Andhra Pradesh Latest News : వర్మను పవన్ టార్గెట్ చేశారా? ఎమ్మెల్సీ పదవి ఇవ్వనీయకుండా సైడ్ చేశారా?
Andhra Pradesh Latest News : ఎమ్మెల్సీ సీటు రాలేదని వర్మ అలిగారా? అయన్ని నిజంగానే తొక్కేసే ప్రక్రియ కొనసాగుతోందా? అది జనసేనే చేస్తుందా?

Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్‌లో నడుస్తున్న రాజకీయం ఎవరికీ అర్థం కావడం లేదు. కొత్తగా ఖాళీ అయిన 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎవరిని ఎంపిక చేస్తారని ఆదివారం వరకు అత్కంఠ నడిచింది. పేర్లు ప్రకటించిన తర్వాత ఒక్కసారి అంతా షాక్ అయ్యారు. ఎవరూ ఊహించని పేర్లు కనిపించే సరికి పార్టీ నేతలకే సౌండ్ లేకుండా పోయింది. ఐదు సీట్లలో ఒకటి బీజేపీకి, మరొకటి జనసేనకు కేటాయించారు. మిగిలిన మూడు సీట్లను కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, బీద రవిచంద్రకు ఇచ్చారు.
వర్మ పేరు ఖాయం!
అప్పటి వరకు చాలా పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఎన్ని పేర్లు ప్రచారంలో ఉన్నా పవన్ కల్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మ పేరు ఖాయం అనుకున్నారు అంతా. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామని ఎన్నికలకు ముందే ఒప్పందం జరిగినట్టు ప్రచారం సాగింది. పవన్ కల్యాణ్ విజయం కోసం ఆయన ఊరూరా తిరిగారు. తనకు సీటు ఇవ్వలేదన్న బాధ లేకుండా కూటమి విజయం కోసం శ్రమించారు.
వర్మకు షాక్ ఇచ్చిన అధినాయకత్వం
ఇన్ని లెక్కలు పెట్టుకొని వర్మకు కచ్చితంగా ఈసారి ఎమ్మెల్సీ సీటు ఖాయమని అంతా భావించారు. కానీ లిస్ట్ వచ్చే సరికి వర్మ పేరు లేదు. ఇది ఆయనతోపాటు చాలా మంది టీడీపీ అభిమానలకు బాధించింది. వచ్చిన జాబితాలో తన పేరు లేకపోవడంతో బాధత వర్మ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి సైలెంట్ అయిపోయారు. ఏం జరుగుతుందో ఆయన అభిమానులు, టీడీపీ కేడర్ అర్థం కాలేదు.
తీవ్ర గందరగోళం మధ్య పిఠాపురం వర్మ మీడియా ముందుకు వచ్చారు. తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. పార్టీ నేతలు మాట్లాడటంతో ఆయన వాస్తవంలోకి వచ్చారు. కచ్చితంగా సీటు వస్తుందని అనుకున్న తరుణంలో ఇలా జరగడంపై తన బాధను వారి వద్ద వెల్లగక్కారు.
చంద్రబాబు, లోకేష్ నిర్ణయానికే వదిలేసిన వర్మ
సీటు రాలేదని బాధ ఉన్నప్పటికీ ఏ పరిస్థితిల్లో చంద్రబాబు, లోకేష్ ఈ నిర్ణయం తీసుకున్నారో తెలుసు అన్నారు. వాళ్ల నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టు ప్రకటించారు. తాను పిఠాపురం ప్రజల కోసం ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తూ వచ్చానని చెప్పారు. ఎలాంటి బాధ్యతలు అప్పగించినా చేస్తానని చెప్పుకొచ్చారు.
ఎవర్నీ తొక్కే ఉద్దేశం లేదన్న నాదెండ్ల
మరోవైపు వర్మకు సీటు ఇవ్వకపోవడంపై మంత్ర నాదెండ్ల మనోహర్ కూడా స్పందించారు. వర్మను తొక్కేయాల్సిన అవసరం ఎవరికీ లేదని అన్నారు. ఆయనకు టికెట్ ఎందుకు రాలేదో ఆ పార్టీ వ్యవహారమని అన్నారు. అందులో జనసేనకు కానీ, పవన్ కల్యాణ్‌కు కానీ సంబంధం లేదని చెప్పుకొచ్చారు.
మొత్తానికి ఎమ్మెల్సీ సీట్ల వ్యవహారం టీడీపీలో మాత్రం చాలా హాట్ టాపిక్ అయ్యింది. అసలు వర్మకు సీటు ఇవ్వలేదని అసంతృప్తితో ఉన్న టైంలోనే బీజేపీ నుంచి సోము వీర్రాజుకు ఛాన్స్ ఇవ్వడం మరింత కోపాన్ని తెప్పించింది. వైసీపీకి అనుకూలంగా ఉంటూ చంద్రబాబు, లోకేష్‌ను తిట్టిన వ్యక్తి ఇవ్వడంపై గరం గరం అవుతున్నారు. ఈ రెండింటిపై ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సెన్సేషనల్ డిస్కషన్స్ జరుగుతున్నాయి.





















