అన్వేషించండి

KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!

KTR: NEET పేపర్ లీకేజీలు, నిరుద్యోగంపై మోదీ వైఖరిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. Gen Z శక్తిని తక్కువ అంచనా వేయవద్దని, కేసీఆర్ కూడా విద్యార్థి పోరాటంలోకి దిగుతారని స్పష్టం చేశారు.

NEET Paper Leak Issue BRS Dharna:  దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థను పట్టిపీడిస్తున్న పేపర్ లీకేజీలు, నిరుద్యోగ సమస్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ నేటి యువత,  జెన్-జీ' తరం పవర్‌ను అంచనా వేయడంలో తీవ్రంగా పొరపడుతున్నారని ఆయన మండిపడ్డారు. నీట్ లీకేజీకి వ్యతిరేకంగా.. విద్యా మంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్ తో ఇందిరాపార్క్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఇందులో పాల్గొన్న విద్యార్థులను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించారు.  దేశ యువత స్వరం మారుతోందని, కొత్త ఆలోచనలతో కూడిన ఈ తరం రాజకీయాలను పునర్నిర్మిస్తోందని స్పష్టం చేశారు. నేపాల్, శ్రీలంకల్లో ఇటీవల చోటుచేసుకున్న ప్రజా తిరుగుబాట్లను ఉదాహరణగా చూపుతూ, యువత ఏకమై రోడ్డెక్కితే ఎంతటి నిరంకుశ ప్రభుత్వాలైనా కూలిపోక తప్పదని కేటీఆర్ ఘాటు హెచ్చరికలు జారీ చేశారు.

ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న పాలకులు యవత ఆకాంక్షలను విస్మరిస్తే ఎదురయ్యే పరిణామాలు దారుణంగా ఉంటాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ తరం చావుకు భయపడదు. ఆకలి, నిరుద్యోగం, భవిష్యత్తుపై అభద్రతాభావంతో వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఆగ్రహం అడుగడుగునా ఉవ్వెత్తున లేచి మోదీ ప్రభుత్వానికి సవాలు విసరడం ఖాయం. ఈ విషయాన్ని మోదీ గుర్తుంచుకోవాలి  అని ఆయన స్పష్టం చేశారు. ఒకవైపు నిరుద్యోగ సమస్యలతో నలిగిపోతున్న యువతకు ఆసరాగా నిలవాల్సింది పోయి, ప్రచార ఆర్భాటాలకే పరిమితమవడం సరికాదని విమర్శించారు.

ప్రధాని మోదీ ప్రచార శైలిపై నేరుగా ప్రశ్నలు సంధించిన కేటీఆర్.. టీవీల్లో, మీడియాలో ఆర్నెళ్లకోసారి  పరీక్ష పే చర్చ  పేరుతో ఉపన్యాసాలు దంచే ప్రధాని, దేశవ్యాప్తంగా వరుసగా జరుగుతున్న పోటీ పరీక్షల పేపర్ లీకేజీలపై ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు, వారి ఏళ్ల తరబడి కష్టం ప్రశ్నార్థకంగా మారుతుంటే కేంద్రం మౌనం వహించడం విద్యార్థి లోకాన్ని ద్రోహం చేయడమేనని అన్నారు. ఢిల్లీ వేదికగా ఆందోళన బాట పట్టిన విద్యార్థులకు, నిరుద్యోగులకు బీఆర్ఎస్ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఢిల్లీ మరియు దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా స్పందించారని కేటీఆర్ వెల్లడించారు. సోషల్ మీడియాలో విద్యార్థుల పోరాటాలను చూసి కేసీఆర్ చలించిపోయారని, విద్యార్థులకు మద్దతుగా అవసరమైతే కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ప్రత్యక్ష పోరాటంలో పాల్గొంటారని ప్రకటించారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా  ఈ దేశ స్వరూపాన్ని మార్చేది, భవిష్యత్తును కాపాడేది యువతే  అని కేసీఆర్ చెప్పిన మాటలను ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తుచేశారు.  

తెలంగాణ నుంచి జాతీయ స్థాయి వరకు విద్యార్థి, నిరుద్యోగ పోరాటాలకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. బిఆర్ఎస్ విద్యార్థి విభాగం   నేతలను ఇప్పటికే ఢిల్లీకి పంపి నిరసనల్లో భాగస్వాములను చేస్తున్నామని, కేంద్రం దిగివచ్చి విద్యావ్యవస్థలో పారదర్శకత తీసుకొచ్చే వరకు ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. యువత ఆగ్రహ జ్వాలలకు కేంద్రం సమాధానం చెప్పుకోక తప్పదని, విద్యార్థుల వైపు నిలబడటమే బీఆర్ఎస్ ప్రథమ ప్రాధాన్యత అని కేటీఆర్  పేర్కొన్నారు.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Embed widget