అన్వేషించండి

PM Modi On Paper Leak: పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్

పేపర్ లీకేజీలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చర్యలను వివరించారు. బాధ్యులపై చర్యలు, ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటుతో పాటు త్వరలోనే పార్లమెంటులో కొత్త బిల్లు ప్రవేశపెడతామని స్పష్టం చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రశ్నాపత్రాల లీకేజీలకు కఠిన చర్యలు, కొత్త బిల్లు ప్రధాని మోదీ.
  • లీకేజీ కేసుల విచారణకు ఢిల్లీ ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు.
  • ప్రభుత్వ హామీతో సోనమ్ వాంగ్‌చుక్ 26 రోజుల దీక్ష విరమించారు.

న్యూఢిల్లీ: పేపర్‌ లీక్‌ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని, బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీలకు శాశ్వతంగా చెక్‌ పెట్టేందుకు వీలుగా ఒక కొత్త బిల్లును తీసుకొస్తామని, శుక్రవారం జరిగే కేంద్ర క్యాబినెట్‌ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు గురువారం అర్ధరాత్రి ఓ వీడియోలో వెల్లడించారు. ఈ యాంటీ పేపర్ లీక్ బిల్లును అతి త్వరలోనే పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింపజేస్తామని తెలిపారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని మోదీ ప్రకటించడం తెలిసిందే. అయినప్పటికీ ప్రధాని మోదీ అర్ధరాత్రి ఈ అంశంపై రెండోసారి స్పందిస్తూ ప్రభుత్వం ఏం చేయబోతుందో వెల్లడించారు. 

పేపర్‌ లీక్‌ అనేది సాధారణ విషయం కాదు.  లక్షలాది మంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తుంది. పేపర్ లీకేజీలకు బాధ్యులైన నిందితులను ఇప్పటికే అరెస్టు చేసి జైలుకు పంపించాం.  విద్యార్థుల విద్యా సంవత్సరం వృథా కాకుండా ఉండాలని ప్రభుత్వం రీఎగ్జామ్ నిర్వహించింది. ఈ సమస్యను కూకటి వేళ్లతో పెకలించేందుకు గత అనేక కఠిన చర్యలు తీసుకున్నాం. పేపర్ లీకేజీ కేసుల విచారణ వేగవంతం చేసేందుకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఆదేశించాం. నేడు జరిగే కేబినెట్ భేటీలో పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా బిల్లుపై చర్చిస్తాం. పార్లమెంట్‌లో త్వరలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంటామని’ వీడియోలో ప్రధాని మోదీ పేర్కొక్నారు.

ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు

పరీక్షల లీకేజీలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఢిల్లీ హైకోర్టు ఈ కేసులను త్వరితగతిన విచారించేందుకు ఒక ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును నోటిఫై చేసింది. ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు ప్రాంగణంలో ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు కానుండగా జస్టిస్ అను గ్రోవర్‌ దీని కార్యకలాపాలను పర్యవేక్షిస్తారని హైకోర్టు స్పష్టం చేసింది. నీట్‌ తదితర పోటీ పరీక్షల లీకేజీ వ్యవహారాలకు సంబంధించిన కేసుల విచారణ ఈ కోర్టు చేపట్టనుంది. 

Also Read: Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!

దీక్ష విరమించిన వాంగ్‌చుక్..


నీట్‌ పేపర్ లీక్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విద్యార్థులకు మద్దతుగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు, విద్యావేత్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమించారు. గురువారం అర్ధరాత్రి కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లు ఆసుపత్రికి వెళ్లి వాంగ్‌చుక్‌ను పరామర్శించారు. ఆయన  డిమాండ్లను పరిష్కరిస్తామని ప్రభుత్వం తరఫున స్పష్టమైన హామీ ఇవ్వడంతో, నిమ్మరసం ఇచ్చి ఆయనతో దీక్ష విరమింపజేశారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడంతో 26 రోజుల తరువాత వాంగ్ చుక్ దీక్ష విరమించారు. కేంద్ర మంత్రులు శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు సీజేపీ ప్రతినిధులు, సోనమ్ వాంగ్‌చుక్‌లతో చర్చలు జరపన్నారు.

విద్యాశాఖ కార్యదర్శి బదిలీ

మరోవైపు నీట్‌ లీకేజీ వ్యవహారంలో వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర విద్యాశాఖలో పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేసింది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వినీత్ జోషిని పంచాయతీరాజ్ శాఖకు బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో నరేశ్‌ కుమార్‌ గంగ్వార్‌ను నియమించింది. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి బాధ్యతలను టీకే అనిల్‌ కుమార్‌కు అప్పగించింది. నీట్‌ లీకేజీ ఆరోపణలు, సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల మూల్యాంకన వివాదాలతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న సమయంలో కేంద్రం చర్యలు చేపట్టింది. 

Frequently Asked Questions

పేపర్ లీకేజీలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది?

పేపర్ లీకేజీలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త బిల్లును తీసుకొస్తుంది. శుక్రవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుని, త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.

పేపర్ లీక్ కేసుల విచారణకు ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఎక్కడ ఉంది?

ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ప్రాంగణంలో ఈ ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు కానుంది. జస్టిస్ అను గ్రోవర్ దీని కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు.

సోనమ్ వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను ఎందుకు విరమించారు?

కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లు వాంగ్‌చుక్‌ను పరామర్శించి, ఆయన డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుండి సానుకూల స్పందన రావడంతో ఆయన 26 రోజుల తరువాత దీక్ష విరమించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
India Census 2027: జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Independence Day 2026 PM Modi Speech Highlights: సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
Advertisement

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget