఇటీవల అనారోగ్య కారణాలతో సెలవులో ఉన్నట్లు సమాచారం. శ్రీనివాసులు కుమార్తె ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లగా, కుమారుడు పదో తరగతి చదువుతున్నాడు. తహసీల్దార్ ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు జీఆర్‌పీఎస్ రైల్వే పోలీసులు వెల్లడించారు.

Frequently Asked Questions

శ్రీనివాసులుపై విచారణ ఎందుకు జరుగుతోంది?

2024 ఎన్నికల సమయంలో రామాపురం తహసీల్దారుగా ఉన్నప్పుడు ఒక ఫిర్యాదుపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఈ కారణంగా ఆయన బదిలీ అయ్యారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Chandra Babu About Mega DSC 2025: మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget