India News: ప్రతి మహిళకు ఒక్కో మర్డర్ చేసుకునే అనుమతి ఇవ్వండి: రాష్ట్రపతి కి లేఖ రాసిన NCP
ప్రతీ మహిళకు ఒక్కో మర్డర్ చేసుకునే అనుమతి ఇవ్వండి : రాష్ట్రపతి కి లేఖ రాసిన NCP

దేశం లోని ప్రతీ మహిళకు ఒక్కో మర్డర్ చేసుకునే వీలు ఉండాలని మహిళలపై పెరిగిపోతున్న హింస, అత్యాచారాల నుండి తమను తాము రక్షించుకునేలా అవసరమైతే ఒక హత్య చేసుకునే స్త్రీలకు ఉండాలంటూ మహారాష్ట్రలోని శరద్ పవార్ కు చెందిన ఎన్సీపీ (నేషనల్ కాంగ్రెస్ పార్టీ ) మహిళా విభాగం అధ్యక్షురాలు రోహిణి ఖడ్సే రాష్ట్రపతి ద్రౌపతి మురుముకు ఒక లేఖ రాయడం దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. రెండు రోజుల క్రితం ముంబైలో 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన కలకలం సృష్టించింది. ఆ సంఘటనను అడ్రెస్ చేస్తూ రోహిణి ఈ లేఖ రాశారు.
భారతదేశ బుద్ధుడు గాంధీ నడయాడిన నేల అని కాంతి అహింసలు నిలయమైన మన దేశంలో ఇటీవల కాలంలో స్త్రీలపై అత్యాచారాలు హింసలు ఎక్కువైపోతున్నాయని ఆడవాళ్ళ పై అఘాయిత్యాలకు పాల్పడే మానవ మృగాలను అంతమొందించేందుకు మహిళలకు ఒక అవకాశం కల్పించాలని అందుకే అలాంటి పరిస్థితుల్లో ఒక హత్య చేసినా చట్టం నుంచి ఇమ్యూనిటీ కల్పించాలంటూ రోహిణి ఖడ్సే రాష్ట్రపతికి లేఖ రాశారు. ఇటీవల కాలంలో ఆసియా లోనే ఇండియా అత్యంత అసురక్షిత దేశం గా మారిందని మహిళలకు ఇక్కడ రక్షణ లేదని ఒక సర్వేలో తేలిందని ఆమె తన లేఖ లో పేర్కొన్నారు. మహిళల రక్షణ కోసం పూర్వకాలం లో రాణి తారా అహల్య దేవి హోల్కర్ కత్తి దూశారని ప్రస్తుత కాలంలో మహిళల రక్షణ కోసం చేసే ఒకే ఒక హత్య లాంటి ఒక్క తప్పును క్షమించాలి అంటూ రోహిణి ఖడ్సే కోరారు. కిడ్నాప్ లు, అత్యాచారాలు, ఉమెన్ ట్రాఫికింగ్, గృహ హింస వంటి నేరాలు మహిళలపై పెరిగిపోతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ఇజ్రాయేల్ టూరిస్టు పై అత్యాచారం
ఒకవైపు మహారాష్ట్రలో రోహిణి ఖడ్సే ఇలా లేఖ రాస్తున్న సమయంలోనే మరోవైపు హంపి సందర్శన కు వచ్చిన ఇజ్రాయిల్ టూరిస్టుపై అత్యాచారం జరిగిందన్న వార్త దేశ ప్రజలను షాక్ కు గురిచేసింది. కర్ణాటకలోని చారిత్రక నగరం హంపి ని చూడడానికి వచ్చిన ఇజ్రాయిల్ టూరిస్టుపై అత్యాచారం చేసి సహచరుడ్ని నీటిలోకి తోసేసి హత్య చేసిన ఘటన ఒక్కసారిగా అందర్నీ భయపెట్టింది. దీనికి సంబంధించిన వార్తలు నెట్ లో వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఆ ఘటనకు కారణమైన ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా ఎటు చూసినా మహిళలపై పెరిగిపోతున్న అత్యాచారాలను దృష్టిలో పెట్టుకుని స్త్రీలు చట్టపరంగా తమకు కొన్ని అనుమతులు కావాలంటూ కోరడంలో తప్పు లేదని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.





















