Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో భారత్ విజయంపై టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సంతోషం వ్యక్తం చేశాడు. మయాంక్ యాదవ్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనే తమ విజయానికి పునాది వేసిందని శ్రేయస్ అన్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసిన సంగతి తెలిసిందే.
పిచ్‌పై ఉన్న బౌన్స్‌ను మయాంక్ యాదవ్ చాలా చక్కగా ఉపయోగించుకున్నాడని, ప్రత్యర్థి బ్యాటర్లకు అస్సలు అవకాశం ఇవ్వకుండా పరుగులు కట్టడి చేశాడని మెచ్చుకున్నాడు శ్రేయస్. మయాంక్ వేసిన సాలిడ్ స్పెల్ తమ విజయానికి ప్లాట్‌ఫామ్ సెట్ చేసిందని, ఆ తర్వాత పవర్ ప్లేలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో పనిని చాలా తేలికగా పూర్తి చేశాడని తెలిపాడు.
వైభవ్ సూర్యవంశీని భయం ఎరుగని 'ఫియర్‌లెస్ బ్యాటర్' అని అభివర్ణించిన శ్రేయస్.. అతడి ఆత్మవిశ్వాసం, మైదానంలో ఆడిన విధానం సూపర్ అని ప్రశంసించాడు. యంగ్ ప్లేయర్స్ ఇంతలా రాణించడం ఈ మూడు టీ20ల సిరీస్‌కి చాలా మంచి ఆరంభమని, రాబోయే మ్యాచ్‌లలో కూడా ఇదే ఊపును కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
ట్రెండింగ్ వార్తలు






















