అన్వేషించండి

CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు

NEET Paper Leak పై విద్యార్థుల ఆందోళనలతో ప్రధాని నరేంద్ర మోదీ చర్యలకు హామీ ఇచ్చారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటు, అధికారుల బదిలీలు వేగవంతం కాగా, వాంగ్‌చుక్ దీక్ష విరమించి చర్చలకు అంగీకరించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నీట్ పేపర్ లీక్, నిరసనలపై మోదీ కఠిన చర్యలు హామీ.
  • లీకేజీలపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టు, అధికారులు బదిలీ; వాంగ్‌చుక్ దీక్ష విరమణ.
  • సీజేపీ కేంద్రంతో చర్చలకు అంగీకరించగా, బంద్ పిలుపు కొనసాగుతోంది.

PM Modi on NEET Paper Leak | న్యూఢిల్లీ: నీట్‌ పేపర్ లీక్ వ్యవహారంపై విద్యార్థులు, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో దేశవ్యాప్తంగా ఈ అంశం హాట్ టాపిక్ యింది. ముఖ్యంగా దేశ రాజకీయాలు సైతం దీని చుట్టే తిరుగుతున్నాయి. పార్లమెంటులోనూ నీట్ పేపర్ లీక్‌పై చర్చ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు వాంగ్ చుక్ దీక్ష కొనసాగుతున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగి లీకేజీలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

యువత భవిష్యత్తును కాలరాసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, అందుకోసం పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా బిల్లు తెస్తున్నట్లు గురువారం అర్ధరాత్రి ఓ వీడియోలో తెలిపారు. పేపర్ లీక్ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు నరకప్రాయంగా ఉంటుందని, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రీఎగ్జామ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ సమస్యపై ఫాస్ట్ కోర్ట్ ఏర్పాటు చేసి విచారణ జరుపుతామని అంతకుముందే మోదీ కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఓ ఫాస్ట్ ట్రాక్ కోర్టును సైతం నోటిఫై చేసింది. మరోవైపు, ఈ అంశంపై 26 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ గురువారం అర్ధరాత్రి దీక్ష విరమించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లు హాస్పిటల్‌కు వెళ్లి కేంద్రం తీసుకుంటున్న చర్యలను, ప్రధాని మోదీ ప్రకటనను వివరించి, విజ్ఞప్తి మేరకు మేదాంత ఆసుపత్రిలో తన దీక్షను విరమించి నిమ్మరసం తాగారు. దేశంలో హింస చెలరేగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాంగ్‌చుక్ తెలిపారు. కేంద్రం తమ డిమాండ్లు, సమస్యలపై చర్చలు జరపాలని కోరారు.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ లీకేజీ కేసులపై వేగవంతమైన విచారణ జరిపేందుకు ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు ప్రాంగణంలో స్పెషల్ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును నోటిఫై చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కోర్టుకు న్యాయాధికారిగా జస్టిస్ అను గ్రోవర్‌ను  నియమించారు. దీంతో పాటు విద్యాశాఖలో ప్రక్షాళన చేపడుతూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్‌ జోషిని పంచాయతీరాజ్‌ శాఖకు బదిలీ చేసి, ఆయన స్థానంలో నరేశ్‌ గంగ్వార్‌ను నియమించారు. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా టీకే అనిల్‌ కుమార్‌ను నియమించారు. వినీత్ జోషి గతంలో ఎన్టీఏ డైరెక్టర్ జనరల్‌గా, సీబీఎస్ఈ చైర్మన్‌గా వ్యవహరించారని తెలిసిందే.

Also Read: PM Modi On Paper Leak: పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్

శుక్రవారం మధ్యాహ్నం సీజేపీ నేతలతో కేంద్రం చర్చలు 

నీట్ సహా ఇతర ఎగ్జామ్ పేపర్ల లీక్, సీబీఎస్ఈ ఎగ్జామ్ నిర్వహణలో లోపాలు జరిగాయని ఆరోపిస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్న కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది. ప్రధాని హామీని, జేపీ నడ్డా ఆహ్వానాన్ని తిరస్కరించిన సీజేపీ నాయకులు.. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మోదీ చేసిన ప్రకటనలతో దిగొచ్చిన సీజేపీ నేతలు  శుక్రవారం మధ్యాహ్నం ఒక తటస్థ వేదికపై కేంద్ర మంత్రులతో చర్చలు జరిపేందుకు అంగీకరించారు. దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు, జిల్లా కేంద్రాల్లో నిరసనలకు సీజేపీ నేతలు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమానికి రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు కొందరు మద్దతు తెలిపారు. విద్యార్థుల జీవితాలు ముఖ్యమని, చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

మరోవైపు, ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు రాహుల్ గాంధీ నివాసంలో సమావేశమై తమ తదుపరి ప్లాన్ రెడీ చేసుకున్నారు. అనంతరం వారు పాదయాత్రగా హోం మంత్రి అమిత్ షా ఇంటి వైపు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నీట్ లీకేజీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు గాంధీ స్మృతి వద్ద నివాళులర్పించారు. మహారాష్ట్రలోని అహిల్యానగర్‌లో ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే కూడా విద్యార్థులకు మద్దతుగా 2 గంటల పాటు మౌన దీక్ష చేపట్టారు. ఓవైపు సోనమ్ వాంగ్ చుక్ దీక్ష విరమించడం, మరోవైపు సీజేపీ నేతలతో కేంద్రం చర్చలు జరపనుండటం శుభపరిణామంగా చెప్పవచ్చు.

Frequently Asked Questions

నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితి ఉంది?

నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. విద్యార్థులు, సీజేపీ ఆందోళనలు, రాజకీయ చర్చలతో ఈ అంశం తీవ్రరూపం దాల్చింది.

నీట్ లీకేజీలపై ప్రధాని మోదీ ఎలాంటి హామీలు ఇచ్చారు?

లీకేజీలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. యువత భవిష్యత్తు కోసం రీఎగ్జామ్ నిర్వహించి, పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా బిల్లు తెస్తామని ప్రకటించారు.

ఢిల్లీ హైకోర్టు ఈ సమస్యపై ఎలాంటి చర్యలు తీసుకుంది?

నీట్ పేపర్ లీక్‌ల విచారణ కోసం ఢిల్లీ హైకోర్టు ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టును నోటిఫై చేసింది. రౌస్‌ అవెన్యూ కోర్టు ప్రాంగణంలో దీన్ని ఏర్పాటు చేశారు.

సోనమ్ వాంగ్‌చుక్ తన దీక్షను ఎందుకు విరమించారు?

కేంద్ర మంత్రులు ప్రధాని ప్రకటనను వివరించడంతో, దేశంలో హింస చెలరేగకూడదనే ఉద్దేశంతో సోనమ్ వాంగ్‌చుక్ తన 26 రోజుల దీక్షను విరమించారు.

కేంద్ర విద్యాశాఖలో ఎలాంటి ప్రక్షాళన చర్యలు చేపట్టారు?

ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్‌ జోషిని పంచాయతీరాజ్‌కు బదిలీ చేసి, నరేశ్‌ గంగ్వార్‌ను నియమించారు. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా టీకే అనిల్‌ కుమార్‌ను నియమించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Independence Day 2026 PM Modi Speech Highlights: సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
CJP Instagram: స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీజేఐకి షాక్! ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్‌! అభిజిత్ దీప్కే ఆగ్రహం !
స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీజేఐకి షాక్! ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్‌! అభిజిత్ దీప్కే ఆగ్రహం !
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Embed widget